top of page

పద్ధతి - పక్కదారి

#PeddadaSathyanarayana, #పెద్దాడసత్యనారాయణ, #PaddhathiPakkadari, #పద్ధతిపక్కదారి, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

Paddhathi Pakkadari - New Telugu Story Written By - Peddada Sathyanarayana   

Published In manatelugukathalu.com On 03/09/2025

పద్ధతి - పక్కదారి - తెలుగు కథ 

రచన: పెద్దాడ సత్యనారాయణ


“అమ్మా, నువ్వు ఎన్నయినా చెప్పు, నేను వినోద్‌తో కాపురము చేయను. మాకు పెళ్లయి ఏడాది కూడా కాలేదు. ఆయనకి నామీద మోజు తీరింది అనుకుంట. ఈ వీడియో చూస్తే మీ అల్లుడు నిర్వాకం తెలుస్తుంది”, అని సెల్ సుందరమ్మకి ఇస్తుంది రమ్య. 


వీడియోలో వినోద్ ఒక అమ్మాయితో రోడ్డుపక్కన కూల్ డ్రింక్ తాగుతూ ఉన్న దృశ్యము కనిపిస్తుంది. 


"అమ్మా, వినోద్‌కి విడాకులు ఇద్దామనుకుంటున్నాను. "


"రమ్య, నీవు ఇప్పుడే అటువంటి నిర్ణయము తీసుకోవద్దు. నేను అల్లుడు గారితో మాట్లాడి అసలు విషయము తెలుసుకుంటాను. "


"సరే, నీ ఇష్టం అమ్మా. వినోద్ మాట్లాడితేనే నీవు మాట్లాడు, అంతేగాని నీవు కాల్ చేయొద్దు. "


సాయంత్రము వినోద్ అత్తగారింటికి వస్తాడు. సుందరమ్మ కాఫీ ఇచ్చి వెళ్లబోతుంది. "అత్తయ్య గారు, ఒకసారి రమ్యని పిలుస్తారా?"


లోపల గదిలోంచి రమ్య, "నేను ఆయనతో మాట్లాడే ప్రసక్తి లేదు. నీవే మాట్లాడి సంగతి కనుక్కో, " అంటుంది. 


"వినోద్, రమ్యని మేము పద్దతిగా పెంచాము. నీవు ఈ విధముగా చేస్తావనుకోలేదు. "


"అత్తయ్య గారు, రమ్య వీడియో చూసి అపార్థము చేసుకుందని నాకు అర్థమయ్యింది. మాతో పని చేసే సహోద్యోగినికి కడుపు నొప్పి వచ్చి ఆసుపత్రికి నాకారులో తోడుగా ఇంకో ఉద్యోగినిని తీసుకెళ్లాను. దారిలో వాటర్ బాటిల్ కొని, మేమిద్దరం కూల్ డ్రింక్ తాగాము. "


ఇంతలో లోపల గదిలోంచి రమ్య, "అమ్మా, ఆయన చెప్పే కాకమ్మ కథలు నమ్మొద్దు. వచ్చిన దారినే వెళ్ళమని చెప్పు. "


"రమ్య నా మాటలు నమ్మదని తెలిసే, యథార్థముగా జరిగిన దృశ్యము ఆసుపత్రి CCTV నుంచి డౌన్‌లోడ్ చేసి తీసుకు వచ్చాను. చూడండి. "


సుందరమ్మ వీడియో చూసి, గదిలోకి వెళ్లి రమ్యకి చూపిస్తుంది. 


వీడియో చూసిన తర్వాత రమ్య వినోద్ దగ్గరకి వచ్చి, "నన్ను క్షమించండి, " అని గోముగా అడుగుతుంది. 


"రమ్య, ఒకరి మీద ఒకరికి నమ్మకము ఉండాలి. అంతేగాని ప్రతిసారి నిన్ను నమ్మించేందుకు సాక్ష్యాలు తేవడము కష్టము. సరే, ఇక బయలుదేరు, " అని ఇద్దరూ ఇంటికి వెళ్లిపోతారు. 


సంవత్సర కాలము గడచిన తర్వాత ఒకరోజు విడాకుల నోటీసు మరియు ఉత్తరము రాసి వెళ్లిపోతుంది. 


"అత్తయ్య గారు, ఈ ఉత్తరము, విడాకుల నోటీసు చూడండి. మీ అమ్మాయిని ఎంత పద్దతిగా పెంచారో మీకే అర్థమవుతుంది. " 


ఉత్తరము వినోద్ నే చదవమని తిరిగి ఇస్తుంది. 


వినోద్ చదువుతాడు:


"నన్ను క్షమించు. నేను డిగ్రీ చదివే రోజుల్లో నా సీనియర్ విద్యార్థి విజయ్‌ని ప్రేమించాను. వాళ్ల ఇంట్లో వాళ్లు మా పెళ్లికి ఒప్పుకోనందువలన, నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈ సంగతి మా ఇంట్లో వారికి తెలియదు. నీకు నా ప్రేమ విషయము చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. 


రెండు నెలల క్రితం విజయ్‌ని మాల్‌లో కలవడం జరిగింది. విజయ్ అమెరికాలో జాబ్ చేస్తున్నానని మరియు ఇంకా వివాహము చేసుకోలేదని చెప్పాడు. నాకు పెళ్లయిందని చెప్పాను. నన్ను మరచిపోవడం కష్టమని చెప్పి, ఇష్టమయితే తనతో అమెరికా వచ్చేయమని బతిమాలాడు. 


నేను ఆలోచించుకొని చెప్తానని నెల గడువు అడిగాను. నేనుకూడా విజయ్‌ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. అప్పటి పరిస్థితులకి అనుగుణముగా నిన్ను చేసుకున్నాను. వినోద్, నీతో యాంత్రికంగా జీవించే కన్నా విజయ్‌తో సంతోషముగా జీవించడం సరయిన నిర్ణయము అని భావించి వెళ్ళిపోతున్నాను. 


మీరు నన్ను మన్నించి విడాకులు ఇచ్చి, మరో వివాహము చేసుకోగలరని కోరుతున్నాను. 


మరోమారు క్షమించమని ప్రార్థిస్తూ,  రమ్య


***

పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ree

రచయిత పరిచయం:

 మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు   నా  నమస్కారములు.

పేరు: పెద్దాడ సత్యనారాయణ   B .A  విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్                                                               

డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్   

విద్యాభ్యాసము సికింద్రాబాద్                                                                    

సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి  4 కధలు 1 నాటిక                                                

వ్యాసాలకి పారితోషికం  మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.                                            

సంఘసేవ:  గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి   మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.


 


Comments


bottom of page