top of page
Original.png

పాపం బాబూరావు!

#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #PapamBaburao, #పాపంబాబూరావు, #TeluguStory, #కొసమెరుపు


Papam Baburao - New Telugu Story Written By Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 29/07/2025

పాపం బాబూరావు! - తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


ఉదయం లేచిలేవగానే, కిందటిరోజు భార్య భాగ్యలక్ష్మి ఊరెళుతూ చెప్పిన మాట గుర్తుకొచ్చింది బాబూరావుకు. 


"అర్జెంటుగా నేను ఊరెళ్ళవలసి వస్తోంది, మా పిన్ని కూతురు పెళ్ళి చూపులున్నాయి మరి! నన్ను తప్పకుండా రమ్మని మరీమరీ చెప్పింది పిన్ని. వెళ్ళక తప్పదు! నా స్నేహితురాలు రవళి రేపు ఉదయం ఇక్కడికి బస్సులో వస్తుంది. దానికి మన ఊళ్ళో ఇంటర్వూకు పిలుపొచ్చిందట. తప్పకుండా రిసీవ్ చేసుకోండే!" అని చెప్పిందామె. 


భార్య ఊళ్ళో లేనప్పుడు రాబోయే ఆమె స్నేహితురాల్ని తలచుకుంటూ రాత్రంతా నిద్రపట్టలేదు బాబూరావుకు. వాచీ చూసుకొని, అప్పటికే టైం అవడంతో, ఆదరాబాదరాగా తయారై ఆర్టీసి కాంప్లెక్స్ చేరుకున్నాడు. అప్పటికే బస్ వచ్చేసింది. అక్కడే వయ్యారాలుపోతూ తన కోసమో కాబోలు ఎదురు చూస్తున్న నల్లకళ్ళద్దాలు ధరించి నిలబడి ఉన్న ఒక యువతి కనిపించింది. 


"మీరు.. మీరు.. రవళి కదూ!" అని అతను అడిగితే, అవునని ఆమె తలూపేసరికి గాల్లో తేలిపోతూ తనింటికి తీసుకెళ్ళాడు బాబూరావు. 


తనూహించినట్లే ఆమె చాలా కలుపుగోరుగా ఉండటంతో తనకి పట్టిన అదృష్టానికి మురిసిపోతూ ఆమెను ఊరంతా తిప్పాడు. అడిగినవి, అడగనివీ కూడా కొనిపెట్టాడు. రాత్రి సినిమాకి తీసుకెళ్ళి, హోటల్లో భోజనం చేసి తిరిగి వచ్చారిద్దరూ. ఇంటికి చేరగానే ఎందుకోమరి ఎక్కడలేని నిద్ర ముంచుకొచ్చింది బాబూరావుకు. తెల్లారి నిద్రలేచేసరికి వీధి తలుపులూ రెండూ బార్లా తెరిచి ఉన్నాయి. రవళి ఇంట్లో కనిపించలేదు, అలాగే ఇంట్లోని విలువైన వస్తువులు కూడా! బీరువాలో భాగ్యలక్ష్మి నగలు కూడా కనిపించకపోవడంతో అతనికి మతిపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. 


అప్పుడే అదేపనిగా సెల్ ఫోన్ మోగడంతో ఎత్తాడు బాబూరావు. భాగ్యలక్ష్మి నుండి వచ్చిన ఫోనది!


"ఏమండీ! నా స్నేహితురాలు రవళి రావడంలేదు, ఆదే రోజు విశాఖపట్నంలో మరో ఇంటర్వూ ఉండటంతో అక్కడికెళ్ళింది. ఈ విషయమే నిన్న మీకు చెప్పాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తారు కాదు నిన్న రోజంతా, ఎక్కడికెళ్ళారేమిటి?.. " అంటూ ఆమె ఇంకా ఏదో చెప్తోన్నా అతని చెవికి ఏమీ ఎక్కడం లేదు. 


వళ్ళంతా చెమటలు పట్టేసాయి. 'నిన్న వచ్చింది భాగ్యలక్ష్మి స్నేహితురాలు రవళి కాకపోతే ఆమె ఎవరు మరి?' అని ఆలోచించలేకపోతున్నాడు. బాబూరావు ఆత్రం చూసి అతన్ని బుట్టలో వేసుకొని మోసగించదలచిందని అతనికెలా తెలుస్తుంది మరి! పాపం బాబూరావు!


సమాప్తం


పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page