నీకోసం
- Mohana Krishna Tata

- 2 days ago
- 1 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #నీకోసం, #Neekosam, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Neekosam - New Telugu Poem Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 27/11/2025
నీకోసం - తెలుగు కవిత
రచన: తాత మోహనకృష్ణ
మధ్యాహ్నం పన్నెండో గంటైనా..
రాత్రి ఒంటిగంటైనా..
ఏ రోజైనా..
ఏ జాములోనైనా..
ఏ గడియైనా..
నా కన్నుల్లో నిలిచేది నీవే
అందుకే నా కంటనీరు రాదు...
నా కవితలకు ఊపిరి పోసేది నీవే
అందుకే నా కళల రాణివి నీవే...
ప్రకృతి అందంలో అంతా నీవే
అందుకే ఆనందం అంతా నాదే...
నా మదిలో నీ స్టానం పదిలం
నీ ప్రేమకోసమే దాని ఆరాటం
నీ రూపమే నాకంటి దీపంగా
నీ పలుకులే ప్రేమ మంత్రాలుగా..
నాటి నీ జ్ఞాపకాలతో జీవిస్తూ..
ఇంకా ప్రాణాలతో..
నీకోసం వేచి చూస్తున్నా ఇలా..
********

-తాత మోహనకృష్ణ




Comments