top of page

పక్షిపిల్ల ప్రబోధం

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #PakshiPillaPrabodham, #పక్షిపిల్లప్రబోధం, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 96


Pakshi Pilla Prabodham - Somanna Gari Kavithalu Part 96 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 19/07/2025

పక్షిపిల్ల ప్రబోధం - సోమన్న గారి కవితలు పార్ట్ 96 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


పక్షిపిల్ల ప్రబోధం

----------------------------------------

ఎన్ని సమస్యలొచ్చినా

పోరాడుము ధైర్యంగా

కడగండ్లు మిగిల్చినా

ఉండుము నిబ్బరంగా


జీవితమే సాగరము

ఆటుపోట్లు సహజమే

సృష్టించును కల్లోలము

చేయాలి సాహసమే


కాదు కాదు పూలబాట

గచ్చుపొదల స్వరూపము

చేసుకొనుము పూలతోట

అద్భుతమే జీవితము


మనోబలం ఊపిరిగా

ఉద్యమించు ఉప్పెనలా

గెలిపే ఆశయంగా

మున్ముందుకు సాగిపో

ree














బామ్మ గారి సూక్తులు

----------------------------------------

మేలు కాదు కలహము

ఉండాలోయ్ దూరము

వెలలేనిది స్నేహము

వసుధలోన శ్రేష్టము


మాటలతో హృదయము

చేయరాదు గాయము

విరిగితే ఏమాత్రము

అతుకుటే దుర్లభము


కల్గియుండు ధ్యేయము

బ్రతుకులో గొప్పగా

అదే ధ్యాస అమితము

ఉండాలోయ్ అనిశము


చేయకు పరిహాసము

మనసు నొచ్చుకునేలా

చేయి మందహాసము

అందరు మెచ్చుకునేలా

ree









చిరు దరహాసము

------------------------

ముఖమున దరహాసము

తెచ్చును మధుమాసము

చీకటిని తరిమేయు

వెలుగులీను దీపము


చిరునవ్వులు అందము

పెదవులతో బంధము

విచ్చిన పువ్వుల్లా

వెదజల్లు పరిమళము


నవ్వులేని మోములు

పువ్వు లేని వనములు

పరికింప వికారము

కాదులే శోభితము


ఒకసారి నవ్వితే

రాలును కాంతి పూలు

వదనంలో చిందితే

కలవెన్నో మేలులు

ree













అనురాగ దేవత అమ్మ

----------------------------------------

తల్లి మనసు చల్లన

మల్లె వోలె తెల్లన

సదనంలో దీవెన

ఎదిగేందుకు వంతెన


అమ్మ ఇంట వెలుతురు

పరిమళించు అత్తరు

గౌరవిస్తే గనుక

దీవెనలు చూచెదరు


తల్లి పలుకు తీయన

చూడ మధుర భావన

దేవత ప్రతిరూపము

చేయరాదు చులకన


ఇంటికి ప్రాకారము

ధ్వనించే ఓంకారము

మాతృమూర్తి భువిలో

పారిజాతము దివిలో


అమ్మది అగ్రస్థానము

ఆమెకివ్వు గౌరవము

మనసే నవనీతము

సుమధుర సంగీతము

ree



















కన్నవారి ప్రబోధం

--------------------------------------

మంచి మనసు ఉంటే

తోడుండును దైవము

సదా సాధన చేస్తే

సిద్ధించును విజయము


దృఢ సంకల్పముంటే

ఏదైనా సాధ్యము

అగునోయ్ జీవితము

అవనిలో సఫలీకృతము


కూడదు నైరాశ్యము

చూపొద్దు పిరికితనము

సానుకూల దృక్పధము

విజయోత్సవ గీతము


ఉండాలోయ్ ఆశయము

బ్రతుకులో గొప్పగా

దాని కోసమే కృషి

సలపాలి మెండుగా

-గద్వాల సోమన్న

Comments


bottom of page