top of page
Writer's picturePenumaka Vasantha

న్యూయార్క్ డైరీ - పార్ట్ 1



'New York Diary - Part 1/2' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 16/06/2024

'న్యూయార్క్ డైరీ - పార్ట్ 1/2' తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత



ఫస్ట్ టైం, అమెరికా వెళ్ళటం..


న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగి బయటకు రాగానే, మా చెల్లి బుజ్జి, మరిది భైజు, మా రమా అక్కగారి అబ్బాయి చైతు, నా కూతురు సంతు ఉన్నారు.  బుజ్జి నాకోసం తెచ్చినవి ఇచ్చి, "త్వరగా మా ఇంటికి రా.. !” అని వాళ్ల కారులో తనుండే ప్లేసుకు వెళ్ళిపోయింది.  


 చైతు, నన్ను తన కారులో ముందు, వాళ్ళింటికి తీసుకెళ్లాడు.  కార్లో నుండి బయటకు, చూస్తుంటే, పక్కన సీనరీ చాలా బావుంది. చిన్నపుడు, చైతూ.. ! నన్ను, వచత్త పిన్ని అనేవాడు.  అపుడే ఇంత పెద్దవాడయ్యాడు? అనిపించి, ఆశ్చర్య పోయాను.  ఇంటికొచ్చేసరికి, ఘుమఘుమలు, మా కోడలు, వాసుకి, వంట చేసి వుంచింది.  ఫ్లైట్ లో తిన్న తిండికి, నోరు చవి చెడి వుండటం వల్ల, వాసుకి, కంచంలో వడ్డించిన అన్నిటినీ, తినేసాను.  


అబ్బ టూ డేస్ కు ఇంత కరువు బట్టినట్లు తినటం, నాకే సాధ్యం.  జెట్లాగ్ వుంటుందని, వాలిపోతున్న, నా కనురెప్పలను, మూయకుండా, కాపు కాసారు, మా పిల్లలు.  ఎలాగో నైట్ వరకు వెయిట్ చేసి, డిన్నర్, అవతంతోనే, నిద్ర పోయా.  మొదటి రోజు అలా గడిచింది. 


 మా సంతు ఇల్లు ఎలా? వుంటుందా అని, తెగ ఆతృతగా వుంది.  సింగిల్ బెడ్ రూం హౌస్ బావుంది.  దీని అపార్ట్మెంట్ మధ్యలో, పార్క్ వుంటుంది.  చుట్టూతా, అపార్ట్మెంట్సు ఉన్నాయి.  నేను ఏప్రిల్ ఎండింగ్ వెళ్ళినా ఇంకా చలిగానే వుంది.  నేను ఇండియాలో ఒక సమ్మర్, తప్పించుకున్నానని ఆనంద పడ్డా.  


 "వసంతా.. ! ఎపుడు? వస్తావే ఇక్కడకు.  త్వరగా రావే.. ! అమెరికా అయితే వచ్చావు.. కాని నా దగ్గరకు రావటానికి ఏంటే? ఇంత లేట్..!" అని మా బుజ్జి చెల్లి ఫోన్లో అంది


"బుజ్జి.. ! ఎయిర్ పోర్ట్ లో నిన్ను కలిసినా..  మాట్లాడుకున్నట్లే..  లేదే మనిద్దరం.  నేనూ.. ! నిన్ను ఎపుడు? చూస్తానా అని..  వెయిటింగ్!" అన్నాను. 

 

 మా అమ్మాయి దగ్గర, నెల ఉన్న తర్వాత బుజ్జి పిన్ని దగ్గరకు వెళదామని గొడవ చేసాను.  


“ఈ వీకెండ్ వెళదాం”, అంది, ఎపుడు వీకెండ్, వస్తుందా.. ! 

అని వెయిటింగ్.  


 ఇక్కడ, షాపింగు మాల్స్‌లో అందరూ పరిచయమున్నట్లె..  ‘హాయి..!’ అని పలకరిస్తే, నేను ఎంతో సంతోషపడి, వాళ్ళను ‘హాయి..’  అనేదాన్ని.  


“అందరూ, ఎంత చక్కగా పలకరిస్తూన్నారే..”  అంటే, "అమ్మా.. ! అటు చూడు, మన పక్కనున్న వాళ్ళని కూడా పలకరిస్తున్నారు.  

అందరినీ విష్ చేస్తారు, నువ్వింకా వాళ్ళ వైపు 

అలా వింతగా చూడ”కని విసుక్కుంటే..  నా చూపు వాళ్ల వైపు నుండి మరల్చాను. 


 మా అమ్మాయి ఆఫీసు కెల్లగానే, ఏవో సీరియల్స్ పెట్టుకుని చూసి, కాసేపు రెస్ట్ తీసుకునే దాన్ని.  సాయంత్రం, లేవగానే, మైక్రోవేవ్ లో పాప్కార్న్ పాకెట్ పెట్టుకుని, తీసి తినేదాన్ని.  వెడ్నెస్ డే, మా అమ్మాయి, ఇంటికి దగ్గరలో, ఒక ఐస్ క్రీం పార్లర్ వుండేది.  అక్కడ ఐస్ క్రీం సూపర్ వుండేది.  వెడ్నేస్ డే ఐస్క్రీమ్ కోసము

 వైట్ చేసేదాన్ని. 


 ముందు బాల్కనీలో వున్న కుండీలో తులసి మొక్క పెట్టాను.  అక్కడ ఇంట్లో వినాయకుడికి చేసిన, ఉండ్రాళ్ళు కుండీలో వేసే దాన్ని.  ఒక ఉడుత, ఎంత పెద్దగా ఉందో? అది వచ్చి తిని వెళ్లేది.  పక్కింటి బాల్కనీ నుండి ఒక పెద్ద నల్లపిల్లి కూడా వచ్చేది.  దాన్ని చూస్తే చాలా భయం వేసేది.  వాళ్ళు పిల్లిని పెంచుతున్నారు.  'వీళ్ళ హాబి తగలేయా, ఏ కుక్కనో పెంచుకోకుండా..  ' అనుకున్నాను.  


దాన్ని పొమ్మనటానికి, ఇంగ్లీష్ లో అరవాలా ఏంటి? ఎంతకూ అది పోకపోయేసరికి నాకు డౌట్ వచ్చేది. 


 మా అమ్మాయి, వచ్చేసరికి, మిరపకాయ, బజ్జీలు వేద్దామని, హైలో స్టవ్ మంట పెంచితే.. పొగలు వచ్చి అలారం మోగింది.  అపుడే మా అమ్మాయి వచ్చి కాపాడింది.  "నేనున్నపుడు చేయి వంటలు, లేదంటే, ఫైర్ వాళ్ళు వస్తా”రని కోప్పడింది.  


అవే బజ్జీలు, హాట్ బాక్సులో సర్దుకుని స్టార్ట్ అయ్యాను.  మా చెల్లి దగ్గరికి.  


 మా అమ్మాయి డ్రైవ్ చేస్తుంటే.. ! నేను చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళాను. మా చెల్లి, నేనూ.. ! చిన్నప్పుడు మేము కొట్టుకున్నట్లు ఎవరు? బహుశా కొట్టుకుని ఉండరు.  

న భూతో న భవిష్యత్.. ! నాకు నోరు ఆగకుండా తిట్టేదాన్ని అది తిట్టకుండా కొట్టేది.  ‘నేను నీ కన్నా పెద్దదాన్ని.. ! నన్ను కొడతావా?’ అని నేను మళ్ళీ తిట్లు.  


మా కొట్లాటను ఎంజాయ్ చేస్తూ చూసేది మా బామ్మ.  ఆ తర్వాత, దాన్ని కామెంటరీ రూపంలో మా నాన్నకు చెప్పేది.  అదివిని మా నాన్న మమ్మల్ని తిట్లు.  ఇది చూసి మా అన్నయ్యా.. ! మా బామ్మతో స్టిక్ విరిగింది గానీ, ఇక హాయిగా నిద్రపో.. !" అనేవాడు.  


 "స్టిక్కులంటావు, ఏంటి.. ? స్టిక్ లంటే” అడిగింది మా బామ్మ. 


"పుల్లలు, అపుడు నారదుడు, ఇపుడు నువ్వు.. ! సరేనా.. !వాళ్ళు కొట్టుకుంటే నీకెందుకు? అన్నీ నాన్నకు చెప్తావు.  అందుకే, ఇవాల్టి నుంచి నీ పేరు పుల్లాయమ్మ” అనేవాడు. 


 "ఆహా.. ! నీ చెల్లెళ్ళు కొట్టుకోవచ్చు, గానీ నేను మా అబ్బాయితో చెపితే వచ్చిందా? అన్నీ ఆ తానులోని గుడ్డలేగా.. ! మీరందరూ..  ఒకటే! నేనే.. ! పరాయి దాన్ని” అని ముక్కు చీదేది. 

 

 మేము కొట్టుకోటానికి చీపురు, చేట, చెంబు కాదేదీ కొట్టుకోటానికి అనర్హం అన్నట్లు ఉండే వాళ్ళమా.. ? అదేంటో నా పెళ్లి అవటంతోనే మేము తిట్టుకోవడం, కాని కొట్టుకోవటం కాని చేయలేదు.  

 

 అప్పటి వరకు అన్నం తినగానే కంచాలు నువ్వెత్తు అంటే నువ్వెత్తూ.. ! అని వంతులు వేసుకుని ఎత్తకుండా తినగానే, చదువుకోవాలని వెళ్ళేవాళ్ళం. 

 

 ఇక్కడ మా బామ్మ మాట ఒకటి గుర్తుకు వస్తుంది ఎపుడు..  నాకు.  అక్కాచెల్లెళ్ళు చిన్నప్పుడు కొట్టుకుంటారు పెద్దయి ప్రేమగా ఉంటారు.  అదే అన్నతమ్ములు చిన్నప్పుడు ప్రేమగా ఉంటారు పెద్దయి కొట్టుకుంటారు" అనేది. 

 

 మా చెల్లి, మా అమ్మాయి సంహిత, వున్న దానికి మూడు గంటల దూరంలో ఉంటుంది.  మా అమ్మాయికి 

ఆఫీస్ ఉండటం వల్ల ఒక వీకెండ్.. ! హాఫ్ దూరం అది డ్రైవ్ చేస్తూ ఒక పిజా పాయింట్ దగ్గర దింపితే, మా చెల్లి వచ్చి నన్ను మిగతా హాఫ్ దూరం డ్రైవ్ చేసుకుంటూ.. ! 

వాళ్ళుండే కేనడికట్ లోని మిస్టిక్ కు తీసుకెళ్లేది. 

 

 ఇదేదో పాత సినిమాల్లో విలన్స్ సూట్కేస్ లు మార్చుకుంటున్నట్లు ఉంది కదా.. ? ఆ సూట్కేస్ నేనే.  సమ్మర్ స్టార్ట్ అవ్వటం వల్ల కోట్ వేసుకోలేదు.  అయినా మా వెనుక, టిం, టిట్టిం మ్యూజిక్ స్టార్ట్.  పీజా పాయింట్ దగ్గర పీజా తినేవాళ్ళం, కుర్చీలో కూర్చున్న నేను ఉరఫ్ (సూట్కేస్) పిజ్జా.. తిన్నాను.  నన్ను (సూట్కేస్) మార్చుకుని, ఎవరి దారి వాళ్ళు చూసుకునే వాళ్ళు మా చెల్లి, మా అమ్మాయి.  

 

 మెల్లిగా హాట్ బాక్స్ ఓపెన్ చేశా.. వాము బజ్జీల వాసనకి అది "ఏయ్ పచ్చిమిరపకాయ బజ్జీలు.. !” అంటు తీసుకొని ఆత్రంగా తిన్నది. చిన్నప్పటి జ్ఞాపకాలలో మునిగాము.  మా ఊరి మిరపకాయ బజ్జీల కొట్టుదాక వెళ్లి వచ్చేలోగా బుజ్జి వాళ్ల ఇల్లు వచ్చింది. 

 

 ఇంటికి చేరే సరికి వాళ్ల ఆత్తగారు, ఎర్రనీళ్ళతో 

మాకు దిష్టి, తీశారు. ఆవిడ ప్రేమకు పొంగిపోయాను. 

నేను తెచ్చిన గిఫ్ట్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు.

=======================================================================

ఇంకా వుంది.. 

=======================================================================


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


26 views0 comments

Comments


bottom of page