'Paropakaram Idam Sariram' New Telugu Story
Written By Ch. Pratap
రచన: Ch. ప్రతాప్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఒక ఊరిలో ఒక బిచ్చగాడు నివసిస్తుండేవాడు. పొద్దస్తమానం ఆ ఊరి వీధుల్లో తిరుగుతూ, దేవాలయాల దగ్గర నిలబడి బిచ్చమెత్తుకుంటూ పొట్ట పోషించుకుంటుండేవాడు. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకొని దానిని అక్కడ ఖర్చు పెట్టేసుకొని, సాయంత్రాలు రిక్త హస్తాలతో ఇంటికి తిరిగి వెళ్ళేవాడు. వాడి భార్యకు బిచ్చగాడితో పడక, తాను జీవిస్తున్న ఈ జీవితం నచ్చక పిల్లల్ని తీసుకొని చాలా కాలం కిందనే తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏకాకి అయిన వాడు ఊరి చివర వున్న ఒక ఖాళీ స్థలంలో వేసుకున్న పూరిపాకలో ఏక్ నిరంజన్ లా నివసించసాగాడు.
రాను రాను భిక్షాటన భరించరానిదిగా వాడికి తయారయ్యింది. తాను ఏ జన్మలో ఏ పాపం చేసాడో, ఈ జన్మలో బిచ్చం ఎత్తుకొని బతకాల్సి వస్తొంది. ఉదయం లేచింది మొదలు ఇష్టంగా దానం చేసే వాళ్ళు బహు తక్కువ. అధిక శాతం తిట్టుకుంటూ, చీదరించుకుంటూ, శాపనార్థాలు పెడుతూ బిచ్చం వేస్తుంటారు. ఎప్పటికి ఈ జన్మ మారుతుందా అని అనుకుంటూ వుంటాడు.
ఒకసారి ఆ ఊరి రామాలయంలో ఒక తపసంపన్నుదైన సాధువు వచ్చారని, ప్రజల సమస్యలకు తన తప శక్తితో సూచనలు ఇవ్వడం లేదా వాటిని సత్వరమే పరిష్కరించడం చేస్తున్నారని విన్నాడు.
ఆ సాధువు వేంచేసిన రామాలయానికి ఒక రోజు ఆ బిచ్చగాడు వెళ్ళాడు. ఎందరో ప్రజలు నిరాశ నిస్పృహలతో, దుఖంతో, కోపంతో, ఆవేశంతో ఆ సాధువుని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఆ సాధువు ఏం మంత్రం వేస్తున్నారోగాని, వారందరూ తమ సమస్యలను మర్చిపోయి, ఆనందంగా అక్కడి నుండి తిరిగి వెళ్లడం ఆ బిచ్చగాడు కళ్ళారా చూశాడు.
ఆ సాధువు ప్రజలకు ఏ మాయ చేస్తున్నారో అర్ధం కావడం లేదు. కొండంత దుఖంతో వెళుతున్నవారు అంతే ఆనందంగా తిరిగి వస్తున్నారు.వాళ్ల చేతిలో డబ్బు లేక బంగారం లేక వెండి లేదా ఇతర విలువైన వస్తువులు లేవు. కాని ఆనందంగా ఎలా తిరిగీ రాగలుగుతున్నారు ? ఇవన్నీ ఆలోచించి, బిచ్చగాడు కూడా సాధువు వద్దకు వెళ్లి అక్కడ ఏమి జరుగుతుందో చూడాలని అనుకున్నాడు. తన లాంటి దుఃఖ: పీడితులైన వ్యక్తులకు కూడా ఆ సాధువు నుండి ఉపశమనం లభిస్తుందా అన్న విషయాన్ని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు.
సాధువు ని కలవడానికి నడిచాడు. సాధువు ఉన్న చోట చాలా పొడవైన వరుస ఉంది, కాబట్టి బిచ్చగాడు కూడా వరుసలో వచ్చాడు. తన వంతు కోసం వరుస లో నిరీక్షించడం మొదలుపెట్టాడు. అతని వంతు వచ్చి సాధువు దగ్గరికి చేరుకున్నాడు.
అతను సాధువు తో ఇలా అన్నాడు, “మహాశయా, నేను చాలా పేదవాడిని నాదనుకునే ఒక్క వస్తువు నా దగ్గర ఒక్కటి కూడా లేదు.. నా జీవితాన్ని నడపడానికి కూడా నేను ఇతరులను అడ్డుకోవాలి, ఫలితంగా వారి నుండి ఎన్నో చీదరింపులు, ఛీత్కారాలు ఎదుర్కోవలసి వస్తొంది. ఇప్పుడు మీరు చెప్పండి, నేను నా జీవితాన్ని ఎలా మెరుగ్గా జీవించగలను ?”
అతని మాటలు విన్న ఆ సాధువు శాంత స్వరంతో " నువ్వు పేదవాడివి అనుకుంటున్నావు. నిజానికి నువ్వు పేదవాడివి అసలేమాత్రం కాదు.నువ్వు ఈ రోజు వరకు నీ కోసమే బ్రతికావు, ఎవరికీ చీమ తలకాయంత ఉపకారం కూడా చేయలేదు కాబట్టే నీ మనస్సులో పేదవాడివన్న భావనలు తలెత్తుతున్నాయి" అన్నారు.
ఆ మాటలు బిచ్చగాడి లో ఆశ్చర్యం కలిగించాయి." మహత్మా !, అనుక్షణం నా కడుపు నింపుకోవడం కోసం ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతున్న నేను ఇతరులకు ఎలా సాయం చేయగలను ? ఇతరుల ఎంగిలి మెతుకులపై ఆధారపడే నాకు ఇదంతా సాధ్యమేనా? " అని అడిగాడు.
ఇదంతా విన్న సాధువు కాసేపు మౌనం వహించి అతనితో ఇలా అన్నా రు, “నీవు ప్రజలకు సేవ మరియు మేలు చేయగలిగినంత చెయవచ్చు. నీ నోటి ద్వారా ఇతరులకు మంచి మాటలు మరియు దుఖంలో వున్నవారికి స్వాంతన కలిగించే మాటలు చెప్పవచ్చు.. ఇవన్నీ చేయడం ద్వారా మీరు ఇతరులకు సహాయం చేయవచ్చు. కేవలం డబ్బుతో మాత్రమే విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే విద్యను కూడా దానం చేయవచ్చు. భగవంతుడు ఎవరికైనా సంపూర్ణమైన మంచి శరీరాన్ని ఇచ్చినట్లయితే, అతడు పేదవాడు కాదు. అతను కేవలం మనస్సులో పేదవాడు. ఈ ఆలోచనను వీడి ఇతరులకు సేవ చేయాలి.
కష్టంలో వున్నవారికి చేతనైనంత శ్రమదానం చెయ్యవచ్చు. నీకు వచ్చే అన్నంలో కొంత భాగం నోరు లేని జీవాలకు పెట్టవచ్చు. ఇలా ఇతరులకు మన పరిధిలో వీలైనంత సహాయం చేయవచ్చు. ఇతరులకు చేసిన మేలు వెయ్యింతలై మన దగ్గరకే వస్తుంది. మనమందరం పేదలమని చింతిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటాము కానీ ఇది నిజం కాదు. నిజం ఏమిటంటే, మన శరీరం పూర్తిగా మెరుగ్గా ఉండి మనకు సహకరిస్తున్నంత కాలం మనం జీవితంలో ముందుకు సాగడానికి మరియు మన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవాలి..
ఒక వ్యక్తి తన పేదరికం పై శ్రద్ధ చూపి, దానిని మార్చడానికి ప్రయత్నించకపోతే అతను మూర్ఖుడు నువ్వు నీ శ్రామిక శక్తిని ఏనాడూ నమ్ముకోలేదు. భిక్షాటన వదిలి కాయకష్టం చేసుకుంటే ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి తప్పుతుంది. ఈ దిశగా ఆలోచించి కొత్త జీవితం ప్రారంభించు" అని హితబోధ చేసాడు.
ఆ సాధువు మాటలు బిచ్చగాడిలో జ్ఞానోదయం కలిగించాయి. ఆ రోజు నుండే భిక్షాటన వదిలి కాయకష్టం చేసుకుని జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సాధువును దర్శిస్తున్న ఇతరుల లాగే ఆ బిచ్చగాడి జీవితంలో కూడా ఆ రోజు నుండి పెను మార్పు వచ్చింది.
Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.
Comentarios