'Nadu - Nedu' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 07/01/2024
'నాడు - నేడు' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
ఈ భూమి పై పేదవాళ్ళు, మద్యతరగతి వాళ్ళు, ధనవంతులు, కోటీశ్వరులు అంటు ఎన్నో రంగాలతో మనుషులు ఉన్నా.. ! వారిలో ఎన్ని తేడాలు ఉన్నా.. ! ప్రతిభ, మంచితనం విషయంలో ఎలాంటి తేడాలు ఉండవు. పేద ధనిక అనేది మనం తెచ్చుకున్న వ్యవస్థ కాదు. మన పుట్టుకతో వచ్చేది. అయితే ఈ ప్రతిభ, మంచితనం అనేవి మనకు మనం నేర్చుకున్న మన వ్యక్తిత్వం నుంచి వచ్చేవి.
అక్కడికి వరకు బాగుంది. కానీ.. ! మరలా ఆ వ్యక్తిత్వం, మంచితనం, ప్రతిభను నిరూపించుకునే విషయంలో పాత కథే. ఇక్కడ పేదరికం, ధనికులు అని మరలా తేడా ఉంటుంది. ఈ విధంగా తమకు ఎంత ప్రతిభ ఉన్నా కొందరు పేదవాళ్ళు ప్రతిభను నిరూపించుకోలేకపోతున్నారు.
రాహుల్ కూడా కటిక పేదరికం వలన తనకున్న అపార మేధాతనాన్ని నిరూపించుకోలేక తద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోలేక తోపుడు బండి పై పండ్లు అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయినా రాహుల్, కుటుంబ పోషణ భారంగా ఉండటంతో రాత్రి కూడా పాస్ట్పుడ్ సెంటర్ నడుపుతు బతుకుబండి నడుపుతున్నాడు.
రాహుల్ కి భార్య కవిత, ఏడేళ్ళ కూతురు జెస్సీ ఉంది.
జెస్సీ కూడా చిన్నప్పటి నుంచే రాహుల్ లా మంచి మేధావి. అయితే.. రాహుల్ మేధాతనాన్ని తన తల్లిదండ్రులు గుర్తించకపోగ. రాహుల్ మాత్రం జెస్సీ మేధాతనాన్ని గుర్తించి మంచి పాఠశాలలో చేర్పించాడు.
ఒక్కోసారి జెస్సీ అడిగినవి కొనలేక సతమతమవుతుండేవాడు రాహుల్.
అలా ఎన్నోసార్లు జెస్సీ రాహుల్ యొక్క కోపానికి బలైయ్యేది, కన్నీరు పెట్టేది. అల్లరి చేసేది. అయినా రాహుల్ తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సందర్భం చూసుకుని అనుకూలించినపుడే తప్ప ఏది కావాలంటే అది అంటే తెచ్చేవాడు కాదు. రాహుల్ మనసులో మాత్రం బాధపడేవాడు.
రాహుల్ చాలా మంచివాడు. ఏనాడూ ఎవరికి హాని తలపెట్టని మనిషి. పేదరికం పట్టిపీడిస్తుంది. అయితే రాహుల్ కి తెలుసు జెస్సీని బాగా ఉపయోగించుకుంటే తానే తన పేదరికం కుకటివేళ్ళతో పీకివేస్తుందని.
అయితే.. ప్రస్తుతం కాలం మాత్రం తనది కాదని, ఈ గడ్డుకాలాన్ని దాటాలంటే కష్టంతో తప్పా కన్నీటితో దాటలేమని రాబోయే పాన్పు కోసం ఇప్పుడు ముళ్ల పొదలనైనా దాటాలని, ఇక్కడే ఆగిపోతే కాలం కూడా సమాధానం ఇవ్వదని అనుకున్నాడు.
ఒకరోజు పండగ కోసం బార్య, కూతుర్లకు కొత్త బట్టలు తీయటానికి పట్టణంలో ఓ చిన్న షాపింగ్ మాల్ కి వెళ్ళాడు. తిరిగి వస్తునప్పుడు ఆ షాపింగ్ మాల్ బయట ఉన్న పార్కింగ్ చేసిన ఓ కారు జెస్సీకి బాగా నచ్చింది. అటు వైపు వెళ్లి ఆ కారుని తాకింది. అక్కడే ఉన్న ఆ కారు ఓనర్ జెస్సీని చెయ్యి పట్టుకుని అటు విసరేసి, కారుని జెస్సీ పట్టుకున్న చోటుని గుడ్డతో తుడుస్తు అహంకారం ప్రదర్శించాడు.
ఆ ఊపుతో పడిపోయిన జెస్సీకి ఏదో అవమానం జరిగినట్లు భావించింది. ఈ తతంగాన్ని చూసి తల్లిదండ్రులు ఎంత బాధ పడ్డారో.. అంతకంటే ఎక్కువ చిన్న పిల్లే అయినా.. ! జెస్సీ బాధపడింది.
కొంతమందికి జీవితంలో పైకి ఎదగలన్నా.. గొప్ప స్థానంలో ఉండాలన్నా.. కసి ముఖ్యం. ఆ కసి ఇలాంటి అహంకారుల వలన ఖచ్చితంగా వస్తుంది అని బాల మేథావిగా పేరు గాంచిన జెస్సీకి తెలుసు.
ఇంత జరిగినా రాహుల్ కి కూతురు పై జాలి కల్గి ఓ పెద్ద కారుని జెస్సీ ఆడుకోవటానికి కొని తెచ్చాడు.
ఇప్పుడు తనను అవమానించిన కారు ఓనర్ పై ఎంత కోపం పెట్టుకుందో.. తండ్రి రాహుల్ పై అంతకంటే ఎక్కువ ప్రేమ పెంచుకుంది.
తనకు ఏమి కావాలంటే అది ఇవ్వలేదు. అది తన తండ్రి పేదరికం కానీ.. కారు ముట్టుకుని అవమానపడినందుకు ఆ బాధ నుండి ఉపశమనం కోసం తన తండ్రి కొన్న ఆ కారు బొమ్మ అడగకుండానే కొన్నాడు. నిజంగా పెద్దయ్యాక ఏదైనా సాధించాలనే కోరిక జెస్సీలో ఇప్పటి నుండే ఉరకలెత్తింది.
తండ్రి ఆశయం కూడా అదే కావటంతో ఎన్పో కష్టాలు పడినా.. జెస్సీకి బాగా చదివించాడు.
జెస్సీ వయసు పెరుగుతుండగా తన కుటుంబం పరిస్థితి కళ్ళలో కలయతిరుగుతుండగా ఆ కసినంతటని ఐఎఎస్ సాధించేందుకు ఉపయోగించుకుంది.
ఇప్పుడు జెస్సీ ఐఎఎస్ ట్రైనింగ్ లో ఉంది. కానీ తల్లిదండ్రులు తమ సొంత పూరిపాక నుంచి రోడ్డు పై ఉన్న ఖాళీ స్థలంలో చిన్న గుడారానికి మారింది. కారణం.. !
జెస్సీ ఐఎఎస్ చదివేందుకు రాహుల్ సంపాదన సరిపడకపోవటంతో తన సొంత స్థలాన్ని అమ్మేశాడు.
ప్రస్తుతం జెస్సీ శిక్షణలో ఆనందంగా ఉంది. మరియు గుడారంలోనే అయినా జెస్సీ తల్లిదండ్రులు రాహుల్, కవితలు కూడా సంతోషంగా ఉన్నారు.
అలా ఏడాది గడిచాక రాహుల్ కుటుంబం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు పెద్ద ఇళ్ళు, కూర్చుని తినగలిగే పరిస్థితి. జెస్సీ తల్లిదండ్రులని ఏ పని చేయనివ్వదు.
ఇదిలా ఉంటే..
నాడు కారు ముట్టుకుంటే తోసివేయబడ్డ పరిస్థితి నుండి నేడు కారులోకి ఎక్కాలంటే ఒకరు డోర్ తీసి ఆహ్వానం పలికేలా ఎదిగింది జెస్సీ.
అయితే ఈ ఐఎఎస్ అంత ఈజీగా ఏం రాలేదు.
కరెంటు లేని తమ పూరిపాకలో దీపం వెలుగులో ఆర్థిక కష్టాల నడుమ రాత్రనక పగలనక కష్టపడితే వచ్చిన ఉద్యోగం.
నాడు జెస్సీ, కారు చూడటమే గొప్ప వరం అనుకంటే నేడు రకరకాల కార్లు పై విధులకు వెళ్తుంది. తల్లిదండ్రులుకు కూడా కారు కొనే స్థాయిలో ఉంది. ఇప్పుడు తాను విధులు నిర్వహిస్తూ తన జీవితం నాడు నేడు గా పదిమంది పేదపిల్లలకు చెబుతు వారిలో కసి పెంచి ఉన్నత స్థానంలో ఉండేలా ప్రోత్సహిస్తుంది కూడా.
సమాప్తం.
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments