top of page
Original_edited.jpg

పొత్తం చెప్పిన సత్యాలు

  • Writer: Gadwala Somanna
    Gadwala Somanna
  • Oct 15
  • 1 min read

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #PotthamCheppinaSathyalu, #పొత్తంచెప్పినసత్యాలు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 132


Pottham Cheppina Sathyalu - Somanna Gari Kavithalu Part 132 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 15/10/2025

పొత్తం చెప్పిన సత్యాలు - సోమన్న గారి కవితలు పార్ట్ 132 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


పొత్తం చెప్పిన సత్యాలు

-------------------------------------------

శ్రేష్టులే జ్ఞానంలో

శ్రీమంతులు గుణంలో

అయితేనే గౌరవము

అగును బ్రతుకు సార్ధకము


గగనమంత ప్రేమలో

క్షమాగుణం మనసులో

ఉంటేనే బంధాలు

వెలుగుతాయి జీవితాలు


పుడమియంత సహనంలో

పసిపాపలా నవ్వులో

ఉండాలి నిరంతరము

కావాలి అగ్రస్థానము


ప్రతిదినం ధ్యానంలో

పెద్దవారి సేవలో

తరిస్తే బహు దీవెన

కడు క్షేమమే బ్రతుకున


ree







నాలుకతో జాగ్రత్త!

------------------------------

నోరు అదుపు చేసుకో

మాట విలువ పెంచుకో

లేకపోతే మాత్రం

అనర్ధమని తెలుసుకో


హద్దులేని మాటలు

దాటునోయి కోటలు

జాగ్రత్త అవసరం

విరచునవే మనసులు


చెడు మాట చిన్నదైనా

మదిని గాయ పరచును

మాట్లాడకు కలనైనా

మనస్పర్థలు తెచ్చును


అగ్నివంటి నాలుకతో

ప్రతిరోజూ సమరమే

దైనందిన బ్రతుకులో

పెడుతుందోయ్! కలహమే

ree















అమ్మ మాట-బ్రతుకు బాట

------------------------------------

పతనానికి హేతువు

తెలుసుకో గర్వమే

అభివృద్ధికి సేతువు

అక్షరాల సత్యమే


విజయానికి మార్గము

నిరంతర అభ్యాసము

ఉన్నత సంస్కారము

గౌరవానికి మూలము


క్రమశిక్షణ ఉంటే

భవితే బంగారము

శ్రమైక్య జీవనంతో

బ్రతుకే సింగారము


సాటిలేని సహనము

కష్టాల్లో మౌనము

ప్రతి మనిషి బ్రతుకులో

అత్యంత అవసరము

ree







చిరునవ్వుల పువ్వులు

-----------------------------------------

చిరునవ్వే నవ్వగా

ఉండునోయి! గొప్పగా

వెలుగుతాయి! ముఖములు

దేదీప్యమానంగా


నవ్వులేని మోములు

నీరులేని చెరువులు

పరికింప తలపించును

అమావాస్య రాత్రులు


ఆరోగ్య ప్రదాతలు

ఆయుష్షు కారకాలు

మోవి పైన నవ్వులు

వికసించిన పువ్వులు


దినదినము నవ్వాలి

వెలుగులై పూయాలి

ఖర్చులు లేని నగవులు

ఖరీదైన కానుకలు

ree













చిక్కని బంధాలకు-చక్కని సూత్రాలు

-------------------------------------------------

సద్వినియోగం చేసుకోవాలి

తలుపు తట్టిన అవకాశాలు

బ్రతుకులు చక్కదిద్దుకోవాలి

విని మహనీయుల సుభాషితాలు


అజ్ఞానమే పోవాలంటే

విజ్ఞానాన్ని పెంచుకోవాలి

ఉజ్వల భవిత కావాలంటే

చదివి తలరాత మార్చుకోవాలి


గెలుపు బాటలో సాగాలంటే

శ్రమైక్య జీవనం అలవడాలి

సత్సంబంధాలుండాలంటే

లోపాలను వెదకుట మానాలి


ప్రేమపూవులు పూయాలంటే

క్షమాగుణం వానై కురియాలి

ఐకమత్యం వర్ధిల్లాలంటే

కలుపుగోలుతనంతో బ్రతకాలి

-గద్వాల సోమన్న

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page