top of page

నవవధువు



 'Navavadhuvu' - New Telugu Story Written By Sivajyothi

Published In manatelugukathalu.com On 08/05/2024

'నవవధువు' తెలుగు కథ

రచన: శివ జ్యోతి


కొత్తగా పెళ్లయిన అమ్మాయి మదిలో ఎన్నో ఆలోచనలు, తనకు తెలిసిన తను చూసిన ప్రేమ కావ్యాలు ఎన్నో కౌగిలింతల ముద్దుల పర్వాలు ఎన్నో ఊహల ఉయ్యాలలని తను తెలుసుకొనే రోజులవి. తనకు తెలియని, తన ఊహకందని తోటి వారి చూపులెన్నింటికో కొత్త అర్థాలు తెలుసుకుంటున్న రోజులవి. తను ఎందుకో అందరి మధ్య ఉన్నా ఒంటరిగా ఉన్న భావనని అలవాటు చేసుకుంటున్న సమయం అది. 


తన చుట్టూ ఉన్న అమ్మలక్కలు తను తెచ్చిన ఆస్తి నగలు డబ్బు బేరిజు వేస్తున్న రోజులవి. తను ఏదైనా సాధించగలను అనే నమ్మకం నుండి తను ఏమీ సాధించలేను అనే అపనమ్మకం వైపుగా అడుగులేస్తున్న రోజులవి. తన తీరిక, కోరిక, ఓపిక తన కోసం మాత్రమే కాదని తెలుసుకుంటున్న రోజులవి. ఇళయరాజా సంగీతం మదిలో మోగుతూ ఉన్న కూడా వంటగదిలో పనులకై పరుగెడుతున్న రోజులవి. 


అమ్మ తనతో చెప్పే మంచి మర్యాద, కట్టు, బొట్టు, కట్టుబాట్లు లాంటి పదాలకి అర్థాలు తెలిసే రోజులవి. తనలో నిండుగా ఉన్న అమాయకత్వం కానరాకుండా పోతున్న రోజులవి. తనలో చిందులేస్తున్న చిలిపితనం ఛిద్రమవుతున్న రోజులవి. ఆడుతూ పాడుతూ ఉండే తనలోని నృత్యకారిణి కాలంలో విలీనం అవుతు ఉందని తెలిసి విలయతాండవం చేసే రోజులవి. తనకు తెలియని కొత్త దేవతలకు సరికొత్త కోరికల దీప కాంతితో కొలిచే రోజులవి. 

కారడివిలో కాసే వెన్నెల అయిన తన ఆలోచనలను అదిమి పెట్టే రోజులవి. పుట్టింటి ఆప్యాయతల కన్నా అత్తింటి బాధ్యతలు బరువవుతున్న రోజులవి. తన భావాలు బంధాల బందీగా బానిసవుతున్న రోజులవి. మెడకు ఉచ్చు బిగించి బంగారు పంజరంలో బంధిస్తున్న తనకు స్వేచ్ఛ కోరుకునే రోజులవి. 

***

శివ జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం:

నా పేరు శివ జ్యోతి . నేను హైదరాబాద్ వాస్తవ్యురాలిని. నాకు రచనలపై ఉన్న ఆసక్తితో కథలు రాయడం కవితలు రాయటం మొదలు పెట్టాను . నాకు సమాజంలో జరిగే అన్యాయాలను ఆసక్తికరంగా రాయడం అంటే ఇష్టము. నా రచనలు పాఠకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.


88 views1 comment
bottom of page