top of page
Original.png

అనురాగ బంధం - పార్ట్ 2

Feb 19
4 min read

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #AnuragaBandham, #అనురాగబంధం, #TeluguStories, #తెలుగుకథలు

పెద్దకథ

Anuraga Bandham - Part 2/2 - New Telugu Story Written By - Yasoda Gottiparthi Published In manatelugukathalu.com On 19/02/2026

అనురాగ బంధం -పార్ట్ 2/2 - తెలుగు కథ

రచన: యశోద గొట్టిపర్తి

జరిగిన కథ: అన్న కోసం తన వాటా భూములు అమ్మి ఆ డబ్బులు అన్నయ్యకు ఇస్తాడు రాజేంద్ర ప్రసాద్.



ఇక అనురాగ బంధం -పార్ట్ 2 చదవండి.


వయసు మీద పడడం, ఇంటి పరిస్థితులు తారుమారు కావడంతో, మానసికంగా కృంగిపోయి మంచాన పడిన గోపాల కిషన్ ఒకరోజు కొడుకును పిలుచుకుని,


"నాన్నా రాజూ.... ఇంట్లో ఎంత మంది ఉన్నా, అందరి కంటే నువ్వు చిన్నవాడివి అయినప్పటికీ... బుద్ధిలో బృహస్పతివి. మనసులో దానకర్ణుడివి. ఏ స్వార్థపు మకిలీ అంటని మాణిక్యానివి!


కానీ, లోకం తీరు వేరు నాన్నా. ఇంటా బయటా అందరి సమస్యల్లో నేనున్నానంటూ ముందుకొచ్చే నీ గుణం కారణంగా, నువ్వు ఏదో ఒకనాడు తీరని ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటావేమోనని నా భయం రా నాన్నా. ఆనాడు, నీకు సాయంగా.. నువ్వు తప్ప ఎవరూ మిగలరేమో!


అలాంటపుడు నా చేతికర్రే నీకు ఊతం ఇస్తుంది. నా మరణానంతరం... నీ తోబుట్టువులు ఎవరెవరు ఏమేమి పంచుకున్నా, నా చేతికర్రను మాత్రం నువ్వు చేజిక్కించుకో. జాగ్రత్త తండ్రీ..."


తనకెంతో ఇష్టమైన నాన్న... మరణశయ్యపై ఉండి, తన చేతిలో పెట్టిన కాగితాన్ని చదివిన రాజేంద్రప్రసాద్ కళ్ళు తుడుచుకుంటూ చేతికర్ర వైపు పరికించి చూసాడు!


కొన్ని గంటల్లో తండ్రి దూరమవడంతో అన్న, అక్క చెల్లెళ్లు, బంధువులు వచ్చిన వాళ్లంతా, చని పోయిన తర్వాత చేసే తతంగం అంతా ముగించి వెళ్లిపోయారు.


***********


భర్త చెప్పిన మాటలు విన్న భార్య వినీల "మీరు బిజినెస్ వ్యవహారాల్లో నిలదొక్కుకో గలుగుతారా అండీ! అడుగడుగునా మోసాలు, అవినీతి అన్ని చోట్ల తాండవిస్తుందండి."


"వినీలా! అలా భయపడుతూ కూర్చుంటే ఎలా?"


"అందరిని నమ్మే రోజులు పోయాయి. ఇంటి నుండే మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము కదండీ.."


"ఎంతటి కష్టాన్ని అయినా ఇష్టంగా చేసాము.. అన్నీ కూడా ఇక ముందు ముందు అంతే వినీల" అని నచ్చ చెప్పాడు.


***********


మాధవన్ "నువ్వు చేస్తున్న రియల్ ఎస్టేట్ భూముల పత్రాలు పరిశీలించగా అవి పట్టేదారుల పత్రాలు.. సింగిరెడ్డి గారి అన్నదమ్ముల పేరు మీద ఉన్నాయి. అవి వాళ్ళు పంచుకుని, ఎవరి పేరు మీద వాళ్ళు చేసుకున్నారట.... కానీ సింగి రెడ్డి తండ్రి కాలం నాటి పేపర్స్ చూపించి, తన పేరు మీద వ్రాయించుకున్నట్టు చూపించాడు. ఇప్పుడు ఆ పత్రాలు కోర్టు కేసులో ఉన్నాయి. ఆ అన్నదమ్ములు కలిసి పని ఆపేయమని కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు. మీరు చేస్తున్న కాంట్రాక్ట్ పనులు ఆపేసేయాలి" అని కొరియర్ రాగానే..


వెంటనే ఈ విషయాన్ని రాజేంద్రప్రసాద్ కు తెలియ చేయాలి అంటూ ఫోన్లో మాట్లాడి, జరిగిన విషయం అంతా తెలియజేశాడు.


"ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ వర్క్ ఆపేయాలా సార్?" అంటూ ఆందోళనతో అనగానే..


"అవును రాజేంద్రప్రసాద్, వర్క్ సైట్ అంత పని లేకుండా ఖాళీ చేయించాలి."


ఆ మాటలు విన్న రాజేంద్ర ప్రసాద్ వర్క్ ఆపేస్తున్నట్టు ఆఫీస్ లో నోటీస్ లు అంటించాడు.


అది తెలిసిన కస్టమర్స్ అందరూ ఆందోళన చెంది, తమకు అన్యాయం జరిగిందని గొడవలకు దిగారు.


ఇంట, బయట వాళ్లకు తన వల్ల మేలు జరిగింది.. కానీ ఎప్పుడు ఇలా జరగలేదు.


లోన్స్ తీసుకొని కొనుగోలు చేసుకునే వాళ్లను ఎలా సముదాయించాలి.. అని ఆలోచిస్తూ రోడ్డు క్రాస్ చేస్తూ ఎదురుగా వస్తున్న లారీని చూసుకోకుండా క్రాస్ చేశాడు.


తాను టూ వీలర్ పై ఉన్నవాడు పక్కకు పడడం, కళ్ళు మూసి తెరిచేలోగా హాస్పిటల్ లో ఉండడం క్షణాల మీద జరిగాయి.


మాధవన్, అతని అనుచరులు అందరు విషయం తెలుసుకుని డాక్టర్ ను కలిసి విషయం అంతా తెలుసుకున్నారు.


"సార్! రాజేంద్రప్రసాద్ గారిని ఏ దేవుడు కరుణించాడో?.. కానీ మేజర్ ఆక్సిడెంట్ వంటిదే... కానీ జరిగిన నష్టం మాత్రం చాలా చిన్నది.


ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి".


"కాలుకి చిన్న ఫ్రాక్చర్ జరిగింది. వెళ్లి చూడండి..


ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఎండలో ఉన్న వాళ్ళకు కూడా నీడగా నిలిచారు ఆయన.


నేడు ఆయన మంచితనమే ఆయన్ని కాపాడింది.


ఈ రోజు డిశ్చార్జ్ చేస్తాము అతనిని, మీరు ఇంటికి తీసుకెళ్లవచ్చు" అనగానే, ఇంటికి తీసుకెళ్లారు..


**************


కొద్ది రోజుల్లోనే రాజేంద్ర ప్రసాద్ కోలుకున్నాడు అని తెలవగానే అందరూ సంతోష పడ్డారు.


"నలభై రోజుల వరకు కాలు కట్టు ఉంటుంది, తర్వాత డాక్టర్ సలహాతో విప్పి మెల్లగా నడవ వచ్చు. అప్పటి వరకు కాలు కదిలించవద్దు" అని చెప్పారు.


రాజేంద్రప్రసాద్ కోలుకోగానే తండ్రి మరణానంతరం మిగిలిన ఆస్తిపాస్తులను, ఇంటిని, వస్తువులను పంచుకోవడానికి అక్కచెల్లెళ్లు, అన్న పిల్లలు అందరూ హాల్లో కొలువు తీరి కూర్చున్నారు.


గుర్తుకు వచ్చిన విలువ గల వస్తువుల పంపకాలన్నీ జరిగాయి.


ఎప్పుడూ ఎవరినీ తన గదిలోకి అడుగుపెట్టనివ్వలేదు నాన్న.


ఈనాడు అందరూ ధైర్యంగా ఆ గదిలోకి అడుగుపెట్టి వింతగా చూస్తున్నారందరూ..


ఒక వైపు మూలన పెద్ద బీరువా, దాని వెనుకనే కన్పించకుండా చిన్న గొడ్డలి ఉన్నట్టు ఇంత వరకూ ఎవరికి తెలియదు.


అది చూసిన తల్లి, "మీ నాన్న పైకి ధైర్యంగా ఉన్నా, లోపల భయంతో ఆస్తి పాస్తులు ఉన్నాయని, డబ్బులు ఉంటాయని, తన మీద ఎవరైనా దాడి చేస్తారని ముందు జాగ్రత్తగా, ఎవరికి కనపడకుండా ఈ ఆయుధం పెట్టుకున్నారు."


"అవునా! ఇన్నాళ్లు ఎవరికి చెప్పలేదు అమ్మా! నీవు కూడా" అంటూ ఆశ్చర్యపోయారు అందరూ..


మంచం ప్రక్కన నల్లగా మెరుస్తున్న నాన్న చేతి కర్ర నాకే కావాలి... అని పెద్ద కొడుకు నారాయణ తీసుకోబోతుండగా...


వెంటనే తల్లి వచ్చి, "ఇన్నాళ్లు దీని అవసరం ఎవరికీ రాలేదు. దీని అవసరం ఇప్పుడు రాజేంద్రప్రసాద్ కు ఉందిరా! వాడు కాలు నొప్పితో బాధపడుతున్నాడు. వాడే ఉపయోగించుకుంటాడు. మీ బాధ్యతలు అన్నీ మీ తండ్రి నెరవేర్చాడు. రాజాకు ఆ అవకాశం లేకుండా తండ్రి దూరమయ్యాడు.


చిన్నవాడు వాడే తండ్రి ఆశయాలను నెరవేర్చాలంటూ, చేస్తున్న ప్రయత్నం లో ఇలా జరిగింది.


తండ్రి గుర్తుగా వాడికే దక్కాలి." అంటూ ఆ చేతి కర్రను రాజుకిచ్చి పట్టుకొని నడవమని చెప్పింది.


తల్లి మాట కాదనలేక అందరూ సరేనన్నారు.


వచ్చిన వాళ్ళందరూ వెళ్లిపోయాక, ఎంతో ప్రేమతో ఆ చేతికర్రను తనివి తీరా చూసుకొని మురిసి పోతున్నాడు రాజు.


రియల్ ఎస్టేట్ పని కోర్టులో క్లియర్ అవడంతో బిజీగా ఇంకా ఆ కర్రను ఎక్కువగా వాడుకున్నాడు.


కొన్నాళ్లకు పైన జాయింట్ భాగము స్క్రూలు వదలడంతో సరిచేయడానికి విప్పాడు.


అందులో లోపల నుండి ఒక పేపర్ కనపడింది. సపోర్ట్ కోసం పెట్టారేమో? అని సరిచేయబోయాడు.


పేపర్ పైన తండ్రి సంతకం కనబడడంతో ఆసక్తితో తీసి చదవసాగాడు. తండ్రి తన పేరు మీద వ్రాసిన ఆస్తి పత్రాలుగా గుర్తించి, వివరాలు పూర్తిగా తెలుసుకుని వాటిని పదిలంగా దాచుకున్నాడు.


మరణ శయ్యపై తండ్రి తన చేతికి ఇచ్చిన ఉత్తరం చదువుకుని కళ్ళ నీళ్ల పర్యంతం అయ్యాడు.


===============================================

సమాప్తం 

===============================================

యశోద గొట్టిపర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

యశోద గొట్టిపర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి

హాబిస్: కథలు చదవడం ,రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page