పగటివేళ
- Gorrepati Sreenu
- 5 days ago
- 1 min read
#Pagativela, #పగటివేళ, #GorrepatiSreenu, #గొర్రెపాటిశ్రీను, #TeluguKavithalu, #TeluguPoems

Pagativela - New Telugu Poem Written By - Gorrepati Sreenu
Published In manatelugukathalu.com On 13/08/2025
పగటివేళ - తెలుగు కవిత
రచన: గొర్రెపాటి శ్రీను
పని నుండి కాస్త సేదతీరుతున్న సమయాన
జ్ఞాపకమై కనులముందు ప్రత్యక్షమై నట్లుగా
కనిపించీ కనిపించనట్లు గా అగుపిస్తూ
నా హృదయ సవ్వడిని పెంచుతూ అలరిస్తుంటావు!
సాయం సంధ్య వేళ
చల్లని చిరుగాలులు సన్నగా తాకి వెళుతున్నప్పుడు
అందంగా నేలపై కి రాలుతున్న నీటిజల్లుల సందళ్ల ఆస్వాదనలో నేనుండగా..
వినీల గగన సీమలో విరిసిన హరివిల్లుల మాటు నుండి తొంగిచూస్తూ సంభ్రమాశ్చర్యాలలో పరవశింపజేస్తుంటావు!
కమ్మని కలల రాత్రి కి స్వాగతిస్తూ నేనుండగా
ఎన్నో కలలు,జ్ఞాపకాలు తోడుగా ఇచ్చావు!
అలసట ఎరుగని పయనం నాది..
నిన్ను చేరాలని
అన్వేషణ ల ముగింపు తీరాన్ని చేరాలని
నీ ఒడిన స్వాంతన పొందాలని తపిస్తుంటాను!
అలజడి రేగిన గుండెల్లోని
మధురమైన అనుభూతులను అక్షరీకరిస్తూ ..
కలం పట్టిన యోధుడు నవుతాను!
***
గొర్రెపాటి శ్రీను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
గొర్రెపాటి శ్రీను కలం పేరుతో రచనలు చేస్తున్న నా పూర్తి పేరు నాగ మోహన్ కుమార్ శర్మ .
తల్లిదండ్రులు : శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు
ఉద్యోగం : ప్రైవేటు కంపెనీలో మేనేజర్.
చదువు : డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్)
వెలువరించిన పుస్తకాలు:
"వెన్నెల కిరణాలు" కవితా సంపుటి(2019),
"ప్రియ సమీరాలు"కథాసంపుటి(2023),
"ప్రణయ దృశ్య కావ్యం" కథాసంపుటి(2025).
ప్రస్తుత నివాసం: హైదరాబాద్.
Commentaires