top of page

పిప్పలాద మహర్షి

#Ch.Pratap, #పిప్పలాదమహర్షి, #PippaladaMaharshi, #TeluguDevotionalStory

ree

Pippalada Maharshi - New Telugu Story Written By Ch. Pratap  

Published In manatelugukathalu.com On 29/06/2025

పిప్పలాద మహర్షి - తెలుగు కథ

రచన: Ch. ప్రతాప్ 


పిప్పలాద మహర్షి భారత ఆధ్యాత్మిక చరిత్రలో అపూర్వమైన స్థానం సంపాదించిన మహాత్ముడు. రుద్రావతారంగా జన్మించిన ఈ మహర్షి బాల్యంలోనే ఘనమైన తపస్సు చేసి అశేష తేజస్సును సంపాదించాడు. తన తపోబలంతో మానవాళికి జన్మించిన తొలి ఐదేళ్లవరకూ శనిగ్రహ ప్రభావాలు లేకుండా చేసే శక్తిని ప్రసాదించినవాడిగా పురాణాలు పేర్కొంటాయి. పిప్పలాదుని చరిత్రను చదవడం ద్వారా శని బాధలు, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం ప్రబలంగా ఉంది.


శనిదోష నివారణలో ఆయనకు అపూర్వమైన ప్రాశస్త్యం కలది. ఆయన్ని స్మరించడమే శని దోష నివారణకు ప్రభావవంతమైన మార్గంగా భావించబడుతోంది. దీనిని ధృవీకరించే శ్లోకం:


గాధీశ్చ కౌశికశ్చైవ పిప్పలాదో మహామునిః |శనైశ్చర కృతం పాపం నాశయ‌న్తి కృతార్థయః ||


ఈ శ్లోకంలో గాధి, కౌశికుడు, పిప్పలాదుడు వంటి మునులు శనిచేత కలిగే దోషాలను నాశనం చేయగల శక్తిశాలులు అని వర్ణించబడారు.


ఒక సందర్భంలో బ్రహ్మ దేవుడు పిప్పలాదుని ధర్మనిరతికి సంతోషించి శనివారం రోజున ఎవరైతే పిప్పలాద మహర్షి నామాన్ని స్మరిస్తారో, వాళ్లకి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని ఒక అపురూపమైన వరాన్ని ఇస్తాడు. అందువలన శని దోషంతో బాధలుపడే వాళ్లు పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.


పిప్పలాద ప్రోక్త శని స్తోత్రంకోణస్థః పింగలో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమఃశౌరః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః!!నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతేనమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే ||నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచనమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో ||నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతేప్రసాదం కురు దేవేశ, దీనస్య ప్రణతస్య చ ||


పిప్పలాద మహర్షి రచించిన ప్రశ్నోపనిషత్తు భారత తత్త్వశాస్త్ర సమృద్ధిలో ప్రముఖమైన గ్రంథంగా నిలిచింది. ఈ గ్రంథంలో అతడు ఆరు శిష్యులకు ఆత్మ, ప్రాణం, ప్రాణాశక్తి, జీవతత్త్వం, తపస్సు, ముక్తి వంటి గంభీరమైన విషయాలను వేదాధారంగా బోధించాడు. ఈ సందర్భంలో పిప్పలాదుడు ప్రాణం విశిష్టతను ఇలా వివరిస్తాడు —


“శరీరాన్ని భరించేది, ప్రకాశింపచేసేది ప్రాణమే! ప్రకాశింపచేయటము అంటే ఈ చైతన్యాన్ని ఇచ్చి పనిచేయించేది కూడా ప్రాణమే.”


ఇదే సందర్భంలో మరొక ఋషి అడిగిన “ప్రాణం ఎట్లా పుడుతుంది? శరీరంలోకి అది ఎట్లా ప్రవేశిస్తుంది?” అనే ప్రశ్నకు పిప్పలాదుడు అందించిన సమాధానం శాస్త్రోక్తంగా, తత్త్వబద్ధంగా నిలుస్తుంది:


“మొదట ఆత్మ నుంచే ఆత్మ పుడుతుంది. తరువాత దానినుండి ప్రాణం ఉద్భవిస్తుంది. అంటే ఆత్మవస్తువు పంచభూతములలో ప్రవేశించినప్పుడు, ఆత్మయందే సంచరించే ప్రాణశక్తి బయటికి వ్యాపిస్తుంది. వేదశాస్త్రం ప్రకారం, ప్రాణం ఎక్కడినుంచో రాదు — అది ఆత్మ లో నే నిశితంగా ఉంటుంది.”


ఈ వాక్యాలు పిప్పలాదుని తత్త్వచింతన, ఆధ్యాత్మిక లోతు, శాస్త్రసమ్మతమైన జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి.


తదనంతరం పిప్పలాదుడు అనరణ్య మహారాజు కుమార్తెను వివాహమాడి గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. తదుపరి కాలంలో తన స్వరూపాన్ని తెలుసుకొని బ్రహ్మజ్ఞానిని అయ్యాడు. ఆయన్ని "బ్రహ్మజ్ఞాని"గా శాస్త్రం గుర్తించింది.


పిప్పలాద మహర్షి తపస్సు, జ్ఞానము, శాంతియుత తత్త్వబోధనలకు ప్రతీక. ఆయన్ను స్మరించడం ద్వారా శని ప్రభావాలు తొలగుతాయని, ఆత్మశుద్ధి కలుగుతుందని శ్రద్ధతో నమ్ముతారు భక్తులు. ఆయన్ని తలచిన ప్రతి ఒక్కరికీ లోతైన ఆధ్యాత్మిక బోధన తో పాటు శుభ ఫలితాలు లభిస్తాయన్నది ప్రజల లో ప్రబలమైన నమ్మకం.


***

Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

ree

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.



Comments


bottom of page