top of page

నేను సైనికుడను

#NenuSainikudanu, #నేనుసైనికుడను, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #తెలుగుకవిత, #TeluguPoem

Nenu Sainikudanu - New Telugu Poem Wtten By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 19/05/2025

నేను సైనికుడను - తెలుగు కవిత

రచన: కందర్ప మూర్తి


 నన్ను కడుపున కన్నది మా అమ్మే ఐనా

 నన్ను ముద్దుగ చూసినది దేశ భరత మాత

 మొదటిగ దేశ మాతను కాపాడటం నా కర్తవ్యం


 నాతో పుట్టిన నా సహోదరులు దూరమైనా

 బాల్యంలో నాతో ఆడిన నా స్నేహితులు

సన్నిహితుల ఆదరాభిమానాలు

తీపి గుర్తులుగా మదిలో దాచుకుంటా


నాకు జన్మ నిచ్చిన ఊరును వదిలినా

దేశ సౌభాగ్యమే నా ఊపిరిగ

దేశ సరిహద్దుల రక్షణే నా ప్రధమ కర్తవ్యం


దేశ జాతీయ జండాను హిమాలయాల్లో ఎగరేస్తా

దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటుతా

శత్రుమూకల గుండెల్లో భయాన్ని రేకిస్తా


 "ఒక సైనికుడి ఆ(ని)వేదన"

 

 ఒక వేళ నేను దేశ సరిహద్దుల్లో విధుల నిర్వహణలో అమరుడినైతే


 నా పార్థివ శరీరాన్ని పెట్టెలో ఉంచి ఇంటికి పంపండి,


 నా బహదుర్ సర్వీస్ మెడల్సు ఛాతీ మీద పెట్టి


 మా అమ్మకు చెప్పండి, నాగురించి చింత వద్దని


 మా నాయనకి చెప్పండి, నా భాద్యత నెరవేర్చానని


. నా సోదరుడికి చెప్పండి, శ్రద్ధగా చదవమన్నానని


 నా సైకిల్ తాళాలు ఇంక తనవేనని


 నా సోదరికి చెప్పండి, దిగులు పడవద్దని


 అన్నయ్య దేశం కోసం అమరుడయాడని


 రాఖీ ఆకాశం నుంచే కట్టించుకుంటానని


 నా గ్రామ వాసులకి చెప్పండి, మీ బిడ్డ మీలో ఉన్నాడని


 మిత్రులకు నా విన్నపం, మీరు నా భాద్యత వహించాలని


 నా దేశానికి చెప్పండి, భరతమాత వడిలో నిద్రుస్తున్నానని


 ఎందువల్ల నంటే ' నేను సైనికుడిని ''


 దేశరక్షణ కోసం ప్రాణాలు అర్పించడం నా కర్తవ్యం


 భరతమాతా! మేముండగా నీ దరికి శత్రుమూకల్ని రానివ్వం


 నిశ్చింతగా ఉండు తల్లీ! నీ సైనిక బిడ్డల అండ ఎల్ల వేళలా నీకు ఉంటుంది.

 ***


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page