top of page
Original.png

ప్రణయ దేవత

Pranaya Devatha - Telugu Comedy Story Addanki Lakshmi

ప్రణయ దేవత - తెలుగు  హాస్య కథ | అద్దంకి లక్ష్మి

Published In manatelugukathalu.com On 25/04/2026

 

సినిమా స్టేజిపై సన్మానం అందుకుంటున్న హీరోయిన్‌గా తనను తాను ఊహించుకునే ఒక మహిళ…ఒక్క క్షణంలోనే గిన్నెల శబ్దంతో వాస్తవానికి దిగిపోవాల్సిన పరిస్థితి…

కలలు, ఆశలు, నిరాశలు, మధ్యతరగతి జీవన సత్యాలు—all కలిసిన హృదయాన్ని తాకే కథే “ప్రణయ దేవత”.ఉగాది పచ్చడి లాంటి జీవితం—ఆరు రుచులలో తీపి కోసం వెతుకుతున్న మనుషుల గాథ.


విజయభారతి హాలు చక్కగా అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలు.

ఆరోజు సాయంత్రం అక్కడ చాలా హడావిడిగా ఉంది.


‘ప్రణయ దేవత’ అనే సినిమా 15 నగరాల్లో శత దినోత్సవాలు జరుపుకుంది.

అందుకే ఇక్కడ పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేశారు.


 ప్రముఖులందరూ వచ్చారు.

సినిమా చాలా బాగా తీశారు. జానపద చిత్రాల్లో లాగా ఫైటింగ్‌లు,


నిర్మాతకు చాలా డబ్బు వసూలైంది.

ముఖ్యంగా అందులో నటించిన హీరోయిన్ మధురిమ,


ఆమె డైలాగ్ డెలివరీ, ఆమె యాక్షన్ అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇదే ఆమె మొదటి పిక్చర్, బాగా హిట్ అయింది.


చక్కటి హావభావాలతో, అది జానపద సినిమా ఏమో, ఫైటింగు, పాటలు, యాక్షన్ చాలా బాగా చేసింది.


మొదట హీరోకి, హాస్యనటులకి అందరికీ సన్మానమైంది.


 "ఇప్పుడు ప్రణయ దేవత మధురిమని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాము. సన్మానము చేయుటకై"

మైకులో పెద్దగా వినిపించింది.


గట్టిగా చప్పట్లు, అరుపులు, విజిల్స్.


మధురిమ ఎంతో ఆనందంగా లేచింది.

అప్సరసలా నడుస్తూ స్టేజీ మీదకు వస్తోంది.


మైకులో ఆమె గురించి ప్రశంసలు చెబుతున్నారు.

చప్పట్లతో స్టేజి మారు మ్రోగిపోతుంది.


మంత్రిగారు మధురిమ మెడలో పెద్ద పూలదండ వేస్తున్నారు.


అంతే,,,,


టప్ టప్ టప్...


నాలుగు గిన్నెల శబ్దం. నెత్తి మీద ఒక మొట్టికాయ పడింది.


ఆకాశంలో విహరిస్తున్న హీరోయిన్ భూమి మీద ఒక్కసారిగా పడింది.


"ఏమే మంగీ! ఏమిటి కలలు కంటున్నావు? ముందు ఆ గిన్నెలు తోమి తగలడు. ఇంకా ఇల్లు ఊడ్చాలి. పిల్లల స్కూల్‌కి టైమ్ అయిపోతోంది, టిఫిన్ చేయాలి" అంటూ అరుస్తోంది ఎదురుగుండా మహంకాళి రూపంలో పద్మావతి.


"ఏంటండీ అమ్మగారు! గిన్నెలు తోముతున్నాను కదా. మంచి కల అంతా పాడు చేశారు" అంటూ విసుక్కుంది మంగి.


"నిన్న రాత్రి సినిమాకి వెళ్లొచ్చావా? ఇక ఈరోజంతా కలలు కంటూ కూర్చో. నువ్వే హీరోయిన్, నువ్వే విలన్" అని మండిపడింది పద్మావతి.


"అవునమ్మగారు. ప్రణయ దేవత సినిమాకి వెళ్లొచ్చాను. ఎంత బాగుందో! ఆ హీరోయిన్ ఎంత అందంగా ఉందో! యాక్షన్ కూడా చాలా బాగా చేసింది."

"రాక్షసులతో, జంతువులతో అందరితో ఆవిడే ఫైటింగ్ చేస్తూ ఉన్నది."



"అప్పుడు అనుకున్నాను నేనే ఆ మధురిమ అని. ఆ సినిమాలో నేనే హీరోయిన్. నాకు ఆ అయ్యగారు సన్మానం చేస్తున్నారు. ఇంతలో మీరు నా కల చెడగొట్టేశారు అమ్మగారు" అంది విచారంగా మంగి.


"సరేలే, వయసులో ఉన్నవాళ్లందరూ ఇలాగే హీరోయిన్ కలలు కంటూ ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు సినిమాల్లో చేరదామనుకున్నాను. మా స్నేహితులు, ఇంట్లోవాళ్లు నన్ను చూసి ఎంత అందంగా ఉన్నావో, సినిమాలో చేరితే గొప్ప హీరోయిన్ అయిపోతావు, బోలెడు డబ్బు సంపాదించవచ్చు అనేవారు. దాంతో నాలో గర్వం పెరిగి, నేనే పెద్ద హీరోయిన్‌గా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. కానీ మా నాన్న ఏదో చిన్న గుమాస్తా. ఇంట్లో బోలెడు మంది జనాలు. ఇదిగో చూడు నా బతుకు ఇలా అయింది. ఈ మహానుభావుడికి ఇచ్చి కట్టబెట్టారు. మా ఆయన కూడా ఒక గుమాస్తా. తిండి తింటే మంచి చీర కొనుక్కోవడానికి ఉండదు, చీర కొంటే తిండికి ఉండదు. ఇద్దరు పిల్లల చదువులు. ఇదీ దరిద్రపుగొట్టు బతుకు" అంటూ పద్మావతి గాఢంగా నిట్టూర్చింది.


"ఇదిగో మంగి, నాలుగు రోజుల్లో ఉగాది పండుగ వస్తోంది. రేపటి నుంచి బూజులు దులిపి ఇల్లు సర్ది పెట్టాలి."


"జీవితమంటే ఉగాది పచ్చడి లాగా ఆరు రుచులు ఉంటాయంటారు. నీలాంటి నాలాంటి మధ్యతరగతి వారి జీవితాల్లో చేదు, వగరు, పులుపు ఇవే ఎక్కువగా ఉంటాయి. మధురమైన తీపి అనే పదార్థమే ఎక్కడా కనిపించదు. ఏంటో ఈ జీవితం" అంటూ నిట్టూర్చింది పద్మావతి.


"అవునమ్మగారు.

"అవునమ్మగారు. ఏంటో జీవితాలు ఇలాగే ఉంటాయి. వయసులో ఉన్న ఆడపిల్లలు ఎన్నో కలలు కంటారు. ఒక్కటి కూడా నెరవేరదు కదా. ఆడపిల్లగా పుట్టడం అంత దురదృష్టం ఇంకేమీ ఉండదు."

నిరాశగా మంగి అంట్లు తోమడం మొదలుపెట్టింది.


"సరేలే ఏం చేస్తాం. కానీ తొందరగా టిఫిన్ డబ్బాలు తయారు చేయకపోతే మీ అయ్యగారు నన్ను తిట్టిపోస్తాడు."

అంటూ పద్మావతి విసుగ్గా లోపలికి వెళ్ళింది.


‘ఏం బతుకురా దేవుడా!’ అనుకుంది కలల రాణి అంట్లు తోముకుంటూ...



***

అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page