top of page

మేటి మహిళామణులు

Updated: Mar 14

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #MetiMahilamanulu, #మేటిమహిళామణులు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 28

Meti Mahilamanulu - Somanna Gari Kavithalu Part 28 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 07/03/2025

మేటి మహిళామణులు - సోమన్న గారి కవితలు పార్ట్ 28 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


మేటి మహిళామణులు


ఇంటిలోన దీపము

ప్రేమకు ప్రతిరూపము

చూడంగా మహిళలు

సృష్టికి ఆధారము


అసమానము త్యాగము

అభివృద్ధికి జీవము

వనితలున్న లోకము

తలపించును నాకము


స్త్రీలుంటే కళకళ

తారల్లా మిలమిల

అనునిత్యం గృహమున

సెలయేరుల గలగల


గౌరవానికర్హులు

మహిని మహిళామణులు

ఆదరిస్తే గనుక

అడుగడుగునా శుభములు

ree



















మహిళలను గౌరవించు

----------------------------------------

కంటిలోని కాంతులు

ఇంటిలోని వనితలు

వారుంటే మోదము

వర్ధిల్లును గృహములు


అభివృద్ధికి బాటలు

గుబాళించు తోటలు

లోకంలో మహిళలు

నాకంలో దేవతలు


త్యాగానికి గురుతులు

వెలిగే క్రొవ్వొత్తులు

వారి నోట మాటలు

జీవజలపు ఊటలు


స్త్రీ మూర్తుల మనసులు

నాజూకు అద్దములు

జాగ్రత్త! అవసరము

లేక అగును ముక్కలు


ఇంతులుండు స్థలాన

దేవతలు నడయాడు

మహిళలు లేని ఇల్లు

అగునోయ్! వల్లకాడు


స్త్రీలను గౌరవించు!

హక్కులను రక్షించు!

వారి అభివృద్ధికిల

ఒక్కింత ఆశించు!

ree










వనితలుంటే వసుధ

----------------------------------------

గగనానికి తారలు

వదనానికి నగవులు

అందానికి అందము

సదనానికి వనితలు


తోటలోన పూవులు

దివ్వెలోన వెలుగులు

ఎంతో ఉపయోగము

ఇంటిలోన ఇంతులు


కొలనులోని కలువలు

చెరువులోని జలములు

ముగ్ధమనోహరమే

పుడమిలోని మగువలు


విలువైనవి సేవలు

పంచుతారు ప్రేమలు

జగతిలోన మహిళలు

దిద్దుతారు గృహములు


అక్షర సరాలతో

కృతజ్ఞత భావంతో

వనితలకు వందనము

భువిని కైమోడ్పులతో

ree
















అమ్మ ఒడి మెత్తన

----------------------------------------

వెన్నలాగ మెత్తన

వెన్నెల్లా చల్లన

అమ్మ ఒడి పిల్లలకు

కల్గించును సాంత్వన


అమ్మ ఒడి ప్రేమ బడి

నిజముగా దైవ గుడి

విలువలను బోధించి

సరిచేయును నడవడి


అమ్మయే తొలి గురువు

సంతతికి కల్పతరువు

ప్రేమగా బుజ్జగించి

దించును గుండె బరువు


ఘనమైనది త్యాగము

అమ్మ ఇంట దీపము

ఆమె లేని గృహమున

ఆనందము శూన్యము

ree














అమ్మ నోట ఆణిముత్యాలు

----------------------------------------

కష్టాల లోయలో

నష్టాల బాటలో

ధైర్యాన్ని నింపుకో!

గుండె దిటవు చేసుకో!


ఓటమి సమయంలో

నిరాశ,నిస్పృహలో

ఓర్పును ధరించుకో!

నేర్పును అలవర్చుకో!


అవమాన వేళలో

ప్రతికూల పరిస్థితిలో

ఆందోళన మానుకో!

అవగాహన పెంచుకో!


లోకాన్ని చదువుకో!

శోకాన్ని వదులుకో

పాఠాలు నేర్చుకో!

జీవితాన్ని దిద్దుకో!


-గద్వాల సోమన్న


Comments


bottom of page