నా జీవన ప్రయాణం
- Dhanalakshmi N

- 1 day ago
- 7 min read

Na Jeevana Prayanam - Telugu Inspirational Story | N. Dhanalakshmi
నా జీవన ప్రయాణం - తెలుగు ప్రేరణాత్మక కథ | N. ధనలక్ష్మి
Published In manatelugukathalu.com On 26/03/2026
జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని పయనం మొదలుపెట్టిన అశ్విన్ కథేంటి? తను చనిపోయాడా లేదా? తన లైఫ్ జర్నీ ఏంటో చూద్దాం.
***
“అదేంటి సార్! నేను అన్ని రౌండ్లలో క్వాలిఫై అయ్యానుగా... మరెందుకు నాకు జాబ్ ఇవ్వడం కుదరదు అంటున్నారు?”
“సారీ...”
“మా కంపెనీలో పని చేయాలంటే అనుభవం ఉండాలి. పైగా నీకున్న అర్హతకు ఈ పోస్ట్ కరెక్ట్ కాదులే, ఇంకోచోట ప్రయత్నించు.”
“బెటర్ లక్ నెక్స్ట్ టైమ్!”
“రేయ్! ఇంకా ఎన్ని రోజులు మాపై పడి తింటావురా? నీ వయసు పిల్లలు రెండు చేతులా సంపాదిస్తూ తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూ, పెళ్లి చేసుకుని పిల్లపాపలతో పచ్చగా ఉంటే, నువ్వేమో ఇంకా ₹10 కోసం కూడా మా వద్ద చేయి చాపుతున్నావు.”
“సిగ్గుగా లేదురా? దానం కొద్దీ బిడ్డలు అంటారు.”
“ఏ జన్మలో ఏ పాపం చేశానో, నీలాంటి బిడ్డ పుట్టాడు!”
“నీ కోసం నేను ఆగినా మా వారు ఆగేలా లేరు. వారిని కాదు అనుకుని నీతో రాలేను. అయినా వచ్చినా నన్ను ఎలా పోషిస్తావు? నిన్ను నువ్వే చూసుకోవడం భారంగా ఉంటే, ఇంకా నన్ను ఏం చూసుకుంటావని... సో, ఈ క్షణం నుంచి నీతో ఉన్న అన్ని బంధాలను తెంచుకుంటున్నాను. లెట్స్ బ్రేక్ అప్ అండ్ మూవ్ ఆన్.”
“రేయ్ మామా! ప్రతి క్షణం నీతో మేము ఉండాలంటే ఎలా రా? మాకు పనులు ఉంటాయి.”
“రేయ్! ఎన్నిసార్లు డిమ్మికిలు పడతావురా? నీకు అలుపు అన్నది రాదా ఏంటి? సర్లే, ఎన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా? మా కిరాణా కొట్టులో లెక్కలు రాయి. ఇలా అయినా నువ్వు చదివిన చదువుకు న్యాయం చేయి.”
ఇలాంటి మాటలు విని అశ్విన్ చాలా విసిగిపోయాడు. మానసికంగా, శారీరకంగా కూడా అలసిపోయాడు.
కష్టపడి అన్ని రౌండ్లు క్లియర్ చేస్తే రిజర్వేషన్ అడ్డొస్తుంది.
అనుభవం లేదంటూ జాబ్స్ ఇవ్వరు. ప్రతి ఒక్కరూ నాతో ఆడుకునేవారే.
మరొకసారి ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవ్వడంతో, తనతో అందరూ అన్న మాటలు మదిలో మెదులుతుంటే... “అటు తల్లిదండ్రులకు నేను భారమే, ఇటు నాతోనే జీవితం అన్న అమ్మాయికి నేనో ఆప్షన్ మాత్రమే. ఇరుగు పొరుగు వారికి నేనో జోకర్. అన్నీ పంచుకునే ఫ్రెండ్స్ ఏమో వారి జీవితాల్లో బిజీ. ఇంకా నేను ఎందుకు బ్రతకాలి? బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి? చస్తే ఏ బాధ ఉండదు” అనుకుంటూ హోటల్‌కు వెళ్ళాడు అశ్విన్.
ఇంటర్వ్యూ టెన్షన్‌తో సరిగ్గా తినలేదని చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి ఫుల్లుగా తిన్నాడు. ఇష్టమైన బ్లాక్ కరెంట్ ఐస్‌క్రీమ్ కూడా తినేసి, దగ్గరలో ఉన్న షాపులో...
విషం కొన్నాడు. తన ఫోన్లో తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రేయసితో ఉన్న ఫోటోలను చూసి జ్ఞాపకాలను తలచుకున్నాడు. ఒక సెల్ఫీ తీసుకుని తనని తాను చూసుకుంటూ “ఎంత అందంగా ఉన్నావురా అయ్య! కానీ ఏం లాభం? కొద్ది క్షణాల్లో పైకి వెళ్ళి యముడికి షేక్ హ్యాండ్ ఇస్తావు” అనుకుంటూ, ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో చావాలని బైక్ మీద ఊరి చివరకు వచ్చేశాడు. విషం బాటిల్ తీసుకుని తెచ్చుకున్న జ్యూస్ బాటిల్‌లో కలుపుకుని తాగాలని చూశాడు. “విషం తాగితే కడుపులో మంట మొదలై మనం చచ్చేది తెలుస్తుంది. అమ్మో ఇలా వద్దు” అనుకున్నాడు. ఎలా చావాలో అర్థం కాక ఆలోచిస్తుంటే, ఇంతలో వాన మొదలైంది.
సిగరెట్ కాలుస్తూ వానలో ఇలా ఉండటం బాగుంది అనుకున్నాడు. పరమ బోర్ కొడుతుంటే రిలాక్స్ అవ్వడానికి ఫోన్ ఆన్ చేశాడు. నెట్‌వర్క్ సరిగ్గా లేదు. ఫోన్లో డౌన్‌లోడ్‌లో ఉన్న పాట ప్లే చేశాడు.
" ఏ హేయ్ సత్తే అర్ సత్తే...
ఏహేయ్ సత్తే... ఓహో సత్తే...
అహా సత్తే ఏ సత్తే ఏ గొడవ లేదు
సత్తే ఏ గోల లేదు
పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్
ఓ కలకాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది
హంసల్లే దర్జాగుండాల్లో
య్హే అందమైన ఈ జీవితానికో ఓ అర్థం వెతకాలి.
కోటి మందిలో పోటుగాడిలా నువ్వే బతకాలి.
ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోల లేదు, పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్...”
పాట ఆపాలని చూశాడు కానీ పాట రిపీట్ మోడ్‌లో వస్తూనే ఉంది.
" ఏ హేయ్ సత్తే అర్ సత్తే.....
ఏ హేయ్ సత్తే అర్ సత్తే...
రిపీట్ మోడ్ లో వచ్చింది......
“నా మూడ్‌కు తగ్గట్టు సాంగ్స్ భలే వస్తున్నాయి. ఛీ ఛీ! ఎదవ జీవితం” అనుకున్నాడు.
సరిగ్గా అప్పుడే ఆ దారిలో ఒక కారు వస్తూ కనిపించింది.
అశ్విన్ ఎలాగైనా చావాలనుకుని ఎదురుగా వస్తున్న కారుకు అడ్డుపడ్డాడు. కారు గుద్దేసింది.
కొన్ని గంటల తర్వాత...
“హమ్మయ్య! నేను చచ్చి స్వర్గానికి వచ్చినట్టున్నాను. సినిమాల్లో చూపించినట్లు రంభ, ఊర్వశి, మేనక వచ్చి డాన్స్ చేస్తారేమో” అని కళ్ళు తెరిచి చూశాడు.
ఎవరో పెద్దాయన చైర్ లో కూర్చొని ఎదో బుక్స్ చదువుతున్నాడు..
కొంపతీసి ఈయన యమధర్మరాజా ఏమో అనుకుంటూ లేచి కూర్చున్నాడు.
కానీ అక్కడ ఎవరో పెద్దాయన కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. “కొంపతీసి ఈయన యమధర్మరాజు ఏమో! రంభ, ఊర్వశులు వస్తారనుకుంటే యమధర్మరాజు ట్రెండీ లుక్‌లో బుక్ చదువుతున్నాడేంటి?” అని ఆశ్చర్యపోయాడు.
ఆ పెద్దాయన నవ్వుతూ “బాబు! నీకేమీ కాలేదు. ఒక్కసారి నీ చుట్టూ ఉన్న వాటిని సరిగ్గా చూడు, కాస్త ఈ లోకానికి రా” అన్నాడు. అప్పుడు అశ్విన్ గమనించాడు, తాను ఒక రూమ్‌లో బెడ్ పైన ఉన్నాడు. కారు గుద్దేసింది కదా, నేనెలా బ్రతికాను అని అయోమయంగా చూశాడు.
“ఏంటి బాబు? చనిపోయాను అనుకున్నావా?”
అశ్విన్ అవునన్నట్లుగా తల ఊపాడు.
ఆ పెద్దాయన నవ్వుతూ “నువ్వు నా కారుకు సడన్‌గా ఎదురుగా వచ్చావు. స్పృహ తప్పి పడిపోతే మా ఇంటికి తీసుకువచ్చి ట్రీట్‌మెంట్ చేస్తున్నాను. భయపడవద్దు, నేను డాక్టర్ని.”
“అసలు నా కారుకు ఎందుకు ఎదురువచ్చావు? ఏంటి నీ కథ?”
“అయ్యో దేవుడా! నేను చావలేదా?” అంటూ అశ్విన్ తన కథనంతా చెప్పాడు.
ఆ పెద్దాయన నవ్వుతూ “చూశావా బాబు? బహుశా భగవంతుడికి ఇష్టం లేదు. అందుకే నిన్ను ఏదో ఒక రూపంలో బ్రతికించాడు. నీకు వచ్చిన సమస్య అంత పెద్దదేమీ కాదులే...” అన్నాడు.
మధ్యలో అశ్విన్ అందుకుని “సార్! మీకు ఏం తెలుసు నేను పడే మానసిక వేదన గురించి? మీరు జీవితంలో అన్నీ అనుభవించి ఈ స్థాయిలో నిలబడ్డారు” అన్నాడు.
"మీకు ఏమి తెలుసు నేను పడే మానసిక వేదన గురించి ! మీరు జీవితంలో అన్నీ అనుభవించి ఈ స్థాయిలో నిలబడ్డారు...
ఆ పెద్దాయన నవ్వుతూ “బాబు! ఇటు రా” అంటూ ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు.
అక్కడ ఒక ఆవిడ, ఒక అబ్బాయి ఫోటోలకు దండ వేసి ఉంది.
“ఐదేళ్ల క్రితం నా కొడుకు అమెరికాలో ఎం.ఎస్ చేయడానికి బయలుదేరాడు. మేము అతనికి సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. నా కొడుకు స్పాట్లోనే చనిపోయాడు. నేను, నా భార్య గాయాలతో బయటపడ్డాం. కానీ కొడుకు లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేక నా భార్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. నాకంటూ ఈ భూమి మీద ఎవరూ లేరు. ఎందుకంటే మేము ప్రేమ వివాహం చేసుకున్నామని మా పెద్దలు ఎన్నడో మమ్మల్ని వెలివేశారు. చెప్పు బాబు, నేను ఎవరి కోసం బతకాలి? కానీ నేను ఎప్పుడూ చనిపోవాలని అనుకోలేదు. నా భార్యాబిడ్డలతో గడిపిన క్షణాలను జ్ఞాపకాలుగా గుర్తుపెట్టుకుని, డాక్టరుగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. చావు అనేది స్వయంగా రావాలి బాబు, మనం ఆహ్వానించకూడదు.”
“నీ తల్లిదండ్రులు నిన్ను చదువుకోమని విసిగించారు అన్నావు. ఎవరి కోసం? నీ భవిష్యత్తు కోసమే కదా! వారు వెళ్ళిన దారి తప్పు కావచ్చు కానీ వారి ఉద్దేశం తప్పు కాదు కదా! స్నేహితులు లేరు అంటున్నావు, అసలు నువ్వు ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడి స్వచ్ఛమైన స్నేహాన్ని అందించావా?”
“నీ సమాధానం ‘లేదు’ అనే ఉంటుంది. ఇక అమ్మాయి విషయం అంటావా? మోసపోవడం నీ తప్పు కాదు, మోసం చేయడం ఆ అమ్మాయి తప్పు. ఈ రకంగా నీకు మంచిదే జరిగింది. నిజమైన ప్రేమ ఏంటో నీకు తెలుస్తుంది. భవిష్యత్తులో ఇంకెప్పుడూ మోసపోకుండా ఉంటావు.”
“జాబ్ అంటావా? చాలా సార్లు ప్రయత్నించినా రాలేదు అన్నావు. బాబు! నీకు తెలుసా? హ్యారీ పోటర్ సిరీస్ రాసిన జె.కె. రౌలింగ్ తన బుక్ తీసుకుని వెళ్ళిన ప్రతి ఆఫీసులో తిరస్కారమే ఎదురైంది. ఒకటి కాదు, ఏకంగా 12 సార్లు రిజెక్ట్ అయింది.”
“ప్రతిసారీ తిరస్కారం ఎదురైనా ఆమె వెనుకంజ వేయలేదు. నీలాగా చనిపోవాలని అనుకోలేదు. ఇప్పుడు ఆమె ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రచయిత్రి. అంగవైకల్యం ఉన్నా సరే ఎన్నో అవరోధాలను దాటి విజయాలు సాధించిన వారు ఎంతోమంది ఉన్నారు.”
అయినా కూడా తాను వెనుక అడుగు వేయలేదు.
నీకు లాగా చనిపోవాలని అనుకోలేదు ... ఇప్పుడు తాను ఫేమస్ రచయత.అంగవైకల్యం ఉన్న కూడా ఎన్నో రిజెక్షన్ పేస్ చేసినా సరే ఎన్నో విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు ..
“ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి తన విషయం చెబితే ఆమె రిజెక్ట్ చేసింది. ఎందుకంటే అతని తండ్రి ఒక రైతు అని, వారికి డబ్బు లేదని. కానీ ఆ అబ్బాయి చనిపోవాలని అనుకోలేదు.”
కానీ ఆ అబ్బాయీ చనిపోవాలని అనుకోలేదు .
“ఏ అమ్మాయి అయితే తనను రిజెక్ట్ చేసిందో, ఆమెకు అందనంత ఎత్తుకు ఎదగాలని తను నమ్ముకున్న సంగీతం వైపు అడుగులేశాడు. ఇప్పుడు అతనే కిమ్ టెహ్యుంగ్ (BTS V). ప్రపంచంలోనే టాప్ హ్యాండ్సమ్ పర్సన్ అయ్యాడు. ప్రయత్నించి చూడు బాబు! తప్పకుండా విజయం సాధిస్తావు. ఒక్కగానొక్క కొడుకు చనిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతం.”
ప్రయత్నించి చూడు బాబు తప్పకుండా విజయం సాధిస్తావు.
ఒక్కనొక్క కొడుకు పోతే ఆ తల్లితండ్రుల పరిస్థితి వర్ణనాతీతం..
అశ్విన్ తను చేసిన తప్పు తెలుసుకున్నాడు.
“సార్! నన్ను కాపాడి బ్రతుకు మీద కొత్త ఆశ కలిగేలా చేశారు. మీరు ఎప్పటికీ ఒంటరి అనుకోకండి. ఇప్పటి నుంచి నేను మీకు తోడుగా ఉంటాను. నన్ను మీ బిడ్డగా అనుకోండి. సార్! మీ పేరు ఏంటి?”
బిడ్డగా అనుకోండి.సర్ మీ పేరు ఏంటి
“డాక్టర్ సత్యమూర్తి బాబు.”
కాసేపు డాక్టర్ గారితో గడిపి, అప్పుడప్పుడు వస్తానని చెప్పి సెలవు తీసుకున్నాడు. డాక్టర్ గారి కారులో తన బైక్ ఉన్న చోటికి చేరుకున్నాడు. డ్రైవర్‌కు థాంక్స్ చెప్పి తన జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.
మొదలుపెట్టారు .
కొంత దూరం వెళ్ళాక ఎవరో ఒక వృద్ధుడు లిఫ్ట్ అడుగుతుంటే ఎవరూ ఆపడం లేదు. అది గమనించిన అశ్విన్ ఆయన దగ్గరికి వెళ్లి బైక్ ఎక్కించుకున్నాడు. వివరాలు తెలుసుకుని ఆయన వెళ్లాల్సిన చోట దింపడానికి బయలుదేరాడు.
“క్షణాల క్రితం చస్తానన్న నేనేనా ఇప్పుడు ఇంకొకరికి సాయం చేస్తున్నది? ముందు అమ్మ దగ్గరికి వెళ్లాలి.” అని ఆలోచించాడు.
“నాన్న కోపానికి, నా పంతానికి మధ్య అమ్మ నలిగిపోతోంది. అమ్మనాన్నలతో మనసు విప్పి మాట్లాడి, కొద్ది రోజులు సమయం అడిగి ఉద్యోగ ప్రయత్నాలు కొత్తగా మొదలుపెట్టాలి.”
నేను దిగవలసిన ప్లేస్ వచ్చేసింది బాబు కాస్త బైక్ ని
“నేను దిగాల్సిన చోటు వచ్చేసింది బాబు, కాస్త బైక్ సైడ్ లో ఆపు” అన్న పిలుపుతో ఆలోచనల నుండి బయటపడ్డాడు అశ్విన్.
“సారీ తాతయ్య! ఏదో ఆలోచిస్తూ వినిపించుకోలేదు.”
“పర్లేదు బాబు! బస్సు తప్పిపోయి, పర్స్ ఎవరో కొట్టేస్తే ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటే నాకు సాయం చేశావు. నీ సాయాన్ని మర్చిపోలేను. అదిగో ఆ చెట్టు పక్కన ఉన్నదే మా ఇల్లు. వచ్చి కాఫీ తాగి వెళ్ళు బాబు, కాదు అనకు.”
సరేనని బైక్ పార్క్ చేసి ఫోన్ చూస్తే 50 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే ఇంటికి ఫోన్ చేశాడు.
“ఏమైపోయావురా కన్నా? ఎన్నిసార్లు ఫోన్ చేశామో తెలుసా! ఉదయం వెళ్లిన వాడివి ఫోన్ ఎత్తకపోతే కంగారు వచ్చేసింది. ఇంకా సేపు నువ్వు ఫోన్ చేయకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నాం.”
ఎన్ని సార్లు ఫోన్ చేశామో తెలుసా!! ఉదయం అనగా వెళ్ళినవాడివి..ఫోన్ చేస్తుంటే తీయకపోతే కంగారు వచ్చేసింది..ఇంకా కొద్దీ సేపు నువ్వు ఫోన్ చేయకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నాము తెలుసా..
“సారీ అమ్మ! నాన్న!” అని అశ్విన్ పిలవగానే ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
సారీ అమ్మ,నాన్న అని అశ్విన్ పిలవగానే ఇద్దరు
కన్నీరు పెట్టుకున్నారు...
“ఆశూ!” అని తండ్రి పిలిచిన పిలుపులో బాధ స్పష్టంగా తెలుస్తోంది.
స్పష్టంగా తెలుస్తుంది..
చెప్పండి నాన్న...
“రేయ్ కన్నా! మేము ఏది చేసినా నీ మంచికేరా. సరైన చదువు లేకపోవడం వల్ల చిన్న చిన్న జాబులు చేసి చాలీచాలని జీతంతో కడుపు మార్చుకుని ఎన్నో రోజులు ఉన్నాం. అలాంటి పరిస్థితి నీకు రాకూడదని కఠినంగా ఉన్నాం. క్షమించు కన్నా! ఇంకెప్పుడూ నీ మనసు నొచ్చుకోనివ్వం. ఇంటికి వచ్చేయ్ బాబు! జాబ్ చేయకపోతే పోనీ, మాకు నీ మీద నమ్మకం ఉంది. ఏదో ఒక వ్యాపారం చేసుకుందాం. నాన్న తోడుండగా భయం ఎందుకు?”
సరైన చదువు లేకపోవడం వల్లే చిన్న చిన్న జాబులు చేసి చాలీ చాలని జీతంతో కడుపు మార్చుకుని ఎన్నో రోజులు ఉన్నాము.. ఇలాంటి పరిస్థితి నీకు రాకూడదని చిన్నప్పటినుంచి నీ పట్ల కఠినంగా ఉన్నాం.. క్షమించు కన్నా ఇంకెప్పుడూ నీ మనసు నోచ్చుకునేలా మేము నడుచుకోము.. ఇంటికి తిరిగి వచ్చే బాబు.జాబ్ చేయకపోతే ఏమి. నా బిడ్డ మీద మాకు నమ్మకముంది ఏదో ఒక వ్యాపారం చేసుకునే అయిన నువ్వు బ్రతకవచ్చు. నాన్న తోడుగా ఉండగా భయం ఎందుకు కన్నా. నా ఆశు గుడ్ బాబు త్వరగా రా రా నాన్న.."
అశ్విన్ చాలా బాధపడ్డాడు. తాను కనపడకపోవడం వల్ల తల్లిదండ్రులు ఎంత వేదన అనుభవించారో అని అర్థం చేసుకున్నాడు.
“అమ్మ, నాన్న నన్ను క్షమించండి. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. మీ కొడుకు కొద్ది గంటల్లో మీ ముందు ఉంటాడు.”
“సరేరా! త్వరగా రా, నీకు ఇష్టమైనవి చేసి ఉంచుతాను. అమ్మతో పాటు నాన్న కూడా ఎదురుచూస్తున్నారు.”
అమ్మతో పాటుగా మీ నాన్న కూడా ఎదురు చూస్తుంటారు కన్న వచ్చేయ్ త్వరగా...
ఆనందంగా ఫోన్ పెట్టేసి తాతయ్య ఇంటికి వెళ్ళాడు అశ్విన్.
వారు అప్పటికే కాఫీ, పిండివంటలు సిద్ధం చేసి అతని కోసం ఎదురుచూస్తున్నారు.
కాఫీ తాగుతూ వారితో మాటలు కలిపిన అశ్విన్‌కు ఒక విషయం తెలిసింది.
మాటల మధ్యలో తెలిసింది ఏమిటంటే...
ఆ వృద్ధ దంపతులను వారి కొడుకులు చూడటం లేదని, జీవనోపాధి కోసం ఇంటి దగ్గరే తినుబండారాలు చేసి అమ్ముతున్నారని తెలుసుకున్నాడు.
అవి చాలా రుచిగా ఉన్నాయి. వారికి సహాయం చేయాలని భావించిన అశ్విన్, తాను వాటిని అమ్మి పెడతానని చెప్పాడు. “పెట్టుబడి నేను పెడతాను, మీరు వస్తువులు తయారు చేయండి” అని చెప్పి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం వివరించి, తన దగ్గర ఉన్న డబ్బుతో వారికి సరుకులు అందించాడు.
తన తెలివితేటలతో “స్వగృహ ఫుడ్స్” అనే యాప్ క్రియేట్ చేశాడు. కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు.
మీడియాలో ప్రమోట్ చేయడం మొదలు పెట్టాడు..మీ
కొద్ది రోజుల్లోనే ఆ వంటకాలకు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది.
అందరితో స్నేహంగా ఉంటూ మంచి మిత్రులను సంపాదించుకున్నాడు.
కొంతకాలం తర్వాత అశ్విన్‌కు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. జీతం కూడా ఆశించిన దానికన్నా ఎక్కువే. జాబ్ చేస్తూనే “స్వగృహ ఫుడ్స్” బిజినెస్‌ను కూడా విజయవంతంగా కొనసాగిస్తున్నాడు.
అంతేకాదు, బస్తీలో ఉండే పిల్లలకు సాయంత్రం వేళ ఉచితంగా డ్యాన్స్ నేర్పిస్తూ, వారి చదువుకు కూడా సాయం చేస్తున్నాడు.
డ్యాన్స్ మాస్టర్‌గా కూడా అశ్విన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇలా ఇష్టమైన వ్యాపకం, వృత్తి రెండింటిలోనూ రాణిస్తున్నాడు. అప్పుడప్పుడు డాక్టర్ సత్యమూర్తిని కలుస్తూ తన సమయాన్ని గడుపుతుంటాడు.
చిన్నప్పటి నుంచి తనను ఇష్టపడుతున్న మరదలిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె రాకతో నిజమైన ప్రేమకు అర్థం తెలుసుకున్నాడు.
నెలకోసారి లాంగ్ డ్రైవ్‌కు వెళ్తూ ఎందరో జీవితాలను చూసి ఎంతో నేర్చుకున్నాడు. ఆ అనుభవాలన్నింటినీ కలిపి “మై లైఫ్ జర్నీ” అనే పుస్తకాన్ని రాసి రిలీజ్ చేశాడు.
" మై లైఫ్ జర్నీ" అంటు ఓ బుక్ కూడా రాసి రిలీజ్ చేసి అందులో కూడా సక్సెస్ అయ్యాడు. అశ్విన్..
ఆ పుస్తకం కూడా మంచి విజయం సాధించింది. ఇలా అన్నిట్లో విజయం అందుకుంటూ అశ్విన్ తన జీవన పయనంలో ఆనందంగా ముందుకు సాగిపోతున్నాడు.
*****
N. ధనలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :
నమస్తే. నా పేరు N. ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.





Comments