నా హృదయంలో నిదురించే చెలి

'Na Hrudayamlo Nidurinche Cheli' New Telugu Story Written By Anjani Gayathri
'నా హృదయంలో నిదురించే చెలి' తెలుగు కథ
రచన : అంజనీగాయత్రి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి.. వయ్యారి వై.." అని పాత సినిమా పాట పాడుతూ బైక్ తుడుచుకుంటున్నాడు సుందరం.
పక్కింటి పద్మ, నీళ్లు పట్టుకుందామని కుళాయి దగ్గరికి వచ్చింది. అతడి పాట విని మనసులో నవ్వుకుంటోంది. పైకి గట్టిగా నవ్వకపోయినా, నవ్వుతో కూడిన ఆమె మోము చూసి, పాడుతున్న పాట ఆపేసాడు.
సుందరం మరియు పద్మవాళ్ళఇళ్ల వాటాలు పక్కపక్కనే కావడం మూలంగా, గట్టిగా మాట్లాడుకుంటే, ఒకరి మాటలు మరొకరి ఇంట్లోకి వినిపిస్తాయి. ఇద్దరూ, అద్దెఇళ్లకోసం వచ్చి ఆ ఇళ్లలో ఉంటున్నవాళ్లే. ఇంటి ఓనర్ ఇంకో ఊర్లో ఉంటారు. అందుకే వీళ్ళు స్వేచ్ఛగా, ఆ ఇళ్లలో ఉంటూ సొంత ఇళ్ళులా వాడుకుంటున్నారు.
సుందరం ఇంట్లో తల్లి మరియు తమ్ముడు తో సుందరం ఉంటాడు. తండ్రి గతంలో చనిపోయాడు.
పద్మ వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు, పద్మ మరియు వాళ్ళ అన్నయ్య ఉంటారు.
సుందరానికి పాటలు పాడుతూ పని చేసుకోవడం అలవాటు.
పద్మ ఎప్పుడైనా అతని పాటలు వింటుంటే, "పాటలంటే ఇంట్రెస్ట్ ఏమో?బానే పాడుతున్నాడు, "అని మనసులో అనుకొని, ఒకరోజు ఉండబట్టలేక, పాటపాడుకుంటూ బైక్ తుడుచుకుంటూఉన్న అతనిని, "పాటలు బానే పాడుతున్నారు మీరు, పాడుతా తీయగా లాంటి సంగీత ప్రోగ్రామ్స్ లాంటివి, వేటికి అయినా వెళ్లొచ్చు కదా??" అని అడిగేసింది.
"నాకు అంత సీన్ లేదండి, సంగీతం రాదు, ఏదో సినిమాలో పాటలు విని సరదాగా పాడుతూ ఉంటాను," అని తడబడుతూ చెప్పి తన పనిలో నిమగ్నమయ్యాడు.
మనసులో మాత్రం నిజంగా పొగిడిందా?? లేక వెటకారంగా ఆ మాటలు అందా?? అనే అనుమానం మాత్రం అతని మనసును వీడిపోలేదు.
ఆమె నిజంగానే బాగా పాడాడని, ప్రోత్సహించాలనే ఉద్దేశంతోటే అనడం వలన, అతను అన్నమాటకు ఆమె మళ్లీ కల్పించుకుని, "పాటలు పాడాలంటే సంగీతం నేర్చుకోనక్కర్లేదు. పాడాలనే ఉత్సాహం, ఉండి, విన్నపాటను విన్నట్లుగా పాడటం అనేది అరుదైన విషయం. మీలో ఆ టాలెంట్ ఉంది," అని చెబుతూ తన సెల్ తీసుకుని, అతనిని అతనికి నచ్చిన పాట పాడమని, సెల్ లో వీడియోగా తీసింది. ఆ పాటని యూట్యూబ్ లో పెట్టింది.
యూట్యూబ్లో పాట చూసిన వారందరూ ఎంతో బాగా పాడారని కామెంట్లు, లైకులు పెడుతూ తమ ప్రోత్సాహం అందించారు.
మంచి కామెంట్లు, లైక్ లు వచ్చాక ఆ వీడియో తీసుకొచ్చి అతనికి చూపించింది. అవి చూసి, అతను ఆశ్చర్యపోయి, తనలో అంత టాలెంట్ ఉందా?? అని, తన టాలెంట్ ను ఆమె గుర్తించినందుకు మరియు ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉంది సుందరానికి.
"మీ ప్రోత్సాహానికి చాలా చాలా థాంక్స్ అండి," అని సంతోషంగా చెబుతూ ఆ వీడియో తల్లికి చూపించాడు. తల్లి చాలా సంతోషపడింది. పద్మని వీడియో తీసి పెట్టినందుకు అభినందించి కృతజ్ఞతలు తెలుపుకుంది.
పద్మ ఇచ్చిన ప్రోత్సాహంతో ధైర్యంగా ఇంకా ఇంకా మంచిగా పాడుతూ, యూట్యూబర్ గా మారి తాను కూడా మంచి సెల్ కొని, సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి, మంచి గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
యూట్యూబర్ గా పాటలు పాడుతూనే పెద్ద పెద్ద సంగీత ప్రోగ్రామ్స్ కి వెళ్లి ఎన్నో బహుమతులు పొందాడు. తాను గాయకుడుగా స్థిరపడడానికి కారణమైన పద్మని మాత్రం అతడు జీవితాంతం మర్చిపోలేదు.
ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలియగానే, తల్లి చేత పద్మ వాళ్ళ తల్లిదండ్రులని అడిగించాడు, "మా అబ్బాయి సుందరానికి మీ పద్మ నిచ్చి పెళ్లి చేస్తారా?? అన్నయ్యగారు” అంటూ అడుగుతూనే, వదిన గారు! అమ్మాయిని ఎక్కడికో దూరంగా పంపేకంటే మా అబ్బాయికి ఇస్తే కళ్ళ ముందు ఉంటుంది," అంటూ ఇద్దరినీ అడిగింది.
పద్మ తల్లిదండ్రులు కాసేపు ఆలోచించుకుని “మాకు మీ అబ్బాయిని అల్లుడుగా చేసుకోవడం ఇష్టమే. కానీ పద్మనడిగి ఏ విషయం తర్వాత చెప్తాము, తాను కూడా ఇష్టపడితే మాకు ఏ అభ్యంతరం లే”దని చెప్పారు.
పెళ్లి విషయం పద్మనడిగితే సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. అతను అంటే ఆమెకు ఇష్టమని తెలిసాక మంచి సమయంలోపెళ్లి ముహూర్తాలు పెట్టించి, అంగరంగ వైభవంగా వివాహం చేశారు ఆ ఇద్దరికీ.
🌹🌹🌹🌹🌹
అంజనీగాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
https://www.manatelugukathalu.com/profile/anjanigayathri
Anjani Gayatri,
Writer, teacher,
రాజమహేంద్రవరం,
రచనలపై ఆసక్తితో కవితలు, కథలు, నవలలు, జోక్స్ రాస్తూ ఉంటాను. నేను రాసిన కథలలో బహుమతులు పొందిన కథలు అనేకం. గత మూడు సంవత్సరాలుగా అనేక మాధ్యమాలలో రచనలు చేస్తున్నాను.