top of page
Original.png

అనుబంధం

భార్యాభర్తల అనుబంధం, తెలుగు కుటుంబ కథ, భావోద్వేగ తెలుగు కథ, దాంపత్య బంధం, కుటుంబ విలువలు, భార్యాభర్తల ప్రేమ, తెలుగు కథలు, కుటుంబ సంబంధాలు, Telugu Family Story, Husband Wife Relationship

అప్యాయంగా చూసుకుంటున్న వృద్ధ తెలుగు భర్తను చూసి ఆనందభాష్పాలతో నిలబడి ఉన్న కుమార్తె. జీవితాంతం నిలిచే భార్యాభర్తల అనుబంధం, ప్రేమ, సేవాభావం, కుటుంబ విలువలను ప్రతిబింబించే భావోద్వేగ తెలుగు కుటుంబ దృశ్యం.
అప్యాయంగా చూసుకుంటున్న వృద్ధ తెలుగు భర్తను చూసి ఆనందభాష్పాలతో నిలబడి ఉన్న కుమార్తె. జీవితాంతం నిలిచే భార్యాభర్తల అనుబంధం, ప్రేమ, సేవాభావం, కుటుంబ విలువలను ప్రతిబింబించే భావోద్వేగ తెలుగు కుటుంబ దృశ్యం.

Anubandham - Telugu Emotional Family StoryAddanki Lakshmi

అనుబంధం - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | అద్దంకి లక్ష్మి

Published In manatelugukathalu.com On 05/07/2026

 

భార్యాభర్తల బంధం అనేది మాటల్లో చెప్పలేని అనుబంధం. రోజువారీ జీవితంలో కనిపించని ప్రేమ, అవసరమైన సమయంలో సేవగా, అండగా, ధైర్యంగా మారుతుంది. "అనుబంధం" కథలో తల్లి అనారోగ్య సమయంలో తండ్రి చూపిన అపూర్వమైన ప్రేమను చూసి, ఆయన గురించి తాను వేసుకున్న అభిప్రాయాలు ఎంత తప్పో కూతురు గ్రహిస్తుంది. నిజమైన దాంపత్య ప్రేమ, సేవాభావం, కుటుంబ బాధ్యతలు, పరస్పర అంకితభావాన్ని హృదయాన్ని తాకేలా ఆవిష్కరించిన అందమైన తెలుగు కుటుంబ కథ ఇది.


"నాన్నగారు, మీరు వెళ్లి పడుకోండి. రాత్రి 12 గంటలు అవుతోంది. నేను చూసుకుంటాను అమ్మని,"

కరుణ, కుర్చీలో కళ్లు మూతలు పడుతున్న తండ్రిని చూసి అంది.


"లేదమ్మా, నువ్వు వెళ్లి పడుకో! నేను చూసుకుంటాలే అమ్మని!" అన్నాడు రాఘవయ్య.


"లేదు నాన్నగారు, మీరు వెళ్లి పడుకోండి! ఒక గంట సేపు! తర్వాత మళ్ళీ వద్దురు గానీ," అంటూ తండ్రి చేయి పట్టుకుని బలవంతంగా బెడ్‌రూమ్‌లోకి తీసుకుపోయింది కరుణ.


తల్లికి ఈ మధ్య ఆపరేషన్ అయింది. భర్తను, పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి తల్లిని చూసుకోవడానికి వచ్చింది కరుణ.


ఆపరేషన్ బానే జరిగింది. తల్లి ఇంకా మెల్లిగా కోలుకోవాలి, కొద్దిగా టైమ్ పడుతుంది.

కుర్చీలో కూర్చుని అమ్మని పరిశీలించింది.


ఎంత కష్టపడింది జీవితమంతా అమ్మ! ఎంత నెమ్మది, ఎంత సౌమ్యం! ఒక్క మాట కూడా బదులు చెప్పదు.

ఉదయం 5 గంటలకు లేస్తే రాత్రి 11:00 వరకు పనే సరిపోతుంది.


పల్లెటూర్లో పెద్ద ఇల్లు, దాన్ని తుడుచుకుని శుభ్రంగా పెట్టుకోవడానికి దినమంతా సరిపోతుంది.

తాను చెప్పింది తండ్రికి - పట్టణంలో ఉండండి, పల్లెలో సుఖముండదని. తండ్రి వినిపించుకోక ఈ పల్లెకు వచ్చేసాడు.


ఎప్పుడో వాళ్ళ నాన్న కట్టించిన ఇల్లు అంటే ప్రేమ ఆయనకి.

పట్నం వెళ్లి తల్లికి హార్ట్ ఆపరేషన్ చేయించుకు వచ్చారు.

తండ్రి చాలా కోపిష్టి.

ఇంట్లో అందర్నీ గడగడలాడించేస్తాడు, టైమ్‌కి అన్నీ సక్రమంగా జరగాలి.


కూర్చున్నచోట నుంచి లేవడు. అన్నీ చేతికి అందించాలి.


అమ్మ కూడా పెద్దది అయింది, అయినా ఆయనకి ఏమీ పట్టవు. ఆవిడకి ఒంట్లో సరిగా ఉండదు, కాళ్ల నొప్పులు.

ఇవన్నీ ఆయనకేమీ పట్టదు. ఆయనకు టిఫిను, తిండి టైమ్ టైమ్‌కు జరిగిపోవాలి.

"మంగా, నా కళ్ళజోడు ఎక్కడుంది? మంగా, నా చొక్కా తీసుకురా?"


తెచ్చేంతలోనే ఆయనకు కోపం వస్తుంది.

"అడిగిన వెంటనే ఇవ్వవు? ఏం చేస్తున్నావు? ముందు నా పని చూడకుండా?"

ఇలా అరుస్తాడు ఆయన.


తను ఒక్కొక్కసారి చెప్తుంది, "నాన్నగారు, అమ్మ కూడా పెద్ద అయింది కదా, ఆమెను అట్లా కంగారు పెట్టకండి."


అయినా ఆయన వినిపించుకోడు. తన పనులన్నీ సక్రమంగా వెంటవెంటనే జరగాలి.


ఒక్కొక్కసారి అనిపిస్తుంది - ఈ పాత జనరేషన్‌లో ఈ మగవాళ్ళకి అసలు ఆడవాళ్లంటే ప్రేమ, అభిమానమే లేదు. ఇలా గొడ్డు చాకిరీ చేసుకుంటూ ఆడవాళ్లు పనిమనిషిలా ఉండవలసిందే అనుకుంటుంది. కరుణ మనసులో బాధపడుతుంది.


అన్నయ్యలు ఇద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. అప్పుడప్పుడు చూసి పోతుంటారు.

తాను ఢిల్లీ నుంచి వచ్చి రెండు మూడు నెలలకు ఒకసారి తల్లిదండ్రుల బాధ్యతగా చూసి వెళుతుంది.

అమ్మంటే తనకు ఎంతో ప్రేమ, అభిమానం. ఏనాడు భర్త ప్రేమగా చూసింది లేదు ఆమెను.


ఏదో ఒక యంత్రంలాగా చాకిరీ చేయించుకుంటాడు.

అమ్మకు ఇంత రోగం వచ్చింది. కోలుకోవడానికి టైమ్ పడుతుంది, నాన్న అమ్మని ఎట్లా చూస్తాడు?


ఆయనకు బొత్తిగా భార్య అంటే ప్రేమ, జాలి లేదు కదా.

తాను కూడా పూర్తిగా పిల్లల్ని, భర్తని వదిలిపెట్టి అమ్మకు సేవ చేస్తూ ఉండలేదు కదా.


తాను వెళ్ళిపోతే ఎలాగా అని ఆమెకు మనసులో చింత పట్టుకుంది.


తండ్రికి ఒక్క పని చేయడం రాదు. అసలు భార్య మీద ఎప్పుడూ ప్రేమే చూపలేదు.

ఇలా మనసంతా ఆలోచనలతో నిండిపోతుంది.

కరుణకు నిద్ర పట్టింది. లేచేసరికి ఉదయం ఆరు గంటలు అయిపోయింది.


లేచేసరికి తండ్రి కాఫీ పెట్టాడు. తల్లిని బాత్రూంలోకి తీసుకెళ్లి ఆమె మొహం కడిగించి, కడుక్కున్న తర్వాత కుర్చీలో కూర్చోబెట్టి కాఫీ ఇస్తున్నాడు.


"మంగా, ఎలా ఉంది ఇప్పుడు? నీకేం భయం లేదు, తొందరగా తగ్గుతుంది. నేనున్నాను కదా నీకు సేవ చేయడానికి! నీవు నేను ఒకటే మంగా. నాలో సగం నీవు, నీలో సగం నేను. మనిద్దరం వేరు వేరు కాదు మంగా. నీవు నేను ఒక్కటే. 

శివుడిని అర్ధనారీశ్వరుడు అంటారు, భార్యాభర్తలిద్దరూ ఒక్కటే, వేరువేరు కాదు. నీ కష్టము నాది కాదా? నీకు నేను ఉన్నాను. తొందరగా నీకు నయమవుతుంది, భయపడకు. అమ్మాయి కూడా నీకు సేవ చేస్తోంది కదా. నా కష్టాలన్నీ నువ్వు మోసావు, ఇప్పుడు నీకు వచ్చిన కష్టం నాది కాదా!" అంటూ భార్యకు ధైర్యం చెప్తున్నాడు.


నిజంగా ఈ దృశ్యం కరుణ ఊహించలేనిది.

తండ్రి తల్లికి ఇంత సేవ చేయడం, "నీవు నేను ఒకటే" అని చెప్పడం వింటూ చూసి ఆశ్చర్యపోతున్నది.

అంతలోనే కొంచెం తేరుకొని...

"నాన్నగారు, నన్ను లేపకపోయినారా? నేను కాఫీ పెట్టేదాన్ని కదా!"


"లేదమ్మా, నువ్వు కూడా హాస్పిటల్‌లో ఈ వారం రోజులుగా కష్టపడ్డావు కదా," అన్నాడు తండ్రి.


కరుణ వంట గదిలోకి వెళ్లి వంట పనులు చూస్తోంది.

తండ్రి పూర్తిగా తల్లి దగ్గరగా కూర్చున్నాడు. టైమ్ టైమ్‌కి ఆమెకు మందులు వేసి ఆమెను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు.


"నాన్నగారు, మీరు వెళ్లి చదువుకోండి. అమ్మని నేను చూసుకుంటాను కదా!" అంది కరుణ.


"లేదమ్మా నేను చూసుకుంటాను. మీ అమ్మ జీవితమంతా నాకు ఎంతో సేవ చేసింది.

కనీసం ఇప్పుడైనా ఆమెకు కొంత సేవ చేసి ఆమె రుణం తీర్చుకుంటాను," అన్నాడు తండ్రి మనసులో ఆవేదన పడుతూ.


కరుణ ఒక్కసారి ఆశ్చర్యపోయింది. తండ్రి చాలా కఠినాత్ముడు, తల్లిని సరిగా చూడడు అని అనుకుందామె. ఆయన మనసులో తల్లి మీద ఇంత ప్రేమాభిమానాలు ఉన్నట్లుగా ఊహించలేదు.


ఒక స్త్రీకి కావలసినది అదే కదా! తాను కష్టములో ఉన్నప్పుడు తన భర్త అర్థము చేసుకొని తగిన సహాయము చేయాలి.


తాను తండ్రిని ఎంతో తప్పుగా అంచనా వేసింది. ఆయనకి భార్య పట్ల చాలా ప్రేమ. ఆమెకు ఆపరేషన్ అయిన దగ్గర్నుంచి తండ్రికి కంటిమీద కునుకు లేదు.


ఇక తనకు తల్లి గురించి బాధ లేదు. తాను వెళ్ళిపోయినా తండ్రి తల్లిని చక్కగా చూసుకుంటాడు.


భార్యాభర్తల అనుబంధం అంటే ఇదేనేమో!

అవసరమైనప్పుడు ప్రేమాభిమానాలు దొరికితే అంతకన్నా స్త్రీకి అదృష్టమేముంటుంది!


కరుణ మనసు ఇప్పుడు ప్రశాంతమైంది.


"నీవు వెళ్ళు తల్లి, అమ్మని నేను చూసుకుంటాను. నీవు అక్కడ నీ పిల్లలు, భర్త కష్టపడుతున్నారు," అన్నాడు తండ్రి..


ఇప్పుడు కరుణకు తల్లి గురించి చీకు చింత లేదు. తన తండ్రి తల్లిని పూర్తిగా చూసుకుంటాడు.


భార్యాభర్తల బంధం అంటే ఇదే కదా! భార్యాభర్తలు వేరు కాదు, కేవలం శరీరాలు వేరు, ఇద్దరూ ఒక్కటే, అనుకుంది కరుణ.


నిజమైన ప్రేమకు నిర్వచనం తెలిసింది ఆమెకు...

***

ఈ కథ మీ హృదయాన్ని తాకితే, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి కుటుంబ విలువలను ప్రతిబింబించే తెలుగు కథల కోసం manatelugukathalu.com ను తరచూ సందర్శించండి. ఈ కథను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకుని ప్రేమ, అనుబంధం, సేవాభావం విలువను మరింత మందికి చేరవేయండి.



అద్దంకి లక్ష్మి గారి కొన్ని ఇతర రచనలు:


అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page