top of page

పెళ్ళి నూరేళ్ళ పంట

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Pelli NurellaPanta, #పెళ్ళినూరేళ్ళపంట, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Pelli Nurella Panta - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 06/07/2025

పెళ్ళి నూరేళ్ళ పంటతెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


"ఈ రోజు సభకి ప్రఖ్యాత స్వామిజీ రావడం మనందరి అదృష్టం. మీ అందరికి పెళ్లి పై ఏమైనా సందేహాలు ఉంటే, స్వామిజీని అడగండి.. మీ ఫ్యూచర్ బాగుకోసమే ఈ సభ ఏర్పాటు చెయ్యడంలో ముఖ్య ఉద్దేశ్యం.. అందరూ చప్పట్ల తో వెల్కమ్ చెప్పండి.. " అంటూ మైక్ లో మాట్లాడాడు సభ పెద్ద 


"మంచి లైఫ్ పార్టనర్ అంటే ఎలా ఉంటారు స్వామి.. ?" అడిగాడు పెళ్ళికి సిద్ధంగా ఉన్న ఒక యువకుడు. 


"పూర్వం అయితే పెళ్ళికోసం ముఖ్యంగా.. మంచితనం, ఓర్పు, అణుకువ, గుణం, సంపాదన చూసేవారు.. పెళ్ళి నూరేళ్ళ పంట కదా! ఇప్పుడైతే.. మీ అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది.. " అన్నారు స్వామిజీ నవ్వుతూ.


"అదేంటి స్వామి.. ? మీ అదృష్టం అంటున్నారు.. అంటే టైం బాగోలేకపోతే అంతేనా.. ?"


"అంతే నాయన.. ! ఇప్పుడు ఎన్ని చూసినా, ఎలా పెళ్ళి చేసుకున్నా.. పెళ్ళైన కొంతకాలం వరకూ కొత్త జంట బాగానే ఉంటున్నారు.. తర్వాత అందరూ మారిపోతున్నారు. కూరలో ఉప్పు తక్కువనో, టీవీ రిమోట్ కోసమో, ఒకరి మాట ఒకరు వినట్లేదనో, చిన్న చిన్న వాటి కోసం కూడా విడాకుల కోసం కోర్ట్ చుట్టూ తిరుగుతున్నారు.. లాయర్స్ కి ఈ విడాకుల కేసులు వల్లే మంచి డిమాండ్. 

ఆ తర్వాత, నాన్న దగ్గరకు వెళ్లి 'మళ్ళీ పెళ్ళి' అంటూ చెవిలో పోరు పెడుతున్నారు. ఏం చేస్తారు పాపం.. ! లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ పెళ్ళి చేస్తున్నారు. ఆ మాట్రిమోనీ వాళ్ళకి కూడా కాసుల పంటే మరి.. ఒక్కొక్కరికి ఒకటి కన్నా ఎక్కువ సంబంధాలు చూడాలిగా మరి "


"అదేంటి అలా అంటున్నారు.. ? ఈ రోజుల్లో మరి చేస్తున్న వెరైటీ పెళ్ళిళ్ళు తప్పు అంటారా.. ? వాటివలనే ఇలా జంటలు విడిపోతున్నాయా.. ?"


అది ఒక వెర్రి.. ప్రీవెడ్డింగ్ షూట్.. ఇదేంటో నాకు అర్ధం కాదు.. పెళ్ళికి ముందు ఒకరిని ఒకరు ముట్టుకోవడం.. ఇంకా ఏవో చెండాల పనులుచెయ్యడం.. గెంతడం. మొన్న అదేదో.. చచ్చినట్టుగా షూట్ చేశారంట.. ఇవన్నీ చేస్తే, పెళ్ళికి అర్ధం ఏముంది.. ? పెళ్ళవకుండా చచ్చినట్టుగా చూసుకోవడమేమిటో.. ? అపశకునం కాకపోతే.. 


సంగీత్ అంట.. అదేంటో.. పెళ్ళి కాకముందే, ఇద్దరు ఒకరిని ఒకరు పట్టుకుని డాన్స్ ఏమిటో.. ? మా కాలంలో అయితే ఒకరిమొహం ఒకరు పెళ్ళిలోనే చూసుకునేవాళ్లమి.. అలా ఉంటే, ఇద్దరి మధ్య ప్రేమ కడదాకా ఉంటుంది. ఇప్పుడు పెళ్ళికి ముందే ముట్టుకోవడం, ఆ సెలబ్రేషన్ ఏమిటో.. ? ఏం సాధించారనో.. ? వెర్రి కాకపొతే?


"మొన్న నన్ను పెళ్ళికి పిలిచారు.. ప్రశాంతంగా పెళ్లి చూడకుండా అయిపోయింది.. తెలుసా?" అన్నారు స్వామీజీ.


"ఎందుకు స్వామీజీ.. ?"


"మండపంలో పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు ఎవరికీ కనిపించకుండా ఆ ఫొటోలు, వీడియోలు తెసేవారే మొత్తం కవర్ చేసేసారు. ఎంత సేపు వారి వీపులే కనిపించాయి. ఆ జంట మరీను, ఫోటోల కోసమే పెళ్ళి చేసుకుంటునట్టుగా ఉన్నారు. ప్రతి ఫోటోకి ఒక స్టిల్ ఇవ్వడం.. దానికి మళ్ళీ ఒక డాన్స్ చెయ్యడం. దానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా గెంతులెయ్యడం ఏమిటో.. ? పెళ్ళి ముహూర్తం కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు గానీ.. ఫొటోలు, వీడియోలు మాత్రం బాగా రావాలి.. ఫోటోలు కోసం, డాన్సుల కోసం ఆ పంతులని కూడా పక్కకు నెట్టేశారు అంతా. 


ఇలాగైతే పెళ్ళికి చదివిన మంత్రాలు ఫలిస్తాయా? ఆ దేవతలు కూడా వీరి చేష్టలకి తికమక పడుతున్నారు.. ఏమిటో ఇదని.. ! చివరకి అక్కడ పెట్టిన టీవీలో ఆ మొహాన నాలుగు అక్షింతలు వేసి ఇంటికి వచ్చేసాను. ఇంత ఆర్బాటం చేసిన ఆ జంట.. మొన్న విడాకుల కోసం కోర్ట్ లో కనిపించారు. పెళ్ళికి ఖర్చు పెట్టిన లక్షలు పోయినట్టే కదా..! ఎంత ఖర్చు పెట్టి పెళ్ళి చేసుకున్నామా అని కాకుండా.. ఎంత ఇష్టపడి చేసుకున్నామా అని చూసుకుంటే మంచిది. 


ఇంకో ముఖ్య విషయం సుమా!


ఈ రోజుల్లో అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి ఇష్టమా లేదా? అని ఒకటికి నాలుగు సార్లు కన్ఫర్మ చేసుకుని, పెళ్ళి చేసుకోండి. చివరికి తాళి కట్టేముందు కూడా మళ్ళీ ఒకసారి నవ్వుతో ఓకే చేసుకుంటే బెటర్. 'కట్టాలా.. ? డెసిషన్ ఏమైనా మారిందా? నన్ను పెళ్ళిచేసుకుని చంపవు కదా' అని, కన్ఫర్మ చేసుకుని పెళ్ళి చేసుకోండి.. రోజులు అసలే బాగోలేవు. తాళి కట్టేది సంసారం చేస్తూ, హ్యాపీగా ఉండడం కోసం గానీ.. అది పార్టనర్ కి చంపడానికి ఇచ్చే హక్కు కాకూడదు. ఒకసారి ఒక జంట పెళ్ళిచేసుకుంటే, ఇద్దరిమధ్య జీవితకాలం బంధం ఏర్పడినట్టే. అందుకే అన్నారు పెళ్ళి నూరేళ్ళ పంట అని. 


నాకు వేరే సభకు టైం అవుతోంది. ఇదిగో ఫైనల్ టచ్. వెర్రి, పిచ్చి ఆలోచనలు కాస్త పక్కన పెట్టి.. పెళ్ళి సంప్రదాయ పద్దతిలో చేసుకుని, పెద్దల మాటలు వింటూ, సర్దుకుపోతూ, పెళ్ళి చేసుకునేది ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండడం కోసమని తెలుసుకుంటే, ఆ జంటలు కలకాలం హ్యాపీగా ఉంటారు.. ఇవి నా అనుభవంతో చెబుతున్న మాటలు. 


"అలాగే స్వామీజీ.. " అని అందరూ లేచి గట్టిగా చప్పట్లు కొట్టారు 


*******


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


Comments


bottom of page