top of page

ఒకే ఒక జీవితం'Oke Oka Jeevitham' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 31/01/2024

'ఒకే ఒక జీవితం' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


'ఈ జీవితం జీవించడం కన్నా.. చావడం బెటర్.. ' అని అనుకుని లావణ్య రైలు పట్టాల వైపు గబగబా నడుస్తోంది. 


'ఇన్నాళ్ళు ఎంతో ఓపిక తో ఉన్నాను.. ఇక నా వల్ల కాదు' అని అనుకుని దూరంగా.. ట్రైన్ రావడం చూసిన లావణ్య.. ట్రైన్ కు ఎదురుగా పరిగెత్తడం మొదలుపెట్టింది. చావు ఎంత తొందరగా వస్తే, అంత తొందరగా బాధ తగ్గుతుందని.. ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తడం మొదలుపెట్టింది. 


ట్రైన్ సౌండ్ తో పక్కన రోడ్డు మీద కార్ లో వెళ్తున్న ఒక పెద్ద మనిషి ఇదంతా చూసి.. జరగబోతున్నది ఏమిటో ముందే ఊహించి.. వెంటనే పట్టాల వైపు పరుగులు తీసాడు. 


"హలో.. మేడం.. ! ఆగండి.. ఎవరు మీరు? ఎందుకు అలా పరిగెడుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి.. నా మాట వినండి. నా మాట విన్న తర్వాత కుడా.. మీకు పట్టాలపై పరిగెత్తాలని ఉంటే.. అలానే చెయ్యండి. ఇక్కడ అరగంటకొక ట్రైన్ వస్తుంది.. ప్లీజ్ ఆగండి.. " అన్నాడు అనిల్. 


"నేను ఆగను.. మీరు ఎవరు నన్ను ఆపడానికి.. ?" అంది లావణ్య.


"నా మాట వినండి.. నెక్స్ట్ ట్రైన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్.. కావాలంటే, దానికి ఎదురుగా పరిగెత్తండి.. " అని చెప్పి అమ్మాయిని పక్కకు లాగేసాడు అనిల్.. 


"మీరు ఎవరు? నన్ను ఎందుకు ఆపాలని చూస్తున్నారు?" అంది లావణ్య.

 

"మీరు చేస్తున్నది ఏమిటో మీకు తెలుసా. ?"


"ఎందుకు తెలియదు.. ఆత్మహత్య చేసుకుంటున్నాను.. "


"ఎందుకో.. " అడిగాడు అనిల్.

 

"అవన్నీ.. మీకెందుకు చెప్పాలి.. ?"


"ఒక మామూలు మనిషి గా అడుగుతున్నాను.. మీకు నా కన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయా? అని నా డౌట్.. "


"నాకు చాలా సమస్యలు ఉన్నాయి. అందుకే తొందరగా పోవాలని అనుకుంటున్నాను.. "


"అయితే.. మీ కథ చెప్పండి.. మీకు ఎక్కువ సమస్యలు ఉంటే, నెక్స్ట్ ట్రైన్ ఉండనే ఉంది.. "


నా పేరు లావణ్య. చిన్నప్పటినుంచి చాలా తెలివైన అమ్మాయినని అందరూ అనేవారు. నన్ను చూసి మా అమ్మ నాన్న చాలా మురిసిపోయేవారు. ఇంట్లో నన్ను చాలా గారాబంగా పెంచారు. నాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎంతవరకు చదువుకుంటానంటే.. అంతవరకూ చదివిస్తాను అన్నారు నాన్న. అలా, నేను ఇంజనీరింగ్ చదివాను. మంచి ఉద్యోగం చేద్దాం అనుకునే లోపే.. ఒక ఘోరం జరిగింది. మా నాన్న ఆక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటి నుంచి నా జీవితం అంతా మారిపోయింది. 


ఒక రోజు.. అమ్మ రెండో పెళ్ళి చేసుకుని.. ఇతనే నా భర్త అని పరిచయం చేసింది. వాలిద్దరు ఇంట్లో చేసే చిలిపి చేష్టలకి.. నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇంత చదువుకున్నాను కదా.. బయటకు వచ్చి మంచి ఉద్యోగం చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాను. ఎంతైనా అమ్మను వదలి వెళ్ళాలంటే.. మనసు ఒప్పలేదు. ఒకరోజు అమ్మ ఇంట్లో లేని సమయంలో.. అమ్మ భర్త నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ విషయం చెప్పుకోవడానికి ఇప్పుడు మా అమ్మ ఒకప్పటి అమ్మ కాదు. చాలా మారిపోయింది. 


ఇంక ఆలస్యం చెయ్యకుండా.. ఇంట్లోంచి వచ్చేసి.. ఒక హాస్టల్ లో చేరాను. అక్కడే ఉంటూ.. ఒక మంచి ఉద్యోగం లో జాయిన్ అయ్యాను. రోజూ ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి.. సాయంత్రానికి ఇంటికి చేరుకునేదానిని. ఆఫీస్ లో అందరూ చాలా ఫ్రెండ్లీ గా ఉండి నాకు వర్క్ చాలా తొందరగా నేర్పించారు. కానీ, మా మేనేజర్ నేను అనుకున్న అంత మంచివాడు కాదని తర్వాత తెలిసింది. 


ఒకరోజు తన కేబిన్ లోకి రమ్మని.. తాను కోరినట్టు గా తనని సుఖపెట్టమని.. అడిగాడు మేనేజర్. లేకపోతే, ఉద్యోగం లోంచి తీసేస్తానని బెదిరించాడు. తప్పక, నేనే రాజీనామా చేసి వచ్చేసాను. ఉద్యోగం లేక హాస్టల్ లో బాధపడుతున్న నన్ను చూడడానికి అక్కడకు వచ్చిన వార్డెన్ భర్త.. నాతో అవే మాటలు.. అవే చేష్టలు. అక్కడా ఉండలేక.. ఇంక నా అంత దురదృష్టవంతురాలు ఉండదని.. చావు కోసం ఇలా వచ్చాను. 


"ఎంతో ప్రేమ గా చూసుకునే నాన్న చనిపోయారు. ప్రేమ గా ఉండాల్సిన అమ్మ ఏమో అలా నన్ను పట్టించుకోలేదు. అడుగడుగునా మగవాళ్ళ చేష్టలకు, మాటలకు ఇబ్బంది పడుతూనే ఉన్నాను. ఇంక నా జీవితంలో ఎవరు ఉన్నారు చెప్పండి.. ?"


"మీ కథ విన్నాక.. మీకు జరిగినదానికి 'ఐ యాం రియల్లీ సారీ' మేడం.. ! మీకు నా గురించి తెలియాలంటే, మా ఇంటికి రండి.. మీకే తెలుస్తుంది. మీరు అలా అనుమానించడంలో అర్ధం ఉంది.. కాని, నేను అలాంటి వాడిని కాదు. ఇంట్లో నా శ్రీమతిని మీకు పరిచయం చేస్తాను.. " అన్నాడు అనిల్. 


"మీరు అంతగా అగుతున్నారు కాబట్టి.. వస్తాను. చావుకే సిద్ధపడ్డాను.. ఇంక భయమెందుకు చెప్పండి.. !" అంది లావణ్య. 


అనిల్.. తన కార్ లో లావణ్య ని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు.. బెల్ రింగ్ చెయ్యగానే.. ఇంట్లోంచి పనివాడు వచ్చి తలుపు తీసాడు.. 


"లోపలికి రండి లావణ్య.. " అని పిలిచాడు అనిల్. 


లోపలికి వెళ్ళిన లావణ్య.. అక్కడ వీల్ చైర్ లో ఉన్న ఒక స్త్రీమూర్తి ని చూసింది. "ఈవిడే నా శ్రీమతి.. " అని పరిచయం చేసాడు అనిల్.. 


"ఆమెకు ఏమైంది.. ?" అని అడిగింది లావణ్య .


"ఆక్సిడెంట్ లో రెండు కాళ్ళు దెబ్బతిన్నాయి. మాట కూడా పోయింది.. "


"ఐ యాం సారీ అనిల్ గారు.. " 


"మరి ఈ ఫోటో లో ఉన్నది ఎవరు.. ?" అడిగింది లావణ్య.

 

"మా అబ్బాయి ఆనంద్.. " బదులిచ్చాడు అనిల్.

 

"ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. ?"


"చనిపోయి స్వర్గంలో ఉన్నాడు.. "


"ఐ యాం సో సారీ అనిల్ గారు.. అదేంటి సర్.. ? ఎలా చనిపోయాడు మీ అబ్బాయి?"


"ప్రేమించిన అమ్మాయి తన ప్రేమ ఒప్పుకోలేదు. లవ్ ఫెయిల్యూర్ తో బాగా ఫీల్ అయి.. మా అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు.. "


"కష్టాలు అందరికీ ఉంటాయి. మనం వాటిని ఎలా తీసుకుంటామో అలాగే మన జీవితం ఉంటుంది. మనం ఒక చోటకు వెళ్తున్నప్పుడు.. మధ్య దారిలో బురద ఉంటే, తిరిగి వెనుకకు వచ్చేస్తామా? లేక ఎలాగో ఆ బురదను దాటుకుని.. వెళ్ళాలని చూస్తామా.. ? జీవితం కుడా అంతే.. ఈ ఒకే ఒక జీవితాన్ని మధ్యలో అంతం చేసుకోవడం తప్పు. మానిషి జీవితం చాలా విలువైనది. బురద దాటినట్టే, కష్టాలు దాటుకుని మన జీవిత గమ్యాన్ని చేరుకోవాలి. 


ఈ పొల్యూషన్ లోకంలో.. మనిషి ఆయుష్షు ఎలాగో తగ్గిపోయింది. ఏ వైరస్.. ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. ఉన్న ఈ కొద్ది జీవితాన్ని హ్యాపీ గా జీవించకుండా.. మధ్యలో అంతం చేసుకోవడం ఎందుకు..? మా అబ్బాయి లాగ ఇంకెవ్వరూ సూసైడ్ చేసుకొని జీవితాన్ని బలి చేసుకోకూడదు" అన్నాడు అనిల్ 


"అవును సర్, మీరు చెప్పింది నిజమే.. మీ శ్రీమతి కి ఆక్సిడెంట్ జరిగి.. అలా ఉన్నా.. మీ అబ్బాయి చనిపోయినా.. మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. హాట్స్ ఆఫ్ సర్!"


"నువ్వు ధైర్యంగా ఉండి.. మంచి సంబంధం చూసి పెళ్ళి చేసుకో లావణ్య.. మంచి జాబ్ లో జాయిన్ అవు.. లైఫ్ కి సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్ రెండూ ఉంటాయి. నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే, ఎప్పుడైనా ఇక్కడకు రావొచ్చు.. !"


"థాంక్స్ సర్! మీరు చెప్పినట్టే ఉంటాను.. మీ మాటలు నాలో చాలా ధైర్యం నింపాయి" అని చెప్పి లావణ్య వెళ్లిపోయింది. 


"ఇంతకీ.. సర్ ఏం చేస్తుంటారో అడగనేలేదు.. " అనుకుని బయటకు వచ్చిన లావణ్య.. అక్కడ నేమ్ బోర్డు చూసింది. 'డాక్టర్ అనిల్.. సైకాలజిస్ట్'.. " అని అక్కడ చూసి.. మనసులోనే అతనికి నమస్కారం పెట్టింది లావణ్య.. 


*****

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


63 views0 comments

Comments


bottom of page