top of page

మై లవ్ స్టోరీ

#MyLoveStory, #మైలవ్స్టోరీ, #NDhanalakshmi, #Nధనలక్ష్మి, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


My Love Story - New Telugu Story Written By N. Dhanalakshmi

Published In manatelugukathalu.com On 04/05/2025

మై లవ్ స్టోరీ - తెలుగు కథ

రచన: N. ధనలక్ష్మి


అందరికీ నమస్కారం.. అందరూ ఎలా ఉన్నారు. నేనైతే బిందాస్ గా ఉన్నాను. 


చాలా రోజులైందిగా మీతో ఇంస్టాగ్రామ్ లైవ్ లో ఇంటరాక్ట్ అయి.. అందుకే ఈ రోజు వచ్చేసాను. 


నా గురించి ఏమి తెలుసుకోవాలి అనుకుంటున్నారో అడిగితే ఆన్సర్స్ ఇస్తానని నిన్న పోస్ట్ పెడితే చాలా మంది చాలానే ప్రశ్నలు అడిగారు. వాటిల్లో ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్తే అన్నిటికి చెప్పినట్టే లెక్క.

 

అవేమిటంటే.. 

1. మీరు మీమ్స్ క్రియేటర్ ఎందుకయ్యారు!?

2. మీ లవ్ స్టోరీ చెప్పమని. 


మరి స్టార్ట్ చేయనా మై లవ్ స్టోరీ.. 


భాగ్యనగరానికి నా ఉద్యోగం కోసం వచ్చాను. 


‘యువర్ రీజెక్టెడ్, యువర్ నాట్ ఫిట్ ఫర్ థిస్ జాబ్, 

సారీ థిస్ జాబ్ ఆల్రెడీ రిజర్వడ్’.. 


వెళ్ళిన ప్రతి చోట ఇలాంటి మాటలు ఎన్నో విన్నాను. సిటీకొచ్చి రెండు ఏళ్ళు అయింది. ఇంతవరకు ఓ పెద్ద కంపెనీలో మంచి జాబ్ తెచ్చుకోలేకపోయాను. మంచినీళ్ళతో కడుపు నింపుకున్న రోజులెన్నో ఉన్నాయి. అతి కష్టం మీద చిన్న జాబ్ దొరికింది. 


నా క్వాలిఫికేషన్ కి తగ్గ జాబ్ కాదు వచ్చే జీతం సరిపోదు. కానీ ఏమి చేయను ప్రతి చిన్న అవసరానికి ఇంట్లో వారిని అడిగి ఇబ్బంది పెట్టలేను కదా. ఈ పని చేస్తూనే పలు చోట్ల ఉదోగ్యం కోసం అన్వేషణ మొదలు పెట్టాను. అన్నీ చోట్ల విముఖత ఎదురైంది. సంతృప్తి లేని జాబ్, నా చుట్టూరా ఉన్న మనషులు నన్ను మాటలతో రోజుకొకలా చిత్రవధ చేస్తున్నారు. 


లోపల మండుతున్నా పైకి నవ్వుతూ ఉండటం ఎంత కష్టమో తెలుసా!?? అలాగే ఉండేవాడిని. కొలీగ్స్ సరదాగా బయటకు వెళ్దాం రమ్మన్నా వెళ్ళేవాడిని కాదు. ఆచితూచి డబ్బులు ఖర్చు పెట్టేవాడిని. 


ఓ రోజు బస్ స్టాప్ లో కూర్చొని ఉన్నాను. నాకు ఏడుస్తున్న పాప కనపడింది. బాధగా అనిపించింది. మాటలతో తనని నవ్వించాను. ఆ పాప హీ హి అంటు నవ్వుతుంటే నా మనసులో దాగున్న బాధ మొత్తం మటుమాయం అయింది.. 


అదే బస్ స్టాప్ లో ఓ అబ్బాయి నిలబడి ఉంటే తన బంధువు అనవసర ప్రశ్నలతో వేధిస్తున్నాడు. తను కోపంగా చూస్తున్నాడు తప్ప ఏమీ చెప్పలేకపోతున్నాడు. 


అది చూసి నేను నెట్ నుండి పెళ్ళి చూపులు మూవీలోని ప్రియదర్శి "నా చావు నేను చస్తా నీకెందుకు" టెంప్లేట్ డౌన్లోడ్ చేసి ఎవరైనా మనకి నచ్చని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడితే లోలోపల ఏమి అనుకుంటామో మీమ్స్ క్రియేట్ చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను. 


నన్ను ఫాలో చేస్తున్న నా ఫ్రెండ్స్ నవ్వుతూ ఏమోజిస్ పెట్టారు. నా పేరును, నా ఫోటో ను మిమ్స్ గాడ్ పాటుగా జత చేసి "ఫటా ఫట్ ధనాధన్ మిమ్మల్ని నవ్వించే జోకర్" అని క్యాప్షన్ కూడా పెట్టుకున్న. 


ఆ రోజు మొదలు నా పనవ్వగానే రోజుకొక మీమ్స్ పోస్ట్ చేస్తూ, నా పోస్ట్ కి వచ్చే కామెంట్స్ చూసి మనసులో సంతోష పడేవాడిని. ఎదుటివారీ నవ్వులో నా ఆనందాన్ని వెతికేవాడిని. అప్పుడప్పుడు హైదరాబాద్ లోని చిన్న చిన్న హోటల్స్, బండ్ల పై దొరికే ఫుడ్ ను ప్రమోట్ చేస్తూ ఉండేవాడిని. నెమ్మదిగా నా ఇంస్టాగ్రామ్ పేజీ అందరికీ నచ్చి ఫాలోయర్స్ పెరిగారు. 


 నా మీమ్స్ నచ్చి ఓ అమ్మాయి ఇన్బాక్స్ కి మెసేజ్ చేసింది. స్వతహాగా నేనొక భయస్తుడిని. అందుకే ఆ అమ్మాయితో మాట్లాడకపోయాను. అందమైన రోజా పువ్వు ఆ అమ్మాయి ప్రొఫైల్ పిక్ గా ఉంది. తన పేరు కూడా రోజా రమణి. రోజూ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పేది. నేను రీప్లే ఇవ్వకపోయినా సరే కొంచం కూడా ఫీల్ అవ్వకుండా యధావిధిగా పెట్టేది. 


నా ఇంస్టాగ్రామ్ మీమ్స్ కి తానొక అభిమాని. ప్రతి పోస్ట్ కి కామెంట్ పెట్టేది. మెల్లిగా తనతో మాట్లాడటం మొదలు పెట్టాను క్రమంగా తన పై ఇష్టం పెరిగింది. రోజా పెట్టే మెసేజ్ చూస్తే ఎదో తెలియని ఆనందం కలిగేది, పంపకపోతే ఎదో తెలియని బాధ, గుండెను మెలిపెట్టేది. తను ఎలా ఉంటుందో చూడాలనిపించింది. కానీ ధైర్యం చేసి అడగలేకపోయాను. 


తను నా మనసు అర్థం చేసుకొని తానే నా పుట్టిన రోజున ఫోటోను పంపింది. ఎంతో అందంగా ఉంది. నాకు చాలా నచ్చింది. నేను కూడా లేటెస్ట్ గా దిగిన ఫోటోను పంపాను. దానితో పాటు నా గురించిన విషయాలన్నిటిని తనతో పంచుకున్నాను. తనకి కూడా నేను నచ్చానని తన మాటల్లో అర్థమైంది. 


తను బీ. టెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. తనకి సబ్జెక్ట్స్ లో ఏదైనా డౌట్ వచ్చిన చెప్పేవాడిని. ఫైనల్ ఇయర్ లో ఏ టాపిక్ పై ప్రాజెక్ట్ తీసుకోవాలో వాటి కోసం ఏ బుక్స్ రెఫర్ చేయాలో చెప్పేవాడిని.. 


మామూలు విషయాల నుంచి పర్సనల్ విషయాలు పంచుకునేలా మా మధ్య బంధం మొదలైంది. బాధగా ఉంటే ఒదార్చేది. తన రాక నిశీధి నిండిన నా జీవితంలో వెలుగును నింపింది. 


 ప్రేమికుల రోజు మనసులోని మా ప్రేమను ఒక్కరికొకరం చెప్పుకున్నాము. తనతో నా పరిచయం మొదలై ఏడాది గడిచింది. మా మధ్య ప్రేమ పెరిగింది తప్ప తగ్గలేదు.. 

 

 ఓ పెద్ద కంపనీలో జాబ్ సాధించాను. ఎంత బిజీగా ఉన్న సరే మీమ్స్ చేస్తూ, రోజాతో మాట్లాడుతూ ఉండేవాడిని. 


రోజా పుట్టిన రోజున తనని కలిసి సర్ప్రైజ్ చేయాలని రెండు రోజుల ముందరే తన ఊరు విజయవాడకి వెళ్ళాను. తనని దూరం నుండి చూస్తూనే ఆనందపడ్డాను. పుట్టిన రోజు రానే వచ్చింది. గుడికి ఒంటరిగా వెళ్తున్నానని ఈ రోజు నాకెంతో స్పెషల్ అని మెసేజ్ చేసింది.. తనకి కావాలనే అవునా సరే జాగ్రత్తగా వెళ్ళమని మెసేజ్ చేశాను. విష్ చేయకుండ కాసేపు ఏడిపించాను.. 


తనకన్నా ముందే గుడికి చేరుకొని అక్కడున్న వారిలో మొత్తం 11 మందిని రిక్వెస్ట్ చేసి వారి చేతిలో చెరొక గిఫ్ట్ పెట్టీ తన రాకకై ఎదురు చూస్తున్నాను. 

 

పట్టు పరికిణీ లో వచ్చిన తనను చూడగానే నా మతి తప్పింది. ఎంతో అందంగా ముద్దుగా ఉంది నా రోజా.. 


నేను రిక్వెస్ట్ చేసిన వారు ఒక్కొక్కరుగా బర్త్ డే విష్ చెప్తూ అందరు 11 గిఫ్ట్స్ ఇచ్చారు. అవ్వన్నీ తనకిష్టమైనవి. 

వాటిని చూస్తూ ఆనందంతో ఎవరిచ్చారు అని ఆశ్చర్యంగా అడిగింది. 

“మీకింకా 12 వ గిఫ్ట్ బ్యాలన్స్ ఉంది. ఆ 12 వ గిఫ్ట్ అదిగో” అంటూ నన్ను చూపించారు. 


నేను బోకే తో తను ముందు నిలపడి

“హలో మేడమ్! మీ 12 వ గిఫ్ట్ నేనే. వద్దని చెప్పకుండ 

తీసుకోవాలి” అంటు " హ్యాపీ బర్త్డే మై లవ్" అన్నాను. 


రోజా కనులలో మెరుపు వచ్చి చేరింది. ఆనందంలో తన కంట కన్నీరు. పరుగున నన్ను చేరి గట్టిగ హత్తుకుంది. అక్కడున్న జనాలు చప్పట్లు కొట్టారు. మేము దూరం జరిగి దేవ దర్శనం చేసుకుని ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ రోజా ఇంటికి చేరుకున్నాము. 


నాకు లోలోపల కంగారుగా ఉంది. ఏమైనా అంటారో, కొడతారు ఏమోన్న భయంతో లోపలకి వెళ్ళాను. కానీ ఆశ్చర్యంగా రోజా అమ్మ, నాన్న నన్ను ఆప్యాయంగా పలకరించారు. 


మాటల మధ్యలో నాకు తెలిసినది ఏమిటంటే రోజా నన్ను 5 ఏళ్లుగా ప్రేమిస్తుందని.. అదేలని అడగగా ఓ చైన్ చూపించారు. ఇంకా నన్ను గుర్తు పట్టలేదా నువ్వు!? అని నవ్వుతూ అడిగారు రోజా నాన్న గారు. 


అప్పుడు గుర్తుకు వచ్చింది. సరిగ్గా ఐదు ఏళ్ల క్రితం స్నేహితుడు పెళ్ళి కోసం విజయవాడకి వచ్చాను. అక్కడ రోడ్ మీద ఏక్సిడెంట్ అయింది. కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. నేను పరుగున వెళ్ళి ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేయించి, ఉన్న డబ్బు సరిపోక నా దగ్గరున్న మా అమ్మమ్మ జ్ఞాపకమైన చైన్ డాక్టర్ కు ఇచ్చి వైద్యం అందేలా చేశాను. తన వద్దనున్న ఆధార్ కార్డు ద్వారా తన వారిని కాంటాక్ట్ చేసి విషయం చెప్పాను. డాక్టర్ అతను ఔట్ ఆఫ్ డేంజర్ అనగానే సంతోషం అనిపించింది. ఈ లోపు ఫ్రెండ్స్ ఫోన్ చేయడంతో వెళ్ళిపోయాను. 


నేను కాపాడింది రోజా నాన్నగారిని. వాళ్ళ నాన్న లేనిదే వాళ్ళ ఫ్యామిలీ లేదు. ఇప్పుడు తెలియకుండానే నామీద ఇష్టం పెంచుకుంది. రోజా హాస్పిటల్ ఉన్న సీసీ కెమెరా ద్వారా నన్ను చూసి నేనెలా ఉంటానో తెలుసుకుంది. అప్పటినుంచి తను నన్ను వేతుకుతుంటే మీమ్స్ పేజీ లో కనపడ్డాను. ఎందరినో నవ్విస్తున్న నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించింది. ఇంకా మిగిలిన కథ అంతా అందరికీ తెలిసినది. 


రోజా నా పట్ల పెంచుకున్న ప్రేమను చూస్తుంటే తనకోసం ఏమైనా చేయచ్చు అనిపించింది. జీవితాంతం నేను తన ప్రేమకి బందీగా ఉంటానని పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకుంటున్నాము. 


అర్థం కాలేదు కదా.. అదేనండి.. పెద్దల అంగీకారంతో మేము పెళ్ళి చేసుకుంటున్నాము. ఈ నెల 30 నా మా పెళ్ళి. మీరు తప్పక రావాలి. 


 ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ.. 


 థిస్ ఈజ్ దర్శన్ అండ్ థిస్ ఈజ్ మై లవ్ స్టొరీ.. 

యువర్ మీమ్స్ క్రియేటర్.. సైనింగ్ ఆఫ్.. 

టాటా

*****

N. ధనలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు N. ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.  


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.









Comentários


bottom of page