top of page

మోహిని

#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #Mohini, #మోహిని, #TeluguCrimeStory, #కొసమెరుపు


Mohini - New Telugu Story Written By Veereswara Rao Moola

Published In manatelugukathalu.com On 07/05/2025

మోహిని - తెలుగు కథ

రచన: వీరేశ్వర రావు మూల


మోహిని సినీ జగత్తులో తిరుగులేని కధానాయకురాలు. 


తన ముప్పై ఏళ్ళ సిని ప్రస్థానం లో ఎన్నో హిట్లు ఇచ్చింది. తెలుగు కే పరిమితం కాకుండా కన్నడ, మళయాళం, తమిళం మరియు హిందీ సినిమాలలో నటించి ఎందరో అభిమానుల గుండెల్లో నిలిచింది. తన నలభై ఏట పటేల్ అనే వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుని ముంబయి లో స్థిర పడింది. 


ప్రస్తుతం మోహిని తన స్నేహితుల పెళ్ళి కి ఖతార్ వెళ్ళింది. ఆమె ఫోర్ సీజన్స్ హొటల్ లో సూట్ తీసుకుంది. ఆమె తోపాటు పటేల్ మరియు పటేల్ మెదటి భార్య కొడుకు ఉన్నాడు. మోహినికి పటేల్ మొదటి భార్య కొడుకు తో ఘర్షణలు ఉన్నాయి. ఆమె రాత్రి పార్టీ లో కొంచెం ఎక్కువగానే మద్యం సేవించింది. అదే సమయం లో ఇండియా నుండి ఫోన్ వచ్చిందని పటేల్ వెళ్లి పోయాడు.


ఆ తరువాత మోహిని ఒంటరి గా తన రూమ్ కి వచ్చింది. 


 ********

మర్నాడు బ్రేకింగ్ న్యూస్!

"ప్రముఖ నటి మోహిని బాత్ టబ్ లో పడి మరణం. " 


లక్షలాది ప్రేక్షకులు శోకం లో నిండిపోయారు. 

కొందరు దు:ఖం భరించ లేక గుండె నొప్పి తో చనిపోయారు. బాత్ టబ్ లో పడి మరణించడమా అని అనుమానించారు కొందరు. 


ఖతార్ ప్రభుత్వం మరణించడానికి కారణం అధికం గా మద్యం సేవించడం వల్ల గుండె పోటుకు దారితీసింది అని చెప్పి పోస్ట్ మార్టం లో తెలిపారు. కేస్ ని క్లోజ్ చేసి బాడి ని ఇండియా తీసుకువెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. మోహిని అంత్య క్రియలు ఇండియాలో జరిగాయి. 


 *******

రెండు నెలల తర్వాత 


రామ్ పటేల్, పటేల్ మొదటి భార్య కొడుకు. బాలివుడ్ లో హీరో కాలేక నిర్మాత గా మారి 

చేతులు కాల్చుకున్నాడు. 


"ఇంకా నీ రెండో భార్య గారి ఇన్సూరెన్సు డబ్బులు రాలేదా?" పటేల్ మొదటి భార్య కొడుకు రామ్ పటేల్ అడిగాడు. 


"లేదు. పిన్ని అనలేవా? నీకు తల్లి లాంటిది" అన్నాడు పటేల్. 


"లాంటిది. తల్లి కాదుగా" 


"ఐనా ఇప్పుడు నీకు డబ్బులు ఎందుకు?" 


"నా వెబ్ సిరీస్ 'ఉస్ పార్' ఫైనాన్షియర్ అడుగుతున్నాడు. "


"చెత్త సినిమాల గోల మానేసి, మన రియల్ ఎస్టేట్ చూసుకోవచ్చుగా" కోపంగా అన్నాడు పటేల్. 


"ఉంటే సొమ్ము ఇవ్వండి. సలహా కాదు" అని కారు 'కీ' తిప్పుకుంటూ వెళ్ళి పోయాడు రామ్. 


పటేల్ కోపం తో ఊగిపోయాడు. ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు అప్పులు తీరుతాయా అని ఆలోచన లో పడ్డాడు. మోహిని విషయం లో అనుమానాలు. జనం చాటుమాటు గా గొణుక్కుంటున్నారు. 

 

 ********


నాలుగు నెలల తర్వాత 


బిజినెస్ పని మీద పటేల్ ఖతార్ వెళ్ళాడు. 

రాత్రి పది గంటలకి పటేల్ కి ఫోన్ వచ్చింది. 


"భార్యని చంపి రిలాక్స్ అవుతున్నావా?" అంది అవతలి వైపు గొంతు. 


"ఏయ్ ఎవర్నువ్వు? వాట్ రబ్బిష్ యు ఆర్ టాకింగ్?" 


"ఇప్పుడు నువ్వు ఉండే ఫోర్ సీజన్స్ హొటల్ లో పనిచేసిన వాడిని. " 


"నీకు ఏం కావాలి. ?" 


"నేను కూడా మోహిని అభిమానిని. ఆ అపూర్వ అందాన్ని నగ్నం గా చూడాలని తహ తహ లాడిన వాడిని. నా కోర్కె తీరదని తెలుసు. మీరు మా హొటల్ కి వస్తున్నారని, రూమ్ 507 లో స్టే చేస్తున్నారని తెలుసుకుని,  బాత్ రూంలో సీక్రెట్ కెమెరా ఎరేంజ్ చేసాను. కాని నా బ్యాడ్ లక్, మోహినిని నగ్నం గా చూద్దామనుకుంటే, నువ్వు నీళ్ళ ల్లో ముంచుతూ, ఆమె పీక నొక్కడం రికార్డ్ ఐంది. "


అతని మాటలు విన్నాక పటేల్ కి చెమటలు పట్టాయి. 

ఛాతి లో నొప్పి బయలుదేరింది. 

"ఆ వీడియో నాకు కావాలి. సోషల్ మీడియా లోకి రాకూడదు"


"పది కోట్లు చొప్పున నాలుగు ఎక్కౌంట్స్ లో వెయ్యాలి" అన్నాడా అవతలి వ్యక్తి. 


" అలాగే"


 ********


ఫోర్ సీజన్స్ యజమాని ని కలిసి జరిగినది చెప్పాడు పటెల్. ఫ్యామిలీ మెంబర్స్ స్టే చెయ్యడానికి లేకుండా ప్రైవసి లీక్ గురించి చెప్పాడు. ఇలా జరిగితే హొటల్ బిజినెస్ దెబ్బతింటుందని చెప్పాడు. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి రూమ్ సర్వీస్ బోయ్ అబ్దుల్ ని కలిసారు. 


అది ఒక పురాతన హొటల్. పదహేనవ అంతస్థు లో ఫోర్ సీజన్స్ యజమాని, పటేల్, రూమ్ బోయ్ అబ్దుల్ ఉన్నారు. 


"వీడియో ఇయ్యి" 


"డబ్బు ఇస్తేనే" 


"అసలు సీక్రెట్ కెమెరా పెట్టినందుకు నిన్ను అరెస్టు చేయించాలి" అన్నాడు పటేల్. 


"చెప్పండి పోలీస్ లకు. అప్పుడు ఎవరు ముందు అరెస్టు అవుతారో తెలుస్తుంది" అన్నాడు అబ్దుల్ నిర్లక్ష్యంగా. 


పటేల్ ఉలిక్కి పడ్డాడు. 

వెంటనే మెరుపు వేగం తో అబ్దుల్ ని రెయిలింగ్ మీద నుండి తోసేసాడు పటేల్. 


అబ్దుల్ తల పగిలిన శబ్దం వినబడింది. 

పటేల్ ఆ దృశ్యం నుండి మాయమయ్యాడు. 


 ********

ఆరు నెలల తర్వాత. 

పోలీస్ ఆఫీసర్ ఖతార్ నుండి వచ్చాడు. 

పటేల్ దగ్గరికి వచ్చి, 

"నేను ఇన్విస్టిగేషన్ ఆఫీసర్, క్రైమ్ బ్రాంచ్. మిమ్మల్ని అరెస్టు చెయ్యడానికి వచ్చాను. " 


"మీరు పొరపడి ఉంటారు. " 


"అన్ని ఆధారాల తో వచ్చాను. " 


"మీరు అబ్దుల్ ని పై నుండి తోసిన సంగతి, మీ హొటల్ కి ఎదురుగా, ఖతార్ డాక్యుమెంటరీ చిత్రీకరిస్తున్న ఫోటోగ్రాఫర్ సమీర్ కెమెరా కి చిక్కింది. అబ్దుల్ జేబులో దొరికిన సెల్ లో మీ భార్య ని టబ్ లో ఉండగా పీక పిసికి చంపిన వీడియో దొరికింది. ఈ రెండు ఆధారాలు చాలనుకుంటా" 


వాళ్ళ సంభాషణ విన్న పటేల్ కూతురు నందిత, 

" డాడీ నువ్వు బేడ్ డాడి వా? అమ్మ ని చంపేసావా? ఐ హేట్ యూ " అంటూ పటేల్ ఎదురుగా ఉన్న గది లోకి పోయి తలుపు వేసుకుంది చూడడానికి ఇష్ట పడక. 


మోహిని వంద కోట్ల ఇన్సూరెన్స్ కి క్లియరెన్స్ రాలేదు. 

పటేల్ పోలీస్ ఆఫీసర్ ని అనుసరించాడు. 

ఎయిర్ పోర్ట్ నుండి ఖతార్ వైపు వెళ్లే విమానం గాలి లోకి ఎగిరింది. 


 సమాప్తం  


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 






Commentaires


bottom of page