కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link

'Nilo Nuvve' New Telugu Story
Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో......................
అయితే నిత్య చర్చనీయ అంశాలకు చక్కని పరిష్కారాన్ని చూపేది ఒక్క మిత్రుడు మాత్రమే, ఎందుకంటే మిత్రుని దగ్గరే మనం కొంత చనువుగా ఉంటాము, అన్ని విషయాలను చర్చిస్తూ ఉంటాము, అటువంటి సమయంలోనే మన సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అదెలాగో మనం తెలుసుకుందాం....!!!!
శివ
సురేష్
వినయ్
సుంకన్న
దశరథ
ఈ ఐదుగురు ఒకే కళాశాలలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అంతే కాకుండా ఒకే గదిలోనే అద్దెకు కూడా కలిసి ఉండటం విశేషం. మొదట వీరి పరిచయం ఎలా జరిగినా ఒకరంటే ఒకరికి గౌరవం, అభిమానం. ఇంతలా స్నేహాన్ని పెంచుకున్న వారి మధ్య కొన్ని అంశాలు చర్చలోకి వస్తుంటాయి. ఇలా వచ్చినపుడు అన్ని సమస్యలకూ పరిష్కారం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది, ఎందుకంటే ఐదు మంది ఉన్నారు కాబట్టి ఎవ్వరికో ఒకరికి అయినా సరైన సమాధానం ఆలోచనా రూపంలో వస్తుంది కదా....!!!! మరి ఆ సరైన ఆలోచనను అందరూ తప్పకుండా పాటిస్తారు, నిజమంటారా కాదంటారా??
ఆ విధంగానే ఒక రోజు శివ ఒక సమస్యాత్మక సందేహాన్ని చర్చనీయాంశంగా తీసుకువచ్చాడు. ఆ విషయం ఏమిటి అంటే ‘సంతోషం ఎందులో ఉంది’ అనీ…
ప్రతి ఒక్కరినీ అడుగుతూ చర్చిస్తూ ఉన్నాడు. అలా వారి గదిలో ఉండే మిగిలిన మిత్రుల దగ్గరకు తీసుకువచ్చాడు. గదిలోకి వచ్చి “సంతోషం ఎందులో ఉందో నేను తెలుసు కోవాలి అనుకుంటున్నాను. మీరు నాకు సమాధానం చెప్పాలి” అన్నాడు శివ.
“నాకు తెలిసినంతవరకూ డబ్బు ఉంటే సంతోషం అదే ఎగురుతూ వస్తుంది. ఎందుకంటే అన్ని సమస్యలను తీరుస్తుంది. అన్ని కొరికలని కూడా తీర్చుకోవచ్చు కదా” అన్నాడు సురేష్.
“అదేం కాదురా! నీకు ఒక అమ్మాయి ప్రేమ దొరికింది అంటే చాలా సంతోషంగా ఉంటావు” అన్నాడు వినయ్.
“లేదు లేదు… నీకు చాలా మంచి కుటుంబం ఉంది అంటేనే అదృష్ట వంతుడు అవుతావు. నిత్యం సంతోషంగా ఉంటావు” అన్నాడు సుంకన్న.
ఇవన్నీ విన్న శివ “ఏం దశరథా.. ఏమీ మాట్లాడకుండగా ఉన్నావు. నువ్వైనా చెప్పచ్చు కదరా ఏది సంతోషమో” అన్నాడు.
అపుడు మిగిలిన స్నేహితులు “మేము చెప్పింది అబద్ధం అనుకున్నావా రా..!! మళ్ళీ వాణ్ణి అలా అడుగుతున్నావ్?” అన్నారు.
“అదేం లేదురా! వాడి ఆలోచన, మరియు ఉద్దేశం ఏమిటో కనుగొనాలి అని అడుగుతున్నాను” అని, నువ్వు చెప్పురా దశరథా” అన్నాడు శివ.
“ఏమి చెప్పను రా..!! నీ సంతోషం నీలోనే దాచుకుని ఎక్కడెక్కడో వె తుకుతాను అంటూ ఉంటే..” అన్నాడు దశరథ.
“ఏమీ నాకు అర్థం కాలేదు, కొంచం అర్థం అయ్యే విధంగా చెప్పు” అన్నాడు శివ.
"ఏమీ లేదురా. ఇప్పుడు సురేష్ కి డబ్బు అవసరం ఉంది కాబట్టి డబ్బును సంపాదిస్తే సంతోషంగా ఉండవచ్చు అని అనిపిస్తుంది సురేష్ కి.
వినయ్ కి డబ్బు ఉంది కానీ అమ్మాయి లేదు కాబట్టి ఆ అమ్మాయి ఉంటే బాగుంటుంది అని వినయ్ అభిప్రాయం.
సుంకన్నకు డబ్బులు ఉన్నాయి, అమ్మాయి ఉంది కానీ ఇంటిలోని పరిస్థితులు బాగలేవు. అందువల్ల కుటుంబం బాగుంటే సతోషంగా ఉంటాము అనేది సుంకన్న అభిప్రాయం.
నీకు ఇంట్లో పరిస్థితులు బాగున్నాయి, డబ్బు ఉంది. అమ్మాయి కూడా ఉంది కానీ నీవు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు అంటే, నీకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం కదా.. నిన్ను ఒక వేదికపై పాడమని అవకాశం ఇచ్చిన తర్వాత డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా కొంత మంది చేత ప్రశంసలు అందుకున్నావు అంటే చాలా ఆనందపడతావు కదా..!! అలా నీ ఆనందాన్ని నువ్వే నీలోనే వెతుక్కోవాలి ఎవ్వరిలోనూ వెతుక్కోకూడదు. ఎందుకంటే ఎవ్వరి సంతోషం వాళ్ళదే కాబట్టి..!!!!
ఇంకా చెప్పాలంటే
బలం నువ్వే,
బలగం నువ్వే,
భయపడితే పిరికి వాడివి నువ్వే,
ధైర్యం తెచ్చుకుంటే ధైర్యవతుడు నువ్వే,
సాధించాలి అని అనుకుంటే సాహస వీరుడు నువ్వే,
సాధించలేను అని లొంగితే ఓడిన వాడివి నువ్వే....!!!!
ఇలా నువ్వు ఏమి చేయాలి అనుకుని చేస్తావొ అదే అవుతావు.
నాకు మంచి ప్రేరణ కలిగించే వ్యక్తిగా ఎదగాలని కోరిక. నా నుంచి నలుగురు వ్యక్తులు ప్రేరణ పొందినా నాకు చాలు. అదే పెద్ద విజయం గా బావిస్తాను.
నీవు ఎప్పుడు అసలైన సంతోషాన్ని పొందగలుగుతావు అంటే కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు, బాధలు, అవమానాలు,
అన్యాయాలు... అన్నింటినీ దాటి నువ్వు అనుకున్న పనిలో విజయం సాధించినప్పుడు అసలైన సంతోషాన్ని, ఆనందాన్ని వాటికి ఉండే అర్థాలను, నిర్వచనాలను తెలుసుకోగలుగుతావు..!! నేను చెప్పింది నిజమేనంటారా..?? కాదంటారా..?? రా అన్నాడు దశరథ.
అక్షరాలా నిజమే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. మంచి ప్రేరణ కలిగించే వ్యక్తిగా ఎదుగుతావు. మాకు కూడా ఒక మంచి సలహాని ఇచ్చి అవగాహన కలిగించావు” అని అందరు మిత్రులు దశరథను మెచ్చుకున్నారు.
చూశారు కదా. ఈ విధంగా మన సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి....!!!!
సర్వే జనా సుఖినోభవంతు
కిడాల శివకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
కలం పేరు:- రాయలసీమ కన్నీటి చుక్క....✍️✍️✍️✍️
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
Comments