top of page
Original.png

ప్రేమలేఖ


ప్రేమలేఖ తెలుగు కుటుంబ కథలో కుమార్తెకు ప్రేమతో లేఖ రాస్తున్న తల్లి

Premalekha - Telugu Family Story | Ch. C. S. Sarma 

ప్రేమలేఖ - తెలుగు కుటుంబ కథ | సిహెచ్. సీఎస్. శర్మ

Published In manatelugukathalu.com On 19/10/2026


ప్రేమలేఖ ఒక భావోద్వేగభరితమైన తెలుగు కుటుంబ కథ. తల్లి తన కుమార్తెకు రాసిన లేఖ ద్వారా కుటుంబ బంధాలు, అత్తవారింటి బాధ్యతలు, అపార్థాలు, జీవితంలో సరైన నిర్ణయాల ప్రాముఖ్యతను వివరిస్తుంది.


నీవు వ్రాసిన సుదీర్ఘమైన లేఖ నాకు చేరింది. ఒకటికి రెండుసార్లు నా ప్రియకుమారి వ్రాసినది కాబట్టి చదివాను. అత్తవారి ఇంటి పట్ల నెలరోజుల్లోనే నీకు ఎలాంటి అనుభవం, అభిప్రాయం ఏర్పడినదో నాకు పూర్తిగా అర్థమైంది.


నీవు లేఖ 'సెకండ్ హాఫ్' లో నీ అభిప్రాయాలను, నిర్ణయాన్ని విశదంగా వ్రాశావు. ఒక బాలికకు ఆడపిల్ల అనే పేరు ఎందుకు ఏర్పడిందో, అలా అందరూ ఎందుకు పిలుస్తారో నీకు ముందే చెప్పియున్నాను.


నీకు జ్ఞాపకం ఉందో, లేక మీ నాన్నగారిలాగా మరిచిపోయావో నా ఊహకు అందని విషయం.


మీ అత్తయ్య ఆదినారాయణి, మీ మామగారు కోదండరామయ్య, నీ భర్త శ్రీరామ్ మనకు పరాయివాళ్లు కాదు... మన బంధువులు.


కోదండరామయ్య నాకు స్వయానా అన్నయ్య. మా అన్నయ్యకు నాకు వయస్సులో వ్యత్యాసం ఆరు సంవత్సరాలు.


మా అమ్మ ఆదిశేషమ్మ, నాన్న బలరామయ్యలు చాలా గొప్పవారు. ఆ గ్రామంలో మా కుటుంబానికి ఎంతో గొప్ప పేరు. మాకు గొప్పపేరు అన్నది ఊరికే సంక్రమించలేదు.


నా తల్లిదండ్రులు, సాటివారు ఎవరైనా సరే, వారికి కష్టనష్టాలు కలిగినప్పుడు వారిని తమ సొంత బంధువులవలే భావించి, ఆదరించి, అభిమానించి, సహాయం చేసేవారు.


మా ఊర్లో బ్రాహ్మణులు, వైశ్యులు, యాదవులు, కమ్మవారు, ముస్లింలు తదితరులు ఉన్నారు. ఎవరి ఆచార వ్యవహారాలు వారివి. ఒకరినొకరు ఏనాడు, ఏ విషయాల్లోనూ విమర్శించుకోవడం, వాదోపవాదాలు, అభిప్రాయభేదాలు లేకుండా కలసికట్టుగా, ఒకటిగా కలసిమెలసి ఉండేవారు. అది అసలైన సంస్కృతి, మానవత్వం, మంచితనం.


మా తల్లిదండ్రులు నన్ను, మా అన్నయ్యను ఎంతో ఆదరాభిమానాలతో పెంచారు. నా వయస్సు పది సంవత్సరాలు, మా అన్నయ్య వయస్సు పదహారు సంవత్సరాలుగా ఉన్న సమయంలో ఒకే సంవత్సరంలో ఆరు నెలల వ్యత్యాసంలో ముందు మా నాయనమ్మ పార్వతి, తరువాత మా తాతయ్య శంకరయ్యగారు కీర్తిశేషులైనారు.


వారు మరణించిన సమయంలో మా అమ్మానాన్నలు, అన్నయ్యా, నేను ఏడ్వడం సహజం. కానీ మా తాతయ్య, నాయనమ్మల విషయంలో ఆ ఊరిలోని వారందరూ ఏడ్చారు. కారణం వారి మంచితనం, వారు గ్రామస్థుల పట్ల చూపించిన ఆదరాభిమానాలు.


మా అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మలు నాకూ, మా అన్నయ్యకు సభ్య సమాజంలో ఏ రీతిగా మసలుకోవాలన్నది, సాటివారు ఎవరైనా సరే వారి విషయంలో ఎలా వర్తించాలనే విషయాలను బాగా నేర్పారు.


నేనూ, మా అన్నయ్య ఏనాడు మా అమ్మానాన్నల మాటలను ధిక్కరించలేదు, కాదనలేదు. కారణం మన బాగోగులను గురించిన అక్కర, శ్రద్ధ... మనలను కన్న తల్లిదండ్రులకన్నా వేరే ఎవరికి ఉండబోదని మా నమ్మకం.


నా వివాహ విషయంలో కాలేజీలో నాకు పరిచయమై, స్నేహమైన మీ నాన్నగారిని గురించి నేను మా అన్నయ్యకు ముందు చెప్పాను. వాడికి నా మీద ఎంతో నమ్మకం... నేను తప్పుడు నిర్ణయాలను తీసుకోనని.


మా అన్నయ్య మీ నాన్నగారిని కలిశాడు. వారి కుటుంబ వివరాలను తెలుసుకున్నాడు. ఆనందంగా నా నిర్ణయాన్ని మా అమ్మానాన్నలకు చెప్పాడు, వారిని ఒప్పించాడు. నాకు మీ నాన్న గంగాధరంగారితో వివాహం జరిపించాడు. ఇంతవరకు మా రెండు కుటుంబాల మధ్యన ఏ విషయంలోనూ అభిప్రాయభేదాలు లేవు.


మా ఇంటి గుమాస్తా శేషయ్యగారి ఒక్కగానొక్క కూతురు మా వదిన, మీ అత్తయ్య ఆదినారాయణి. ఆమె తల్లి ఆమెకు ఐదు సంవత్సరాల ప్రాయంలో చనిపోయింది. మా అమ్మానాన్నలు ఆమెను మా ఇంట్లోనే ఉంచుకుని మాతోపాటే పెంచారు.


మా తాతయ్యగారికి శేషయ్య మామయ్య నమ్మినబంటు. నాకూ, మా వదినకు వయస్సు వ్యత్యాసం నాలుగు సంవత్సరాలు. మా అన్నయ్యకు, వదిన ఆదినారాయణికి వయస్సు వ్యత్యాసం పది సంవత్సరాలు.


మా తాతయ్య, వదిన వయస్సు పదహారుగా ఉన్నప్పుడు, నా పెళ్లి కంటే ముందు శేషయ్య మామయ్యతో మాట్లాడి మా అన్నయ్యకు, ఆదినారాయణి వదినకు వివాహం జరిపించారు.


మా వదిన బంగారం, మాట మహా సౌమ్యం, మితభాషి, దైవం పట్ల అపారమైన నమ్మకం, భక్తి.


నేను నా వివాహ విషయంలో విచారంగా, ఆందోళన పడుతున్న సమయంలో... “నీ వివాహం నీవు కోరుకున్న వారితో జరిగి తీరుతుంది. నేను మావారితో మాట్లాడి, వారిని ఒప్పించి నీ వివాహాన్ని ఘనంగా అందరి సమ్మతంతో జరిపిస్తాను” అంది మా వదిన.


తాను నాకు చెప్పినట్లే జరిగింది నా వివాహం.


మా వదినను, అన్నయ్యను గురించి నీవు ఆవేశంలో ఏవేవో వ్రాశావు. నీవు అలా వ్రాసేదానికి కారణం నీవు పక్కింటి పిడుగురాళ్ల పుల్లమ్మతో స్నేహం చేసినట్లుగా ఉన్నావు.


ఆ పుల్లమ్మకు, ఆమె భర్త నాంచయ్యకు ఒకరు ప్రశాంతంగా బ్రతకడం నచ్చదు. ఏవేవో చిలవలు పలవలుగా ఉన్నట్లు మాట్లాడి మన మనస్సును కల్మషం చేస్తారు. వాళ్లను గురించి నాకు బాగా తెలుసు. నీ విషయంలో నీవు మా అన్నావదినల విషయంలో వ్రాసిన వ్యాఖ్యానం మూలంగా నాకు విశదమైంది... నీవు పుల్లమ్మ మాయ మాటలను నమ్మావు.


ఇక నీ భర్త శ్రీరామ్, నా మేనల్లుడు... నిన్ను లెక్కచేయడం లేదు, గౌరవించడం లేదు అని వ్రాశావు. వాడు ఎలాంటివాడో నేను నీవు నాకు చెప్పి తెలుసుకోవలసిన దుస్థితిలో లేను. వాడు బంగారు తండ్రి. ముమ్మూర్తులా మా తాతయ్య.


పాతిక సంవత్సరాలుగా నేను వాడిని చూస్తున్నాను. నెల రోజులుగా నీవు వాడి సన్నిధిలో ఉన్నావు. పైగా నీ స్నేహితురాండ్రు రెండు మూడుసార్లు వచ్చారని విన్నాను.


ఈ కాలపు అమ్మాయిలు ఎలా వేషభాషలలో ఉన్నారో నాకు బాగా తెలుసు. వారు వారికి తోచిన సలహాలను నీకు ఇచ్చి ఉంటారు.


అంటే... 'అత్తామామలతో కలిసి ఉండటం ఏంది? వేరు కాపురం పెట్టు. నీవూ, నీ భర్త జాలీగా ఉండాలంటే... అది ఉత్తమ మార్గం'… ఆ నీ ఇష్ట సఖులు నీకు అలాంటి సలహాలను తప్పకుండా ఇచ్చి ఉంటారు. కాబట్టే నీవు వ్రాయగలిగావు.


చిన్నీ! నేను నిన్ను చాలా పద్ధతిగా పెంచాను. నీవు నీ అత్తవారింటికి వెళ్లే సమయంలో అక్కడి వ్యక్తులను గురించి, నీ భర్తను గురించి, నీవు ఆ ఇంట ఎలా నడుచుకోవాలన్న విషయాలను చాలా వివరంగా చెప్పాను. గుర్తున్నాయా... మరిచావా?


ఏది ఏమైనా... నీవు నా అన్నావదినలను, నా అల్లుడిని ఏ విషయంలోనూ తప్పు పట్టలేవు. మారిన నీ మనోతత్త్వాన్ని మార్చుకో.


నీవు ఆ ఇంటి కోడలివనీ, ఆ ఇంటి బాధ్యత అంతా నీదేనన్న విషయాన్ని తెలుసుకో.

ఎవరి చెప్పుడు మాటలూ వినకు.


మీ అత్తయ్యకు అన్ని విషయాల్లో సాయంగా వర్తించు.

మా వదిన నిన్ను ఉత్తమ ఇల్లాలుగా తీర్చిదిద్దుతుంది.


పైగా, నీవు ఆ ఇంటి సభ్యులతో వ్యవహరించే తీరుపైన ఉంటుంది.

మరోసారి చెబుతున్నాను... నీవు ఇకపై ఎప్పుడూ మా అన్నావదిన, అల్లుడిని గురించి ఎలాంటి అర్థరహితపు వ్రాతలు వ్రాయకు.


చిన్నీ... చివరి మాట, నీ ఆనందం ఉంది నీ చేతిలోనే! ఇది నీకు నా ప్రేమ లేఖ!

ఇట్లు,

మీ అమ్మ"



సమాప్తి



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page