top of page

నేను మనిషిని



'Nenu Manishini' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally 

Published In manatelugukathalu.com On 26/01/2024

'నేను మనిషిని' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


నేను మనిషిని

మానవత్వమున్నవాణ్ణి

సృష్టిలోని జీవులలో

నేనూ ఒక జీవినే

వ్యక్తిత్వం ఉన్నా

నాకో ప్రత్యేకతంటూ లేదు

మానవత్వ మొక్కటే

మనిషిని చేస్తుంది

కష్టపడి పని చేస్తా

ముష్టి బతుకును ద్వేషిస్తా

ప్రకృతి సంపద నా స్వంతం కాదు

నా శ్రమ ఏ మాత్రం పరులది కాదు

సోమరిగా నేనుంటే

లేమికి నేనే బాధ్యుడను

ఉన్నవాడు తింటుంటే

ఎన్నటికీ బాధపడను

నేనెవరిని ద్వేషించను

నేనెవరిని కీర్తించను

నేనెవరిని నిందించను

నేనెవరిని పూజించను

వ్యక్తిత్వం వదలుకోను

భుక్తికి లేదని బాధపడను

శ్రమయే నా సొత్తు

క్షమయే నాకు పొత్తు

కులం మతం నాకు లేదు

కులం పేరు జూపి నాదు

కలం కాదు కలుషితం

నేను మనిషిని మానవత్వ మున్నవాణ్ణి.


--సుదర్శన రావు పోచంపల్లి

33 views0 comments
bottom of page