top of page

నల్ల పిల్ల


'Nalla Pilla' New Telugu Story

Written By Varalakshmi Bellamkonda

'నల్ల పిల్ల' తెలుగు కథ

రచన : బెల్లంకొండ వరలక్ష్మి


ఆ రోజు శనివారం. స్కూల్ లో పిల్లలు అందరూ చాలా ఆత్రుతతో ఉన్నారు.. మరి అది వాళ్ళకి ఆఖరి పరీక్ష.. ఈ పరీక్ష ఒక్కటి అయిపోతే ఇక వాళ్ళకి సంక్రాంతి సెలవలు మరి.. క్లాస్ లో పిల్లలు అందరూ ఇంచుమించు గా బాగానే రాస్తున్నారు. చిన్ని కూడా వచ్చిన సమాధానాలతో పేపరు నింపుతోంది.. సెలవలు రానే వచ్చాయి.. చిన్ని కి వాళ్ళ బాబాయ్ ఊర్లో గడపడం చాలా ఇష్టం.. ఒక వారం రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడినుండే బాబాయ్ ఊరు వెళ్ళేది.. అక్కడి పచ్చని పొలాలు, ఏటి గట్టు.. గోదావరి.. అక్కడినుండి వీచే పవనాలు.. అబ్బబ్బ ఏం చెప్పమంటారు.. కవులు సైతం వర్ణించలేని ఆ అందాలు చూడాల్సిందే తప్ప, చెప్పడం అంటే కష్టమే సుమా.. మొత్తానికి సెలవలు వచ్చేసాయ్. అమ్మమ్మగారిల్లు చేరుకోగానే తనకన్నా ముందే వాళ్ళ బాబాయ్ పిల్లలు, మేనత్త పిల్లలు చేరుకున్నారు.. వాళ్ళని చూసిన చిన్ని ఆనందానికి అవధులు లేవంటే నమ్మండి.. తన ఈడు పిల్లలతో ఆడుతూ, పాడుతూ, కేరింతలు కొడుతూ, తెగ అల్లరి చేస్తుంటే, ఇంతలోనే.. ఎవర్రా ఆ కేకలు అరుపులు ఏంటి ! అంటూ రానే వచ్చింది సూర్యకాంతం మామ్మ.. చిన్నిని తదేకంగా చూస్తూ.. ఏమే నువ్వు పూర్ణ కూతురువేగా అంటూ కళ్ళకు ఉన్న అద్దాలను సర్దుకుంటూ ఆరా అడిగింది.. “అవును మామ్మ.. నేను చిన్నిని” అంటూ సమాధానం ఇచ్చింది బెరుగ్గా చూస్తూ.. “నువ్వటే, ఇంకా ఎవరో అనుకున్నానే పిల్లా.. ఐనా ఏమాటికి ఆమాటే.. మా పూర్ణ రంగులో పావు వంతు కూడా రాలేదే నీకు.. మొత్తం మీ బాబు రంగే.. “అంటూ వికటాట్టహాసం చేస్తూ వెళ్ళిపోయింది.. అది విన్న చిన్ని ఎంతో గర్వంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.. మరి ఏ ఆడపిల్లకైనా గర్వమేగా నువ్వు నీ తండ్రి పోలిక అని అంటే.. సాయంత్రం భోజనానికి బాబాయ్ పిల్లలు, మేనత్త పిల్లలు అందరు వరండాలో పంక్తి ఏర్పాటు చేసుకున్నారు.. కధా కాలక్షేపాలతో ఆ రోజు రాత్రి నిద్రలోకి జారుకున్నారు.. ఆ మర్నాడు ఉదయం.. “ఒసేయ్.. నీళ్లు వదిలాడు.. త్వరగా బిందె తీసుకురా” అంటూ ఒక కేక వేసింది చిన్ని అమ్మమ్మ.. తడవుగా చిన్ని వీధి పైపు దగ్గరకి వెళ్ళబోయింది అమ్మమ్మ తో.. “నువ్వు రాకు చిన్ని.. బిందె ఇలా చెల్లి కి ఇచ్చి నువ్వు నుయ్యి దగ్గర ఉన్న అంట్లు కడిగేయ్” అంటూ చెప్పి వెళ్ళిపోయింది అమ్మమ్మ.. చిన్ని మొఖం లో సంతోషం. అమ్మమ్మ నన్ను బరువు మోయనివ్వదు.. అనుకుంటూ వెళ్ళిపోయింది.. ఆ లేత హృదయానికి తెలియదుగా నల్లగా ఉన్న కారణంగా వాళ్ళ అమ్మమ్మ తనని వెంట తీసుకెళ్లలేదు అని.. ఇలా అవహేళనల మధ్య కాల గర్భంలో 12 ఏళ్ళు గడిచిపోయాయి.. చిన్ని తన చదువు ముగించి నాన్న ఇష్ట ప్రకారం ఒక చిన్న స్కూల్ లో టీచర్ జాబ్ లో చేరింది.. చిన్నికి వయసుతో పాటు చలాకితనం, చురుకుదనం, కొంటెతనం.. పెరిగిపోయాయి.. ఎవరు ఏమి అనుకున్నా తను చీమంతైనా చలించేదే కాదు.. ఇలా ఉండగా పెళ్లి చేయడానికి సంబంధాలు చూసే సమయం దగ్గర పడింది. ఇంతలో అమ్మమ్మ నుండి ఇంకో సలహా.. ‘పిల్ల నల్లగా ఉంది అని అంటున్నారుగా.. అదేదో మీ ఆడపడుచు అబ్బాయి కి అడగొచ్చుగా.. ఇద్దరు నలుపేగా.. ’ అంటూ. అది విన్న తండ్రికి కోపం, బాధ.. ఏమీ అనలేని పరిస్థితి.. దుఃఖం ఒకపక్క, మంచి సంబంధం కుదరాలి అని ఆలోచన ఒకపక్క.. ఈ రెండిటి మధ్య ఆ తండ్రి ఆవేదన.. ఇంతలో చిన్ని జాబ్ చేసే చోట ఒక సంబంధం ఉంది.. అతను అన్ని విధాలా చిన్నికి తగిన వాడు.. పైగా అతనికి చిన్ని అంటే ఎంతో ఇష్టం.. అంటూ చిన్ని సహఉద్యోగి సత్య గారు కబురు పంపించారు.. అది విన్న చిన్ని తండ్రికి అంతులేని ఆనందం.. నల్లగా ఉన్న తన కూతుర్ని ఇష్టపడడం తనకి తానుగా చేసుకోవడానికి అడగడం.. ఇదంతా ఏదో ఒక అద్భుతంలా తోచింది.. శాస్త్రోక్తంగా ఆడపిల్ల వారు వెళ్లి, పెళ్లి మాటలు అడగాలి కాబట్టి పెద్దమనుషుల తో వెళ్లి కట్నకానుకలు మాట్లాడుకుని, పెళ్లి నిశ్చయించారు.. అనుకున్నదానికన్నా వైభవంగా చిన్ని వివాహం జరిగింది.. చిన్నికి వచ్చిన భర్త నిజంగానే అందగాడు.. ఇద్దర్ని కన్నులారా చూసుకున్న ఆ తండ్రి కళ్ళలో ఆనందభాష్పాలు జాలువారాయి.. చిన్ని కి ఇదంతా ఒక కలలా అనిపించింది.. అవును ఇదంతా కలలానే మిగిలింది. చిన్ని జీవితం.. వివాహం జరిగిన విషయం వాస్తవమే ఐనా ఇదంతా కేవలం డబ్బు కోసమే చేసుకున్నాడు. నిజం తెలిసిన చిన్ని ఏమీ చేయలేని స్థితి.. అందంగా లేని అమ్మాయిలు ఐతే ఎక్కువ కట్నాలు కానుకలు ఇస్తారు అనే నీతి లేని ఆలోచనలకు ఈ నల్ల పిల్ల జీవితం ప్రశ్నార్ధకం?!

***సమాప్తం***



రచయిత్రి పరిచయం

అందరికీ నమస్తే..

నా పేరు వరలక్ష్మి. బెల్లంకొండ.

నేను చిరు ఉద్యోగిని.

నేను ఇంతకు ముందు ఎటువంటి కథలు రాసిన అనుభవం లేదు.కానీ నాకు కథలు చదవడం అంటే చాలా ఇష్టం. ఆ ఆసక్తే నన్ను ఈ కథను రాసేలా చేసింది.





229 views0 comments
bottom of page