top of page

నడమంత్రపు సిరి



'Nadamanthrapu Siri' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 07/01/2024

'నడమంత్రపు సిరి' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఫోన్ రింగయితే ఆఫీసుపనిలో నిమగ్నమై ఉన్న కరుణాకర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. 


“అన్నయ్యా! రేపు “భగినీహస్త భోజనం” నీవు మాఇంటికి భోజనానికి వచ్చి నన్ను ఆశీర్వదించాలన్నయ్యా” అంది ఆరభి తన అన్నతో. 


“అలాగే !ఈరోజు నాకు గుర్తుందమ్మా!. ప్రతిసంవత్సరం నేను రాకుండా నీవు ఊరుకోవుగదా ! నిన్ను చూడకుండా నేను ఉండలేను కదా! వస్తాను. రానంటే మన విశాల్ ఊరుకోడు గదా !” అని ఫోన్ పెట్టేశాడు కరుణాకర్.


ఆరభి తన అన్న గురించిన ఆలోచనలతో గతస్మృతులను నెమరువేసుకుంది. 


ఆరభికి తన అన్నంటే పంచ ప్రాణాలు. అలాగే అతనికి కూడా చెల్లెలంటే పిచ్చి ప్రేమ. చిన్ననాడే ఒక ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఆ అన్నాచెల్లెళ్లు అనాధశరణాయంలో పెరిగి పెద్దయ్యారు. దయార్ద్ర హృదయుల అండతో, స్కాలర్షిప్ తో తన చదువుని పూర్తిచేసుకున్నాడు కరుణాకర్. మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 


ఆరభి పదవతరగతి వరకే చదివి ఇంటివద్దనే ఉంటూ తన అన్న ఆలనా, పాలనా శ్రధ్ధగా చూసుకుంటోంది. చెల్లికి ఆమె అడగకుండానే తనకిష్టమైనవి తెచ్చిపెట్టేవాడు కరుణాకర్. అన్నకు ఏవేళకి ఏంకావాలో కన్నతల్లి వలే కనిపెట్టుకుంటూ ఉండేది ఆరభి. 


రెండు సంవత్సరాల తర్వాత తన కంపెనీలో పనిచేసే విశాల్ కి తన చెల్లినిచ్చి పెళ్లిచేస్తే తన కళ్లముందే చెల్లి ఉంటుందనే ఆలోచన కలిగింది కరుణాకర్ కి. తన ఆలోచనను చెల్లికి చెప్పాడు. విశాల్ గురించిన పూర్తి వివరాలను చెప్పి ఆమె అభిప్రాయాన్ని అడిగాడు కరుణాకర్. ‘అన్న ఇష్టమే తన ఇష్టం. అన్న ఏపనైనా తన మంచికోరే చేస్తాడు ‘ అదే అభిప్రాయాన్ని అన్నతో వెలిబుచ్చి “నీఇష్టం అన్నయ్యా! “అంది ఆరభి.


కరుణాకర్ విశాల్ ని పిలిచి తన మనసులోని ఉద్దేశ్యాన్ని బయటపెట్టి తన గురించి, తన చెల్లిని గురించి వివరించి చెప్పాడు. 


“నీకిష్టమైతే ఒకరోజు మీ ఇద్దరికీ పెళ్లి చూపులను ఏర్పాటు చేస్తాను. ఇందులో బలవంతమేమీలేదు. నీ కిష్టమైతేనే సుమా” అన్నాడు కరుణాకర్.


అంతావిన్న విశాల్ “నేనొక అనాధని. ఎవరో దూరపు బంధువు నన్ను చేరదీసి పెంచితే కష్టపడి చదివి ఈ ఉద్యోగాన్ని సంపాదించాను.” అన్నాడు విశాల్. 


“నీగురించి అంతా తెలుసు. నీవు బుధ్ధిమంతుడివి. కష్టపడే స్వభావం కలవాడు. నీ నిజాయితీని, నీ పట్టుదలని నేను చూస్తున్నాను. నిజాయితీ, కార్యదక్షత ఉన్న నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తే మీరిద్దరూ నాకళ్లముందే సుఖంగా ఉంటారు. అదీగాక నాకు నా చెల్లి అంటే ఎంత ప్రాణమో నీకు తెలుసు కదా! మేము కూడా అనాధాశ్రమంలో పెరిగాము. కష్టపడి ఈ ఉద్యోగాన్ని పొందాను “ అన్నాడు కరుణాకర్.


“మీతో సంబంధం కలుపుకోవడం నాకిష్టమే. ఈరకంగా మనం బంధువులమై ఒకళ్లకొకళ్లు తోడునీడగా ఉండచ్చు” అన్నాడు విశాల్.


“అయితే రేపు సాయంత్రమే. మీకు పెళ్లిచూపులు. మా ఇంటికి రావాలి.“ అన్నాడు కరుణాకర్. 

“సరే!”అన్నాడు విశాల్. 


ఆ సాయంత్రం ఇంటికి రాగానే తన చెల్లికి ఆఫీసులో జరిగిందంతా వివరించాడు. 

“రేపే మీకు పెళ్లిచూపులమ్మా!” అన్నాడు కరుణాకర్. 


“సరే!” అంది ఆరభి. 

ఆ మరురోజు సాయంత్రం విశాల్ రావడంతో వాళ్లిద్దరికీ పెళ్లి చూపులు జరిగాయి. విశాల్, ఆరభి లు ఒకరినొకరు నచ్చడంతో పెళ్లికి తమ అంగీకారాన్ని కరుణాకర్ కి తెలిపారు. 


కరుణాకర్ చాలా సంతోషించాడు. రిజిస్ట్రార్ ఆఫీసులో అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు కరుణాకర్. కొన్ని రోజుల తర్వాత ఆరభి, విశాల్ లు రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకుని దంపతులయ్యారు. తన పాదాలకు నమస్కరించిన ఆ క్రొత్త జంటని మనసారా ఆశీర్వదించాడు కరుణాకర్. 


 ఒక మంచి ఇంటిని వెతికి వాళ్లచేత క్రొత్త కాపురం పెట్టించాడు కరుణాకర్..ఆరభి, విశాల్ లు అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. తన అన్నను తమ వద్దే ఉండమంది ఆరభి. “ ఊళ్లో ఇల్లే కదా! వస్తుపోతూ ఉంటాను.” అని సున్నితంగా చెప్పి తన చెల్లిని ఒప్పించాడు కరుణాకర్. 


ఆర్నెల్ల తర్వాత తనకు ఒక మంచి సంబంధాన్ని వెతికి మాధవినిచ్చి అన్నకు పెళ్లిచేసింది ఆరభి. తనే దగ్గరుండి అన్ని బాధ్యతలను చూసుకుంది. 


 మాధవి, కరుణాకర్ అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. ఇద్దరిళ్లమధ్యనా రాకపోకలు సాగుతున్నాయి. ఏదో అలికిడైతే గతం తాలూకు ఆలోచనలనుండి తేరుకుని మిగిలిన పనులను పూర్తిచేసింది ఆరభి. 


ఆ సాయంత్రం ఆఫీసునుంచి విశాల్ రాగానే రేపు తన అన్నయ్య వస్తున్న విషయాన్ని అతనితో చెప్పింది ఆరభి. చాలా సంతోషించాడు విశాల్. ఆ మరురోజు కరుణాకర్ ఆరభి ఇంటికి రావడం, ఆరభి తన స్వహస్తాలతో అన్నయ్యకిష్టమైనవి వండి కొసరి కొసరి వడ్డించింది. తృప్తిగా భోజనం చేసి తన చెల్లిని మనసారా దీవించి వెళ్లాడు కరుణాకర్. 


ఇదంతా చూస్తున్న విశాల్ చాలా సంతోషపడుతూ “ నీవు చాలా అదృష్ట వంతురాలివి ఆరభీ!”.అన్నాడు భార్యతో. 

“అవునండి. మీలాంటి భర్త, దేవునిలాంటి అన్నయ్య ఉన్న నేను చాలా అదృషవంతురాలిని “ అన్నది ఆరభి తన భర్తకు ప్రేమగా దగ్గరవుతూ. 


కాలం గడుస్తోంది. కొంత కాలానికి కరుణాకర్ తన తెలివితేటలను, సమర్ధతని ఉపయోగించి బాంకులో లోన్ ని తీసుకున్నాడు. దానిని పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ ప్రారంభోత్సవ వేడుకలకు విశాల్ ని, ఆరభిని పిలిచాడు. ఆ ఫంక్షన్ కి వెళ్లారు ఆరభి దంపతులు. తన అన్నా, వదినల ఆదరణకు చాలా సంతోషించింది ఆరభి. తిరిగి తమ ఇంటికి వచ్చారు విశాల్, ఆరభిలు. 


కరుణాకర్ వ్యాపారం క్రమేపీ పుంజకుంటోంది. తన అన్న వృధ్ధిలోకి రావడంతో చాలా సంతోషంగా ఉంటోంది ఆరభి. కరుణాకర్ వ్యాపారం మూడుపువ్వులు-ఆరుకాయలుగా ఉండడంతో సిరిసంపదలతో పాటు, అతనికి అహంకారం, అతిశయం, గర్వం తోడయ్యాయి. ఇప్పుడతనికి డబ్బు పొగరువలన రక్తసంబంధం, చెల్లి ప్రేమానురాగాలు కనిపించట్లేదు. తన చెల్లెలు చాలా బీదరాలనే భావం కలుగుతోంది. తన అంతస్థుకి విశాల్, ఆరభిలు సరిపోరనే భావన పెరుగుతోంది. మాధవి సరేసరి. ఈ విషయంలో తన భర్త కన్నా ఆమె ఇంకొక రెండాకులెక్కువే. 


 కరుణాకర్ దంపతులు ఆరభి ఇంటికి రాకపోకలు, వాళ్లతో పలకరింపులు క్రమేపీ తగ్గిస్తూ పూర్తిగా మానేశారు. 


ఆరభి, విశాల్ లకు వాళ్ల మనోగతం అర్ధమవుతోంది. “నడమంత్రపు సిరి” తో తన అన్నయ్యకు చెల్లి ప్రేమానురాగాలు కన్పించట్లేదు. ఆ డబ్బు దూరమైనప్పుడు మనుషులు, చెల్లి, ప్రేమానురాగాలు తెలుస్తాయి. అప్పటికి కాలము, ప్రాయమూ కూడా వేగంగా గడుస్తాయి. అనుకుంది బాధాతప్త హృదయంతో ఆరభి.


…..సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏



63 views0 comments
bottom of page