top of page

పసి పూలమొక్కలు పంచే ప్రియ సందేశం!

#పసిపూలమొక్కలుపంచేప్రియసందేశం, #GorrepatiSreenu, #గొర్రెపాటిశ్రీను, #TeluguKavithalu, #TeluguPoems

ree

Pasi Pula Mokkalu Panche Priya Sandesam - New Telugu Poem Written By - Gorrepati Sreenu

Published In manatelugukathalu.com On 18/09/2025

పసి పూలమొక్కలు పంచే ప్రియ సందేశం - తెలుగు కవిత

రచన: గొర్రెపాటి శ్రీను


పుడమితల్లి పురుటి నొప్పులు పడుతున్నప్పుడు


ఇష్టంగా, కష్టపడుతూ తలెత్తుకుంటూ


జన్మిస్తుంటాయి గడ్డి మొక్కలు!


గట్టిగా, ఠీవీగా నిలబడే ప్రయత్నం చేస్తుంటాయి!


వీస్తున్న ఈదురు గాలులు


కురుస్తున్న వర్షం చినుకులు


తమను అతలాకుతలం చేయాలని చూస్తున్నా


బ్రతకాలనే ఆరాటాన్ని అణువణువునా నింపుకుంటూ


ప్రతిఘటిస్తూ నిటారుగా ఉంటాయి !


అందమైన పుష్పాలకు  జన్మనిస్తూ


తల్లిగా తమని తామే చూసుకుంటూ మురిసిపోతుంటాయి!


సంబరానికి మారుపేరై..


అవనిపై మెరిసే ఇంద్రధనస్సు లా రంగుల కలల్ని ప్రతిబింబిస్తుంటాయి!


తామున్న చోటంతా సుపరిమళాల మయమయ్యేలా చేస్తుంటాయి!


నయన సుమనోహర దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ


కన్నతల్లి భూమాత కంఠహారం లా శోభితమవుతూ 


వసంతాల వేడుకలను పరిచయం చేస్తుంటాయి !


"ఎదుటివారి జీవితాలను సంబరపరచడమే జీవిత పరమార్థం" 


అనే చిన్ని సందేశాన్ని లోకానికి చాటుతూ ..


తిరిగి నేల తల్లి ఒడిలో తలవాల్చుతాయి ..పసిడి పూలమొక్కలు !                       


***

గొర్రెపాటి శ్రీను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ree

రచయిత పరిచయం:

 గొర్రెపాటి శ్రీను కలం పేరుతో రచనలు చేస్తున్న నా పూర్తి పేరు నాగ మోహన్ కుమార్ శర్మ .

తల్లిదండ్రులు : శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు

ఉద్యోగం : ప్రైవేటు కంపెనీలో మేనేజర్.

చదువు : డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్)

వెలువరించిన పుస్తకాలు:

"వెన్నెల కిరణాలు" కవితా సంపుటి(2019),

"ప్రియ సమీరాలు"కథాసంపుటి(2023),

"ప్రణయ దృశ్య కావ్యం" కథాసంపుటి(2025).

ప్రస్తుత నివాసం: హైదరాబాద్.


Comments


bottom of page