top of page

నేటి యువకుడు

#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #TeluguKavithalu, #తెలుగుకవితలు, #నేటియువకుడు, #NetiYuvakudu

Neti Yuvakudu - New Telugu Poem Written By - Vemparala Durgaprasad

Published In manatelugukathalu.com On 30/05/2025

నేటి యువకుడు - తెలుగు కవిత

రచన: వెంపరాల దుర్గాప్రసాద్


జన్మ నిచ్చిన తలిదండ్రులను

ప్రేమించ లేడు

విద్యనొసగిన గురువుని

లెక్క సేయడు

దేహ ప్రసాదియైన 

దేవుడయిన లేడనుచు

ఇరుగు పొరుగు వారి

ఉనికి పట్టించుకోడు

కలల ప్రపంచాన తేలుచుండు

నెట్టింటి సామ్రాజ్యము నేలు

చుండు..

కరముల నిడుకొన్న దృశ్య సాధనమె కడు రమ్యమై తోచు చుండు..

మానవ సంబంధములన్ని

మృగ్యమగుచుండు..

అభివృద్ధి పేరుతో తిరోగమన బాట పట్టేడు నేటి యువకుడు..

దేహమునకు వ్యాయామ

విలువనే మరిచేడు

అధిక బరువు, అనారోగ్యానికి

ఆనవాలుగ నిలిచేడు

భావి తరాలకు యితడా ప్రతినిధి?



-వెంపరాల దుర్గాప్రసాద్




Comments


bottom of page