top of page

నిరీక్షణ - పార్ట్ 2

#AchantaGopalaKrishna, #ఆచంటగోపాలకృష్ణ, #నిరీక్షణ, #Nireekshana, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Nireekshana - Part 2/2 - New Telugu Story Written By Achanta Gopala Krishna

Published In manatelugukathalu.com On 02/05/2025

నిరీక్షణ - పార్ట్ 2/2 - పెద్దకథ

రచన: ఆచంట గోపాలకృష్ణ


జరిగిన కథ:

జగపతి గారి కూతురు మాధవిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అతని భార్య తమ్ముడు అజయ్. 

మాధవి, రాజేష్ అనే వ్యక్తితో వెళ్ళిపోతుంది. 

గతంలో మాధవిని ప్రేమించిన మహేష్ ఊరికి తిరిగి వచ్చి, జగపతిగారి ద్వారా విషయం తెలుసుకుంటాడు. 


ఇక నిరీక్షణ పార్ట్ 2 చదవండి. 


మహేష్ బయలుదేరి నది ఒడ్డుకి వచ్చాడు.. పడవ అవతలి ఒడ్డు నుండి వస్తోంది.. అంతవరకు అక్కడే తాను ఎంతో ఇష్టం గా కూర్చునే రావి చెట్టు గట్టు మీద కూర్చున్నాడు.. ఎంత ప్రశాంతంగా ఉంటుంది.. 


చల్లని గోదావరి.. 

చుట్టూ పచ్చని చెట్లు.. 

నదిని చూస్తూ, ఈ రావి చెట్టు కింద కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది.. 

ఇంతలో అతనికి బాగా సహాయం గా ఉండే రామయ్య పరిగెత్తుకుని వచ్చాడు.. 


“మహేష్ బాబు.. మీగురించి తెలిసి వచ్చాను.. 

వెళ్లి పోయారు ఏమో అనుకుని పరిగెత్తుకుని వచ్చా.. 

బాగున్నారా బాబు” అంటూ అడిగాడు.. రామయ్య. 


“ఎలా ఉన్నావు.. రామయ్యా” అంటూ ఆప్యాయంగా పలకరించాడు మహేష్.. 

“బాగానే ఉన్నాను.. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అమ్మాయి గారి గురించి” అన్నాడు.. 


“అవును. జగపతి గారు అంతా చెప్పారు..” అన్నాడు మహేష్.. 


“అది కాదు బాబు.. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు..” అన్నాడు.. 


“అవునా..”

 

“నేను వాళ్లకోసమే వెతుకుతానని ఆయనకి చెప్పాను.. బాగానే ఉన్నారా అని అడిగాడు.. 

బాగానే ఉన్నారు.. 

ఇదిగో ఈ ఆజయ్ అన్ని చోట్లా వెదికి స్తున్నాడు.. 

వాళ్ళకి దొరక్కుండా.. తప్పించుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు.. ఒక ఉరి వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు.. 

ఎవరికి కనబడ కుండా అక్కడే క్షేమం గా ఉన్నారు.. 

రాజేష్ ఫోన్ చేస్తూ అందరూ ఎలా ఉన్నారో అని వాకబు చేస్తూ ఉంటాడు రహస్యం గా..” అన్నాడు రామయ్య.. 


“సరే.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు” అని అడిగాడు మహేష్.. 


రామయ్య, వాళ్ళు ఏ ఊరిలో ఉన్నారో చెప్పాడు. 


“మీరు తప్పక వస్తారని.. కనబడితే.. మీకు మాత్రమె చెప్పమన్నాడు..” అన్నాడు.. 


“సరే అయితే నేను వెడతా లే.. అక్కడకి.. వాళ్ళని తీసుకుని వచ్చి ఈ అజయ్ పని పడతా..” అన్నాడు మహేష్.. 


“జాగ్రత్త బాబు.. వీడు చాలా దుర్మార్గుడు..” అన్నాడు.. 


“పడవ వచ్చేసింది. ఇంక నేను బయలుదేరి వెడతా.. 

బాబుగారి ని జాగ్రత్తగా చూసుకోవాలి మరి” అన్నాడు మహేష్.. 


“తప్పకుండా బాబు. మీరు వెళ్లి రండి” అన్నాడు.. రామయ్య.. 


పడవ లో బయలుదేరి వెళ్ళాడు మహేష్.. ఈ విషయం చెట్టు చాటు నుండి విన్న అజయ్ అనుచరుడు పరిగెత్తు కు వెళ్లి అజయ్ చెవిలో వేసాడు.. 


“ఒరేయ్! అందరూ రండి. ఎక్కడ ఉన్నారో తెలిసి పోయింది.. 

పదండి.. ఈ సారి నేను వస్తా.. లాక్కుని వద్దాం” అంటూ బయలుదేరారు.. 

******

మాధవి రాజేష్ బజార్లో సరుకులు కొనుక్కుని వస్తున్నారు.. 

“ఇంకా ఎంత కాలం ఇలా దాక్కుని బ్రతకాలి.. అమ్మ నాన్న గుర్తుకు వస్తున్నారు..” అంది బాధ గా.. 


“ఏం చేస్తాం.. ఇంకొంత కాలం ఎదురు చూద్దాం.. ఫోన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ వివరాలు తెలుసుకుంటున్నా.. 

అంతా బాగానే ఉన్నారుట..” అన్నాడు రాజేష్.. 

“సరే ఇప్పటికే ఆలస్యం అయింది పద” అంటూ నడవ సాగాడు.. 


ఇంతలో వేగం గా జీపులు రావడం చూసాడు.. అంతే.. 


“మాధవి.. వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారు.. పద” అంటూ పక్కకి తీసుకుని వెళ్ళాడు.. 


కొంత మంది దిగారు.. 


“ఒరేయ్.. ఊరంతా గాలించండి.. ఈ సారి వాళ్ళు తప్పించు కో కూడదు.. " అంటూ అరిచాడు అజయ్..

 

అందరూ తలో దిక్కుకు పరిగెత్తారు.. 


“ఈ సారి మనం దొరికి పోయినట్లే. ఏం చేద్దాం..” అని ఒక్క క్షణం ఆలోచించి.. 

“సరే.. నేను ఇటునుంచి పారిపోతాను.. వాళ్ళు నన్ను చూసి నా వెంట పడతారు.. నువ్వు ఈ సందులోనించి ఇలా వెడితే రైల్వే స్టేషన్ వస్తుంది.. ఏదో ఒక ట్రైన్ ఎక్కేయ్.. నేను ఎలాగో అలా వచ్చి చేరుకుంటాను.. ఫోన్ చేసి ఏ ట్రైన్ నాకు చెప్పు.. జాగ్రత్త” అంటూ.. వాళ్ళకి కనబడే లా పరిగెత్తాడు రాజేష్.. 


“అదిగో రాజేష్.. పట్టుకోండి రా” అంటూ వాడి వెనుక పడ్డారు.. 


“ఒరే మీరు కూడా వెళ్ళండి.. వాడిని పట్టుకోండి” అని..  అటు పంపాడు.. 


రాజేష్ అటువైపు పరిగెత్తు కుంటూ వెళ్ళాడు.. 


ఈ లోగా మాధవి స్టేషన్ వైపుకి పరిగెత్తింది.. పట్టాల వెంబడి పరుగెత్తి ప్లాట్ ఫారం ఎక్కింది.. ఇంతలో అనౌన్స్ మెంట్ వచ్చింది.. 


ట్రైన్ నంబరు.. ఒకటవ ప్లాట్ ఫారం మీదకి వచ్చు చున్నది.. అని.. 


ట్రైన్ ప్లాటుఫారం మీదకి వచ్చేసింది.. మాధవి ట్రైన్ తో పాటు పరిగెడుతోంది.. 


ఈ లోగా కొంతమంది, అజయ్ ఆమె వెనుకే వచ్చేసారు.. 


“ఎక్కడికి పోతావు.. వాడు అటు వెడితే నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. అందుకే నేను ఇటువైపు కి వచ్చా..” అన్నాడు.. 


“ఒరేయ్ పట్టుకోండి రా” అని అరిచాడు.. 


ఆమె పరిగెడుతోంది.. 

ట్రై ను కొంత ముందుకి వెళ్లి స్లో గా ఆగింది.. అజయ్ కర్ర విసిరాడు.. 


ఆమె కాళ్ళకి తగిలి కింద పడిపోయింది.. 

దొర్లు కుంటూ వెళ్లి ఒక కంపార్ట్మెంట్ గుమ్మం దగ్గర ఆగింది.. లేవలేక పోతోంది.. 

పాపం.. 

బాధగా అజయ్ వైపుకి చూసింది.. 


అందరూ అక్కడికి వచ్చి ఆగారు.. 


“ఒరే లాక్కుని రా రా..” అంటూ పురమాయించాడు.. 


వాడు దగ్గరకి వచ్చి రెక్క పట్టుకో బోయాడు.. అప్పుడే ట్రైన్ లోనించి దిగాడు ఒకతను.. 


ఒక్క తన్ను తన్నాడు వాడిని.. 


వాడు ఎగురుకుంటూ వెళ్లి మిగతా వాళ్ళ మీద పడిపోయాడు.. వాళ్ళు పడిపోయారు.. 


భయం తో కళ్ళు ముసుకున్న మాధవికి

ఏం జరిగిందో అర్ధం కాలేదు.. 

నెమ్మది గా కళ్ళు తెరిచి చూసింది.. 

ఎదురుగా మహేష్.. 


ఒక్కసారిగా దుఃఖం పొంగుకుని వచ్చేసింది.. మహేష్ అంటూ పిలిచింది. 


అతను నెమ్మదిగా భుజం పట్టుకుని లేవదిసాడు.. 


“రా.. భయపడకు. నేను వచ్చేసా గా.. ఇలా కూర్చో” అంటూ కూర్చోపెట్టాడు.. 


అక్కడే తోపుడు బండి లో ఉన్న వాటర్ బాటిల్ ని ఓపెన్

చేసి.. తాగు.. అంటూ పట్టించాడు.. 


పరుగెత్తి పరుగెత్తి అలసిపోయిందేమో.. 

గబ గబ తాగేసింది.. 


“నువ్వు ఇక్కడే కూర్చో.. నేను వాళ్ళ సంగతి తేల్చుకుని వస్తా..” అంటూ ధైర్యం చెప్పి.. వాళ్ళ వైపుకి నడిచాడు.. మహేష్.. 


“ఎవడ్రా వీడు.. మధ్యలో.. వాడిని వేసేసి దాన్ని తీసుకుని రండి” అని అరిచాడు.. అజయ్. 


వాళ్ళు ముందుకి కదిలారు.. అందరిని చితక కొట్టేసాడు మహేష్.. 


అజయ్ ని కూడా.. 


కింద పడి ఉన్న అజయ్ ని చూడగానే కోపం పెరిగి పోయింది మహేష్ కి.

 

“ఇంకా ఎంత దూరం పారిపోవాలి రా వీళ్ళు.. ఆస్థి కోసం అయిన వాళ్ళని కూడా చూడవా.. నువ్వు అసలు మనిషివి కాదు.. నిన్ను చంపేస్తా” అంటూ అక్కడ కొబ్బరిబోండం బండి లోనించి కత్తి తీసాడు.. 


చెయ్యి పైకి ఎత్తగానే.. 

“ఆగు మహేష్.. అతనిని ఏమి చేయవద్దు.. ఎంతైనా మా మావయ్య కదా.. వదిలేయ్..” అంది మాధవి. 


“చూడు మామయ్య.. నాకు ఆస్తి అక్కరలేదు.. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతాను.. నా మానాన నన్ను వదిలేయ్.. చాలు..” అంది మాధవి. 


సిగ్గు తో తల వంచు కున్నాడు అజయ్.. 

ఇంతలో రాజేష్ వచ్చాడు.. 


“ఒరేయ్ మహేష్.. సమయానికి వచ్చావు రా” అంటూ కౌగలించుకొని.. 

మాధవి వైపు చూసాడు.. 


అజయ్ ముందుకి వచ్చి “నన్ను క్షమించండి.. నా తప్పు తెలుసుకున్నా.. నువ్వు.. మాధవి సుఖం గా ఉండండి..” 

అంటూ చేతులు కలప బోయాడు.. 


“ఆగండి.. ఆగండి.. చేతులు కలపాల్సింది నాతో కాదు.. మహేష్ తో..” అన్నాడు.. రాజేష్.. 


అందరూ.. ఆశ్చర్య పోయారు.

మహేష్ కూడా.. 

“అదేమిటి? మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని విన్నాను.. 

ఎంతైనా నేను ప్రేమించిన అమ్మాయి కదా, అజయ్ నుంచి తప్పించుకుని ఎక్కడో తల దాచుకున్నారని తెలిసి

ఆ సమస్య పరిష్కరించి వెడదామని వచ్చాను” అన్నాడు మహేష్.. 


“అలా ఎలా మిత్రమా.. నీకు కాబోయే భార్య నాకు చెల్లెలు లాంటిది.. నీ ఆచూకీ తెలియదు.. ఈ అజయ్ నుంచి కాపాడడానికి.. నాకు వేరే మార్గం తెలియలేదు.. అందుకే లేపుకుని వచ్చేసా.. అన్ని ఊర్లూ తిరిగి.. ఇదిగో ఈ ఊరిలో కాస్త సహాయం దొరికింది.. 


ఇక్కడి వాళ్ళ సహాయం తో ఈమెని కాపాడుకుంటూ వస్తున్నా.. ఇన్నాళ్లకు ఈమె నిరీక్షణ ఫలించింది.. 

నువ్వు వచ్చావు.. అమ్మా మాధవి! నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ప్రేమించిన వాడి కోసం ఎన్ని కష్టాలు పడ్డావో.. అన్ని సమస్యలు తీరి పోయాయి..” 

అంటూ ఆమె చెయ్యి మహేష్ చేతిలో పెట్టాడు రాజేష్.. 


“నన్ను క్షమించు మాధవి. రావడం కొంచెం ఆలస్యమైంది.. 

నా మూలంగా ఇన్ని కష్టాలు.. పడ్డావు.. నీ ప్రేమని దక్కించుకోవడానికి కష్టపడి డబ్బు సంపాదించుకుని వచ్చాను..” అన్నాడు.. 


ఆనందం తో కౌగలించుకొని, మురిసి పోయింది.. మాధవి..

 

వాళ్లిద్దరూ అలా తన్మయత్వం లో ఉంటే.. మహేష్ వీపు మీద కొట్టాడు రాజేష్.. 

"బాబు ఇది రైల్వే స్టేషన్.. అందరూ మనల్నే చూస్తున్నారు.." అన్నాడు.. 


ఓహ్.. అవును కదూ.. అంటూ సిగ్గుపడి.. 

సరే పద అందరం మన ఊరు వెడదాం అన్నాడు.. మహేష్.. 


“వద్దురా.. ఈ ఊరి వాళ్ళతో అనుబంధం పెరిగింది.. 

నాకోసం చాలా చేశారు.. నేను ఇక్కడే ఉండిపోతా.. 

అయినా నాకూ ఒక అమ్మాయి దొరికింది లే.. మా పెళ్లికి తప్పక రావాలి..” అన్నాడు.. రాజేష్. 


“తప్పకుండా.. ఇదిగో ఈ చెక్ తీసుకో.. ఇందులో 10 కోట్లు రాసాను..” అన్నాడు.. 


“ఏరా.. స్నేహాన్ని కొనే కరెన్సీ ఇంకా రాలేదు రా” అన్నాడు.. నవ్వుతూ.. రాజేష్.. 


“అదికాదు రా.. ఈ ఊరు ఇంత చేసింది మనకి, 

ఊరికి ఉపయోగడే, ఏదైనా మంచి చేయరా..” అన్నాడు మహేష్.. 


“అలా అన్నావు బాగుంది.. పెళ్లికి రావాలి రోయ్.. ఫోన్ చేస్తా.. 

బాబాయ్ గారిని ఆడిగానని చెప్పు.. ఇక్కడి పనులు పూర్తి చేసుకుని శుభలేఖ లతో వస్తా..” అన్నాడు రాజేష్.. 


మరోసారి స్నేహితుడి ని కౌగలించుకొని.. ట్రైన్ ఎక్కారు.. ట్రైన్ బయలుదేరింది నెమ్మదిగా.. 


గుమ్మం లోనించి అతనికీ ఇద్దరూ టాటా చెప్పారు.. 


లోపలికి వచ్చి.. “అరే హడావిడి లో టికెట్ తీయడం మర్చి పోయాను..” అన్నాడు మహేష్.. 


“నేను తీశాలే బాబు” అన్న మాట వినిపించింది వెనుక నుండి.. 


ఎవరా అని చూస్తే అజయ్ టికెట్ లతో ఉన్నాడు.. 


“నేను వచ్చి బావగారికి క్షమాపణ చెప్పి నిన్ను అప్పచెప్పుతా.. మీ ఇద్దరి పెళ్లికి నేనే అన్ని చూసుకుంటా.. 

అలా అయినా నేను చేసిన తప్పుకి కొంత ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లు అవుతుంది..” అన్నాడు.. అజయ్..

 

“నిజంగానే మామయ్య.. ఇప్పుడు నువ్వు మారిపోయావు.. 

ఆస్థిఅంతా నీ పేరు మీద రాసేయ మంటాను నాన్నని” అంది మాధవి.. 


“వద్దు తల్లీ.. ఇప్పటి వరకూ నేను చేసింది చాలు.. ఇక మీదట ఊరిలో మంచి అజయ్ అంటే ఏమిటో చూపిస్తాను..” అన్నాడు అజయ్.. 


“అయ్యా మరి మమ్మలిని ఏం చేయమంటారు..” అన్నాడు అసిస్టెంట్.. 


“మీరు అందరూ రౌడీఇజం మానేసి వ్యవసాయం చేస్తున్నారు.. నాతో ఉంటూ..” అన్నాడు నవ్వుతూ..

 

“వ్యవసాయమా.. మేమా.. హతవిధి” అంటూ తలపట్టుకున్నాడు.. 


అందరూ నవ్వుకున్నారు.. 


శుభం.. 


ఆచంట గోపాలకృష్ణ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు ఆచంట గోపాలకృష్ణ

రచనలు..కథలు ,సిరీస్ ,కవితలు సమీక్షలు రాయడం ఇష్టం..

15 సంవత్సరాలు గా రచనలు చేస్తున్నా..

నాకు flyincoloursachantagopalakrishna.blogspot.com అనే బ్లాగ్ ఉంది..


ఇంకా pratilipi ane magazine lo సిరీస్ రాస్తున్నా..

Comments


bottom of page