మేఘమాల - పుస్తకావిష్కరణ
- Gadwala Somanna
- 4 hours ago
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Meghamala, #మేఘమాల, #బాలగేయాలు, #పుస్తకావిష్కరణ

గద్వాల సోమన్న "మేఘమాల" పుస్తకావిష్కరణ విజయవాడలో
Meghamala - Book Unveiling ceremony At Vijayawada - Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 18/08/2025
మేఘమాల - పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం
రచన: గద్వాల సోమన్న
నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త బాలబంధు గద్వాల సోమన్న రచించిన 76వ పుస్తకం "మేఘమాల"పుస్తకావిష్కరణ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ (IMA), గవర్నర్ పేట, విజయవాడలో ఘనంగా జరిగింది. విశ్వ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన జాతీయ శతాధిక కవి సమ్మేళనం పురస్కరించుకొని, ఆ సంస్థ అధ్యక్షరాలు కొల్లి రమావతి, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు, ప్రముఖ సాహితీవేత్త, ప్రధాన కార్యదర్శి ప్రపంచ తెలుగు రచయితల సంఘం డా. జి. వి. పూర్ణచందు, ప్రసంగ ప్రజ్ఞానిధి డా. గుమ్మా సాంబశివరావు, గుఱ్ఱం జాషువా కళాపరిషత్ అధ్యక్షులు పెద్దీటి డా. యోహాను, ప్రముఖ పద్యకవి అయినాల మల్లేశ్వర రావు మరియు విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద పుస్తకావిష్కరణ గావించారు. అనంతరం ఈ పుస్తకాన్ని విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ తిరువాయిపేట శ్రీనివాసులు దంపతులకు అంకితమిచ్చారు. అంకితమిచ్చారు. అత్యల్ప కాల వ్యవధిలో 76 పుస్తకాలు ముద్రించి, పలు చోట్ల ఆవిష్కరించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న కవి రవి గద్వాల సోమన్న విశేష కృషికిగాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, ఏ. యస్. ఐ దుబ్బ భాస్కరరావు, కొప్పుల ప్రసాద్, బుర్రి విజయకుమార రాజ, ఈ వేమన మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. 'మేఘమాల 'కృతికర్త గద్వాల సోమన్నను పాఠశాల హెడ్మాస్టర్ ఏ. జాన్సన్, తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు అభినందించారు.
-గద్వాల సోమన్న
Comments