top of page
Original.png

ఆ కిక్కే వేరబ్బా!

తెలుగు సైన్స్ ఫిక్షన్ కథ, AI కథ, కృత్రిమ మేధస్సు, ఆండ్రాయిడ్ జీవితం, భవిష్యత్ ప్రపంచం, యాంత్రిక జీవితం, తెలుగు కథ, టెక్నాలజీ కథ, Artificial Intelligence Telugu Story, Futuristic Telugu Story

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'ఆ కిక్కే వేరబ్బా' కథలో AI నియంత్రణలో పూర్తిగా యాంత్రికంగా మారిన భవిష్యత్ నగరంలో మెట్రో స్టేషన్ నుంచి కార్యాలయానికి అడుగడుగునా డిజిటల్ సూచనలతో ప్రయాణిస్తున్న యువతి. నేపథ్యంలో రోబోటిక్ కార్యాలయం, స్మార్ట్ నగరం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'ఆ కిక్కే వేరబ్బా' కథలో AI నియంత్రణలో పూర్తిగా యాంత్రికంగా మారిన భవిష్యత్ నగరంలో మెట్రో స్టేషన్ నుంచి కార్యాలయానికి అడుగడుగునా డిజిటల్ సూచనలతో ప్రయాణిస్తున్న యువతి. నేపథ్యంలో రోబోటిక్ కార్యాలయం, స్మార్ట్ నగరం.

Aa Kikke Verabba - Telugu Emotional Story | Karlapalem Hanumantha Rao

ఆ కిక్కే వేరబ్బా! - తెలుగు భావోద్వేగ కథ | కర్లపాలెం హనుమంతరావు

Published In manatelugukathalu.com On 05/07/2026


కృత్రిమ మేధస్సు (AI) మన జీవితాలను సులభతరం చేస్తున్న ఈ కాలంలో, ఒక రోజు అదే AI మన ప్రతి అడుగును నియంత్రించడం ప్రారంభిస్తే? నిర్ణయాలు, సమయం, భావోద్వేగాలు అన్నీ యంత్రాల చేతుల్లోకి వెళ్తే మనిషి జీవితం ఎలా మారుతుంది? "ఆ కిక్కే వేరబ్బా!" అనే ఈ ఆలోచింపజేసే తెలుగు సైన్స్ ఫిక్షన్ కథ భవిష్యత్తు సమాజాన్ని ఊహిస్తూ, యాంత్రిక జీవితంలో మానవత్వం, స్వేచ్ఛ, అనూహ్యత ఎంత విలువైనవో హృదయాన్ని తాకేలా చెబుతుంది.


ఫ్రంట్ డోర్ లాక్ చెయ్ 

ఫార్టీ టూ స్టెప్స్ 

లెఫ్ట్ టర్న్ 

త్రీ హండ్రెడ్ మీటర్లు నడు 

రైట్ సైడ్ తీసుకో 

రీచ్డ్ సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ 

ఓవర్ బ్రిడ్జి 

ఫిప్టీ ఫైవ్ స్టెప్స్ ఎక్కు 

ఫిప్టీ ఫైవ్ స్టెప్స్ దిగు 

రైట్ టర్న్ .. ట్వల్ స్టెప్స్ .. నడు 

ఫ్లాట్ ఫామ్ నెంబర్ సిక్స్ 

అరైవింగ్ .. లోకల్ ట్రైన్ 

స్టాప్.. కంపార్ట్ మెంట్ సెవెన్ 

డోర్ ఓపెన్డ్ .. లోపలికి వెళ్ళు .. క్విక్ 

 

'ఆమె' లోపలికి అడుగుపెట్టింది. సరిగ్గా రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ మురికి పసుపు రంగు ప్లాస్టిక్ సీటుపై కూర్చుంది.


తలుపులు మూతపడ్డాయి.. 

ఆమె మెదడులో మళ్లీ కౌంట్‌డౌన్ మొదలైంది. 

యాభై ఒకటి.. యాభై.. నలభై తొమ్మిది.. నలభై ఎనిమిది. 

ఆమె ముఖంలో ఎలాంటి భావాలూ లేవు. ట్రాక్‌పై చిన్న జంప్ వచ్చినా, డ్రైవర్ ఒక్క క్షణం బ్రేక్ వేయడం ఆలస్యం చేసినా ఈ కౌంట్‌డౌన్ తికమక అవుతుంది. 


కాని, గత ఆరేళ్లుగా అలా ఎప్పుడూ జరగలేదు. 


“సెవెన్.. సిక్స్.. ఫైవ్..  " గోలీకాయల్లాంటి కళ్లు తెరిచి ఆమె సీట్లోంచి లేచింది. 

"ఫోర్.. త్రీ.. "

రైలు వేగం తగ్గింది. "టూ.. ఒన్.." 

తలుపులు తెరుచుకున్నాయి.

అక్కడి నుంచి మూడు వందల డెబ్బై మీటర్ల నడక, 

మూడు వరుసల మెట్లు, 

సరిగ్గా తను జీబ్రా క్రాసింగ్‌పై అడుగు పెట్టేసరికే 

రెడ్‌గా మారే సిగ్నల్ దాటుకుని... 

ఆఫీస్ గ్లాస్ డోర్ వద్దకు చేరుకుంది.


సరిగ్గా పదిహేడు నిమిషాల ఇరవై రెండు సెకన్లు. 

ఇల్లు వదిలినప్పటి నుంచి ఆఫీస్ లోపలికి వచ్చేసరికి పట్టిన సమయం. పర్ ఫెక్ట్  టైమ్! అంతా ప్లాన్డ్ ప్రకారమే జరిగింది. 


ఆమె ('ఆ'మ్ డ్రాయిడ్–  'మె' షిన్స్)  ఈ ప్రపంచం పై పెత్తనం మొదలెపెట్టాక... మనుషుల జీవితాలు నిజంగానే ‌యాంత్రికంగా  మారిపోయాయి!


ఆఫీస్ రిసెప్షన్ డెస్క్ దగ్గర కూర్చుని ఉన్న మరో 'ఆమె', ఆమె వైపు చూసి .. 

"గుడ్ మార్నింగ్ ఆండ్రాయిడ్ నంబర్ 402. ఈరోజు కూడా మీ ప్రయాణ సమయం 100% పర్ఫెక్ట్‌గా ఉంది."

.

ఆమె తన ఐడెంటిటీ కార్డ్‌ని స్వైప్ చేస్తూ, నిట్టూర్చింది. —

ఒకప్పుడు మనుషులు బ్రతికిన ఈ మహానగరంలో ... ట్రాఫిక్ జామ్‌లు, పరుగు పందాలు, ఆలస్యాలు.. ఆఖరికి ఆఫీస్‌కి లేట్‌గా చేరినప్పుడు  బాస్ వేసే చిందులు.. ఆహా! ఆ రోజుల్లోని కిక్కే వేరబ్బా!"


ఈ కథ మీలో కొత్త ఆలోచనలకు నాంది పలికితే, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఆలోచింపజేసే తెలుగు కథలు చదవాలంటే ManaTeluguKathalu.com ను తరచూ సందర్శించండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ కథను తప్పకుండా పంచుకోండి.


***

సమాప్తం. 


కర్లపాలెం హనుమంతరావు గారి కొన్ని ఇతర రచనలు:



కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


కర్లపాలెం హనుమంతరావు
కర్లపాలెం హనుమంతరావు

రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

#KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #తెలుగునీతికథలు, #మురికి, #Muriki, Inspirational Telugu Stories, Life Lessons Telugu, Social Stories Telugu, Emotional Stories Telugu, Humanity Stories, Telugu Kathalu, Heart Touching Stories, Railway Story Telugu

 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page