top of page
Original_edited.jpg

పాపాయి పాఠం

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #PapayiPatam, #పాపాయిపాఠం, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 120


Papayi Patam - Somanna Gari Kavithalu Part 120 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 19/09/2025

పాపాయి పాఠం - సోమన్న గారి కవితలు పార్ట్ 120 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


పాపాయి పాఠం

----------------------------

ఎవరు హేళన చేసినా

అడ్డంకులు కల్గించినా

ఆశయాన్ని వదిలేయకు

అదేపనిగా చింతించకు


అపనిందలు వేసినా

అసూయనే చాటినా

నీ లక్ష్యం మరువద్దు

సుడిగుండాలు రేగినా


అందరూ నిను వీడినా

అపకారం తలపెట్టినా

ఏమాత్రం కుమిలిపోకు

కన్నీరు ఒలికించకు


పరిస్థితులే మారినా

జట్టుగా దండెట్టినా

ఆత్మవిశ్వాసం వీడకు

కాళరాత్రి ఏతెంచినా


ree















ఏమున్నది ఫాయిదా!

---------------------------------------

నగవులేని ముఖంతో

పూలు లేని తోటతో

ఏమున్నది ఫాయిదా!

మమత లేని మనసుతో


గురువు లేని విద్యతో

నీతిలేని బ్రతుకుతో

ఏమున్నది ఫాయిదా!

నిజం లేని నోటితో


ఫలం లేని తరువుతో

నీరు లేని చెరువుతో

ఏమున్నది ఫాయిదా!

శిధిలమైన కోటతో


సాయపడని చేతితో

నిస్సారపు చేనుతో

ఏమున్నది ఫాయిదా!

కదిలించని పలుకుతో

ree





















పసి వాని పలుకులు

--------------------------------------

ఉండాలి శాంతంతో

తగినంత వినయంతో

గర్వపడ కూడదోయ్!

కాసింత విజయంతో


ఘనమైన ప్రేమతో

మెలగాలి జ్ఞానంతో

విలువలే చాటుతూ

బ్రతకాలి స్ఫూర్తితో


ఎదగాలి చదువుతో

అజ్ఞానం వీడుతూ

నేర్వాలి ఓరిమితో

ఆడుతూ పాడుతూ


తరువులా త్యాగంతో

గురువులా జ్ఞానంతో

నిలవాలి నలుగురిలో

శ్రేష్టమైన బుద్ధితో

ree









కాదు కాదు మంచిది

-----------------------------------------

స్నేహము కోపంతో

వైరము అందరితో

కాదు కాదు మంచిది

బ్రతుకుట స్వార్థంతో


అనిశము అసూయతో

మిగుల బద్ధకంతో

కాదు కాదు మంచిది

ఉండుట గర్వంతో


కీడు చేయు పనులతో

మంచిలేని జనులతో

కాదు కాదు మంచిది

ఓర్వలేని గుణంతో


గుణం లేని వారితో

తృప్తిలేని వాటితో

కాదు కాదు మంచిది

కఠినమైన మనసుతో

ree



















పాడు చేసుకోకు

---------------------------------

వ్యర్థమైన మాటలతో

హానిచేయు తలపులతో

మనసు పాడు చేసుకోకు

విపరీతపు బుద్ధులతో


దురాలవాట్ల ఉచ్చులో

అహంకారపు రొచ్చులో

బ్రతుకు పాడు చేసుకోకు

పలు వ్యసనాల ఊబిలో


దుర్జనుల స్నేహంలో

వారి చెడ్డ దారిలో

నేస్తమా! పయనించకు

అవరోధాల లోయలో


యోచించి అడుగేయాలి

అందరి మేలు కోరాలి

కొండంత హృదయంతో

క్షమాపూలు రువ్వాలి

-గద్వాల సోమన్న

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page