top of page
Original.png

పిచ్చుకమ్మ సందేశం

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #JivithameSarthakamu, #జీవితమేసార్థకము, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 59


Pichhukamma Sandesam - Somanna Gari Kavithalu Part 59 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 17/04/2025

పిచ్చుకమ్మ సందేశం - సోమన్న గారి కవితలు పార్ట్ 59 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


పిచ్చుకమ్మ సందేశం

----------------------------------------

బడి గోడపై వాలింది

అందాలొలికే పిచ్చుక

నలువైపులా అందరూ

పెంచాలంది పచ్చిక


లేకుంటే పచ్చదనము

అగును ఎడారి ప్రాంతము

కళ తప్పి పోతుందంది

అద్భుతమైన భూలోకము


పిచ్చుకమ్మ ప్రబోధము

అందరికీ సందేశము

తీసుకుంటే స్ఫూర్తిగా

చేయొచ్చు నందనవనము


వృక్షాలను పెంచాలి

ప్రకృతిని పరిరక్షించాలి

లేకుంటే ప్రపంచము

ఇక అల్లకల్లోలము















బామ్మ మాట-బంగారు బాట

----------------------------------------

తేవాలోయ్! కీర్తిని

ఇవ్వాలోయ్! స్ఫూర్తిని

పంచాలోయ్! భువిలో

పదిమందికి మంచిని


పొందాలోయ్! గెలుపును

త్రిప్పాలోయ్! మలుపును

జనహితము కోరితే

తరమాలోయ్! చెరుపును


వీడాలోయ్! గర్వము

రావాలోయ్! వినయము

జగమంతా కుటుంబము

కోరాలోయ్! క్షేమము


మానాలోయ్! స్వార్ధము

మారాలోయ్! హృదయము

ఆచితూచి అడుడేసి

చేయాలోయ్! స్నేహము











ఉండకూడదోయ్!

----------------------------------------

మేడి పండులా

ఎండమావిలా

ఉండకూడదోయ్!

ఊసరవెల్లిలా


మానని పుండులా

మ్రింగే ఊబిలా

ఉండకూడదోయ్!

భువిలో లోభిలా


వాడిన పువ్వులా

పాసిన బువ్వలా

ఉండకూడదోయ్!

రాలిన ఆకులా


ప్రక్కన మేకులా

కరిసే కుక్కలా

ఉండకూడదోయ్!

కుట్టే తేలులా


కంటిలో నలుసులా

పంటిలో పులుసులా

ఉండకూడదోయ్!

ఎదపై కుంపటిలా


చెప్పులో రాయిలా

చెవిలో జోరీగలా

ఉండకూడదోయ్!

కాలిలో ముల్లులా

















మేమే! మేమే! పిల్లలం

----------------------------------------

బాలలమండి బాలలం

భావి భారత పౌరులం

చీకట్లు తరిమికొట్టే

కాంతులీనే భానులం


చల్లని వెన్నెల జల్లులం

తెల్లని మల్లెల తావులం

పుడమి తల్లిని ముద్దాడే

చిరు చిరు తొలకరి చినుకులం


ఎల్లరు మెచ్చే పిల్లలం

అల్లరి చేసే పిడుగులం

కల్లాకపటమెరుగని

కోవెలలోని వేల్పులం


మేమే మేమే పిల్లలం

మిలమిల మెరిసే చుక్కలం

ఇలలో ఎదిగే మొక్కలం

నింగిని ఎగిరే పక్షులం









హితం అక్షరాభిమతం

----------------------------------------

గుండెల్లో ఆనందము

పెంచుతుంది ఆరోగ్యము

ముప్పు ఓర్వలేనితనము

అప్పు హానికరము నిజము


ముఖంలోన దరహాసము

బ్రతుకులోన మధుమాసము

అది వెలుగులీను దీపము

భగవంతుని ప్రతిరూపము


గెలుపు కొరకు పోరాటము

ఉండాలోయ్! ఆరాటము

అప్పుడే దరిచేరును

జీవితాన ఘన విజయము


గురువులకివ్వు గౌరవము

అదెంతో మహోన్నతము

అజ్ఞానము తరిమేసే

వారు కదా! విజ్ఞానము


-గద్వాల సోమన్న


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page