top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

పరోపకారం


'Paropakaram' New Telugu Story



(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"తాతా! ఒక కధ చెప్పవా..” అంటూ సుబ్బారావు మనవడు గారాలుపోతో అడిగాడు.

చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి "వెళ్లి మీ నాన్న ని అడగరా, కధలు బాగా చెపుతాడు. చిన్నప్పటినుండి నాకు మీ నాన్న చెప్పిన కధలు యిన్ని, అన్నీ కావు. అందుకనే ఇంజనీర్ కావలిసినవాడు, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు" అన్నాడు మనవడితో.


"మధ్యలో నన్ను లాగుతారెందుకు, యిప్పుడు మాత్రం ఏమైంది, ఇంజనీర్ కంటే మా జీతమే ఎక్కువ "అన్నాడు కొడుకు కృష్ణ.


"సరే పద, ఆలా మంచం మీద పడుకుని కధ చెప్పుకుందాం " అంటూ లేచాడు సుబ్బారావు.


గొంతు సవరించుకుని, మనవడికి కధ చెప్పడం మొదలుపెట్టాడు.

‘పూర్వం’ అనగానే మనవడు, “ఛీ పూర్వపు కధ కాదు, నాకు యిప్పటి కధ చెప్పు తాతా” అని అడ్డం తగిలాడు.


“అయితే విను. రామయ్య, సీతమ్మ లకు శంకర్ అనే కొడుకు వున్నాడు. తల్లిదండ్రుల కి ఒక్కడే కొడుకు కావడం తో శంకర్ ని అతిగారాభంగా పెంచడంతో పాటు మంచి బుద్దులు కూడా నేర్పించారు.


పరోపకారార్థమే మనకి భగవంతుడు ఈ శరీరాన్ని యిచ్చాడని, వీలున్నంతవరకు అవసరమైన వారికి ఉపకారం చేయాలని చెప్పడం తో, శంకర్ తన తోటి స్నేహితులకు అవసరం పడినప్పుడు డబ్బు సహాయం చేయడం, ప్రతీ సెలవు రోజు దగ్గరలో వున్నా అనాధాశ్రమం లో పండ్లు, పాలు పంచిపెట్టడం చేసేవాడు.


కొడుకు చేస్తున్న మంచి పనులకు అతని తల్లిదండ్రులు మురిసిపోతూవుండేవారు.

కొన్నాళ్ళు కి శంకర్ కి పెళ్లి జరిగింది. పెళ్ళైన నుంచి అతని భార్య సెలవు రోజులలో బయటకి వెళ్లనివ్వకుండా అడ్డం పడేది.


భార్య ని బాధ పెట్టడం యిష్టం లేక, సహాయ కార్యక్రమాలు ఆపి, యింటి పట్టునే వుండేవాడు. భార్య కి ఎన్నో విధాల యితరులకు సహాయపడటం వలన కలిగే ఆనందం గురించి చెప్పి చూసాడు. అయితే, ఆమె పిసినారి కావడం వలన, డబ్బంతా సహాయాలంటూ ఖర్చు చేస్తే మనం రోడ్డున పడాలిసివస్తుంది అని గొడవ పెట్టేది.


ఒక రోజున యింట్లో ఎవరూలేని సమయంలో ఆమెకి విపరీతంగా కడుపునొప్పి వచ్చి, ఏడుస్తూ పక్క యింటి వారి సహాయం తీసుకుని, హాస్పిటల్ లో చేరింది. డాక్టర్ గారు ఆవిడని పరీక్షించి, ఆవిడ కడుపులో రక్తస్రావం అవుతోంది అని, వెంటనే ఆపరేషన్ చేయాలని అన్నారు.


సమయానికి భర్త కూడా లేకపోవడం వలన కంగారు పడుతున్న ఆమెతో, “మీరు బయపడకండి, మేము చూసుకుంటాము, ముందు ఆపరేషన్ చేయించుకుని ఈ ప్రమాదం నుండి బయట పడండి” అని ఆమెకి సహాయంగా వచ్చిన పక్కింటి వారే, ఆపరేషన్ కి అయ్యే డబ్బు కట్టడమే కాక, రక్తం కూడా యిచ్చి, ఆపరేషన్ చేయించారు.


కళ్ళు తెరిచి చూసేసరికి, ఆమె భర్త, మామగారు కనిపించారు. మెల్లిగా, “వాళ్ళు ఏరి? వాళ్ళు సహాయం చేయకపోతే నేను బ్రతికి వుండే దానిని కాదు” అంటూ, భర్త చెయ్యి పట్టుకుని "మీరే రైట్, సహాయం చేయడం వలన ప్రాణాలు కూడా కాపాడగలమని తెలిసింది "అంది.


“యిప్పుడు అవన్నీ ఎందుకు? కళ్ళుమూసుకొని పడుకో” అని చెప్పి, బయటికి వచ్చి పక్కింటి ఆయన చేతులు పట్టుకుని "సమయానికి మీరు సహాయపడి మా ఆవిడని కాపాడారు. మీ ఋణం తీర్చలేనిది " అన్నాడు.


"భలే వాడివి అయ్యా, సహాయపడటం నీ నుంచి నేర్చుకున్నాను, దానిలోని సంతృప్తి యిప్పుడే అర్ధం అయ్యింది " అని అన్నాడు.


“చూసావా, మనం ఇతరులకి సహాయపడితే, మనకి అవసరం అయినప్పుడు, భగవంతుడు ఎవరినైనా పంపుతాడు మనకి సహాయపడటానికి” అని మనవడితో అని కధ ముగించాడు సుబ్బారావు.


"మా తాత మాట, బంగారు బాట " అంటూ పరిగెత్తాడు మనవడు.


.... శుభం......

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.











170 views1 comment

1 Comment


@drraosvummethala1230 • 10 hours ago

చక్కని కథ...

Like
bottom of page