top of page
Original.png

బంగారు తల్లి మనసు - బిడ్డ ఆసుపత్రి

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #BangaruThalliManasuBiddaAsupathri, #బంగారుతల్లిమనసుబిడ్డఆసుపత్రి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Bangaru Thalli Manasu - Bidda Asupathri - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 19/02/2026

బంగారు తల్లి మనసు - బిడ్డ ఆసుపత్రి - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1)


ఆ ఆసుపత్రి వారు తమ ఆసుపత్రికి "బంగారు తల్లి మనసు - బిడ్డ ఆసుపత్రి" అని పేరు నిశ్చయించారు, నిర్ధారించారు, పెట్టారు... ఒక మహిళ తన బిడ్డను ఎత్తుకొని రిబ్బన్ కటింగ్ చేసింది... కొత్త పేరుతో ప్రారంభోత్సవ వేడుక అనుకోవచ్చు.


అలాంటి పేరు ఎందుకు? ఆ తల్లి మనసు మనసులో లేదు... ఏవో ఆలోచనలతో గతంలోకి తొంగి చూసింది... స్మృతులు గతంలోకి వెళ్లాయి అనటం సబబు.


------------------ఫ్లాష్ బ్యాక్ - గతం ----------------------------


2)


ఓ రోజు, ఓ ఆసుపత్రిలో తీవ్ర విషాదం నెలకొన్నది."ఒక చిన్నారి (నెలల) పాప ప్రాణం పోయింది," అని అందరు డాక్టర్లు, నర్సులు నిశ్చయించారు, నిర్ధారించారు.


3)

ఎందుకో అమ్మ మనసు ఒప్పుకోలేదు.


"గంట క్రితం దాకా బాగానే ఉన్నాడు నా బిడ్డ... రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుండి (డిస్చార్జ్) విడుదల చేస్తాము అన్నారు... అంతలో బిడ్డ ప్రాణాలు ఎలా పోయాయి చెప్పండి! చెప్పి తీరాలి," పట్టుపట్టింది ఆ మహా తల్లి.


డాక్టర్ గారు ఇలా జవాబు ఇచ్చారు,

"పెన్సిలిన్ ఇంజక్షన్ ఇచ్చాము. అది రియాక్ట్ అయ్యి ఉంటుంది... బిడ్డ ఒళ్లంతా విషం పాకింది... ఎలా నీలం రంగులో మారిందో చూడండి."


తల్లి మనసు నిగ్గ తీసింది... కనకదుర్గలా లేచింది,

"పెన్సిలిన్ ఇంజక్షన్ మందు బిడ్డకు పడుతుందో లేదో ముందుగా తెలుసుకున్నారా? పరీక్షలు చేసి."


డాక్టర్ గారు బాధగా చూశారు ఆ తల్లి వైపు,

"ఆమాత్రం మా బృందానికి తెలీదా? అన్నీ చదువుకునే వచ్చాము ఈ డాక్టర్ స్థాయికి," అన్నారు కన్నీరు తుడుచుకుంటూ.


"అయితే పెన్సిలిన్ మందు బిడ్డకు సూట్ అవుతుంది, పడుతోంది అనే నివేదిక (రిపోర్ట్) చూపించండి," ఈ సారి తల్లి మనసు కట్టెలు తెంచుకున్న కోపంతో అడిగింది.


4)


డాక్టర్ గారి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది...


డాక్టర్ గారు కాస్త తడబడ్డారు, "అది, అదీ... దానికి నివేదిక తయారు చేయము... కేవలం పరీక్ష చేస్తాము... కొంచం మందు ఇచ్చి ఒక చోట... చర్మం పైన అన్నట్టుగా."


"నేను త్వరగా (అర్జెంట్) మీటింగ్‌కి వెళ్లాలి, తప్పుకోండి అందరూ... మేము (డాక్టర్లు) కూడా నిమిత్తమాత్రులము... అంతా ఆ భగవంతుడి లీల... బిడ్డ ఆయుష్షు తీరిపోయింది... అంతే... సో సారీ!"


ఈ సారి తల్లి మనసు రుద్రకాళి అవతారం ఎత్తింది...


"అంతా ఆ భగవంతుడి లీల అయితే మేమంతా మీ దగ్గరకు ఎందుకు రావాలి, అంత డబ్బులు పోసి? అదే మీ బిడ్డ అయితే ఇలాగే మాట్లాడుతారా?... పోనీ, విరుగుడు మందు ఇవ్వండి డాక్టర్... ఇప్పుడైనా!"


"ప్రాణం పోయిన దేహానికి విరుగుడు మందా? నా సహనాన్ని పరీక్షిస్తున్నారు... ఈ బిడ్డ అవయవాలు ఇతరులకు ఇచ్చి... ప్రాణదానం చేయండి... వారిలో మీ బిడ్డను చూసుకోండి,"

ఈసారి కఠినంగా, కోపంగా ఉన్నాయి డాక్టర్ మాటలు.


5)


ఈ సారి తల్లి మనసు గాయపడింది... "ఇప్పుడైనా విరుగుడు మందు ఇవ్వండి... లేకుంటే మిమ్మల్ని పోనీయను... కదలనివ్వను... ఖబర్దార్! ఒక నిర్మాణాత్మక టీచర్ గా చెబుతున్నాను," తల్లి మనసు డాక్టర్ కంటే కఠినంగా మాట్లాడుతుంది ఈసారి.


అయినా తన బిడ్డ కోసం నిస్వార్థ మనసుతో చేతులు జోడించి వేడుకుంది... "పెన్సిలిన్ విరుగుడు మందు ఇవ్వండి డాక్టర్... ఆ తరువాత మీ మీటింగ్‌కి వెళ్లిపోండి."


డాక్టర్ అహం ఒప్పుకోలేదు... "మీ టీచర్ పాఠాలు నా దగ్గర కాదు... పిల్లల దగ్గర!" అన్నారు విసురుగా.


6)


ఈసారి తల్లి మనసు తల్లడిల్లిపోయింది... వారి నిర్లక్ష్యానికి - రాక్షసత్వపు వైఖరికి... కానీ తను బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలి అనే పంతంతో నర్సు వైపు చూసింది చేతులు జోడించి... "ఒక ఆడదానివి... సాటి ఆడదాని బాధ, తల్లి మనసు తెలియదా? నువ్వైనా నా బిడ్డకు విరుగుడు మందు ఇవ్వమ్మా... నీ బిడ్డలు చల్లగా నిండు నూరేళ్లు బ్రతకాలని అన్ని దేవుళ్లను కోరుకుంటాను... నీ బిడ్డ పేరు పెట్టుకుంటాను నా బిడ్డకు..." అని వేడుకుంది.


ఈ సారి నర్స్ మనసు కరిగింది... వెంటనే విరుగుడు మందు ఇచ్చింది బిడ్డకు.


డాక్టర్ మీటింగ్‌కు వెళ్లిపోయారు విసుగ్గా ముఖం పెట్టి. సరిగ్గా అప్పుడు సమయం ఉదయం 9 గంటలు.


7)


సమయం ఉదయం 9.15... బిడ్డ రంగు మారింది... నీలం (విషం) రంగు కాస్త తగ్గింది. గోడ గడియారం టిక్ టిక్ మనే శబ్దం స్పష్టంగా వినిపిస్తున్నది అందరికీ... అంతా నిశ్శబ్ద ఛాయలు అలుముకున్నాయి ఆ ఆసుపత్రి ఆవరణలో.

-----

8)

సమయం ఉదయం 9.30... బిడ్డ చర్మం పైన రవ్వంత విషం, నీలం రంగు ఛాయలు లేవు... అదృశ్యమైపోయింది.

----

9)


కానీ బిడ్డలో కదలిక - చలనం లేదు... అక్కడున్న వారు అందరూ అన్ని దేవుళ్లను వేడుకున్నారు బిడ్డను బ్రతికించమని.


తల్లి కిటికీ తలుపు తీసింది గాలి ఆడాలని ఆ గదిలో... ఆ క్షణంలో ఒక లేగ దూడ అరుపు వినిపించింది బయట నుండి... "అంబా" అని.


తల్లి మనసు, ముఖం, హృదయం మూడు తన బిడ్డ వైపు తిరిగింది కొండంత ఆశతో... బిడ్డ అదే క్షణంలో "అమ్మ" అంటూ అరిచింది... శరీరం కదిలింది.


బయట లేగ దూడ తల్లిని చేరుకుంది... ఇక్కడ బిడ్డను ఈ తల్లి అక్కున చేర్చుకుంది... తల్లి మనసుతో.అక్కడ వారందరూ చప్పట్లు కొట్టారు బిడ్డ బతికినందుకు... అప్పుడే మీటింగ్ ముగించుకొని వచ్చిన డాక్టర్ ఆశ్చర్యపోయారు... తనకు తెలియకుండనే ఆ తల్లి మనసుకు నమస్కరించారు... 


"మేము కాదు... ఈ తల్లి మనసు కాపాడింది ఈ బిడ్డను..." అని మనసులో అనుకున్నారు... బయటికి అనేశారు.


10)

ఆ ఆసుపత్రి వారు తమ ఆసుపత్రికి...


"బంగారు తల్లి మనసు - బిడ్డ ఆసుపత్రి"


.... అని పేరు నిశ్చయించారు - నిర్ధారించారు - పెట్టారు.

-----

11)


ఆ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో... అందరి చప్పట్ల ధ్వని వల్ల... ఆ మహాతల్లి గతం వదిలి... తిరిగి ప్రస్తుతం - వర్తమానంలోకి వచ్చింది.


---------------- తిరిగి ప్రస్తుతం - వర్తమానం ------------


.. తల్లి తన బిడ్డను ప్రపంచ (స్థాయి) సంతోషపూరిత నిర్వహణ, ఆనందదాయక పరిష్కార తీరు, నిర్మాణాత్మక తీరు... వైద్యుడు, టీచర్ గా, లోకోద్ధారకుడిగా...


మంచి మనసు - మానవత్వం ఉన్న మంచి మనిషిగా


తీర్చిదిద్దింది.


--------- చిన్న కథ సమాప్తం ----------


---------నీతి:--------

  1. తల్లిని మించిన దైవం లేదు.

  2. తల్లిదండ్రులు కలియుగ దైవాలు.

  3. ప్రతి కుటుంబం మరియు వ్యక్తి... కుటుంబ సలహాదారుల వద్దకు వెళితే... మంచి చిట్కాలు తెలుసుకొని పాటిస్తే... అనురాగం, ఆత్మీయత, అనుబంధం నిండుకుంటుంది ప్రతి ఇంట్లో, కార్యాలయంలో కూడా... అప్పుడు వృద్ధాశ్రమాల అవసరం ఏ ఉండదు - పడదు ఎవ్వరికీ! అందరూ రాక్షసత్వాన్ని విడనాడాలి!


వృద్ధాశ్రమాలను నిషేధించాలి... పిల్లలు వారి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని శిక్షణ ఇవ్వాలి. చట్టం తేవాలి.


5)

తుది శ్వాస వరకు... ప్రయత్నించాలి... ఏ మనిషి అయినా... ఏ వృత్తి వారైనా... నిర్మాణాత్మక, సంతోషపూరిత నిర్వహణ, ఆనంద పరిష్కారాల తీరుతో.


6)

దోపిడీ, దగా కాదు... పునర్జీవం ఇవ్వడానికి ప్రయత్నించాలి దేవుడు చేసిన మనుషులు అన్నాక.


7)


Any human - any age, gender, profession... Should live with 100% Happy development management + WIN-WIN JOYFUL success SOLUTIONS + CONSTRUCTIVE nature... WITHOUT exploitation, harm, brokerage, timepass, destruction, devilish nature, scapegoat. blame-game etc.


--------- నీతి సమాప్తం -----


పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 


మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 


bottom of page