top of page
Original.png

నాలోనే నీవై..

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #Nalone Neevai, #నాలోనేనీవై, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

ree

Nalone Neevai- New Telugu Poem Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 09/06/2025 

నాలోనే నీవై - తెలుగు కవిత

రచన: సుధావిశ్వం ఆకొండి


ఊహ తెలిసిన నాటి నుండి

నీకోసం నీ దర్శనం కోసం

తపిస్తున్నాను పూజిస్తున్నాను

ఎన్నో సుగంధ పుష్పాలతో

అర్చించాను ఆరాధించాను

ఎన్నో క్షేత్రాలు దర్శించాను

నీ దివ్యమంగళ రూపానికి

ప్రతిబింబంలా కనిపించింది

కానీ..

నీలా తోచలేదు

అన్నమయ్య ఆరాధనలో ఆనందించావట 

త్యాగయ్య కీర్తనలో కరిగిపోయావట 

రామదాసు గానంలో మైమరచావట

విన్నాను పెద్దలు చెప్పగా


శబరిని కరుణించావు

కన్నప్పను భక్తునిగా మార్చావు

నిరక్షరకుక్షిని రసమయ రామాయణం రాసేలా చేశావు

ఇదంతా వింటే..

నీవెక్కడో దూరాన లేవని

పరమాత్మగా నాలోనే అంతర్ముఖంగా ఉండి,

నా జీవన సమరంలో 

నాతోడుగా ఉండి నడిపిస్తున్నావని

జీవన చరమాంకం లో గ్రహించాను

గుడుల్లోనే కాదు, భక్తుల గుండెల్లో కూడా 

నిరంతరం నివాసం ఉంటావని

తెలిసేసరికి దేహంలో ఓపిక తగ్గింది

నీ చరణాలే శరణు అని ఇప్పటికైనా గ్రహించాను నీ కరుణ వలన

దయామయా శరణు

������������



ree

-సుధావిశ్వం





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page