హెచ్చరిక

Hecharika - Telugu Suspense Story | Vasundhara Rani Munipalle
హెచ్చరిక - తెలుగు సస్పెన్స్ కథ | వసుంధర రాణి మునిపల్లె
Published in manatelugukathalu.com on 23/11/2026
జీవితంలో ప్రతి నిర్ణయం మన భవిష్యత్తును మార్చగలదు. “హెచ్చరిక” కథలో ఒక మాయా గడియారం రాఘవ్‌ను తప్పు నిర్ణయాల నుంచి కాపాడుతూ, చివరకు మంచి నిర్ణయం తీసుకునే అసలైన శక్తి మనలోనే ఉందని గుర్తుచేస్తుంది.
రాఘవ్ వాళ్ల తాతగారు ఈ మధ్యనే పోయారు. ఆ పాత ఇల్లుని కొంచెం సర్ది, సామాన్లన్నీ ఒక గదిలో వేసేసి, మిగతా ఇంటిని రెంట్‌కి ఇవ్వమని వాళ్ల నాన్న రాఘవ్‌ని ఊరికి పంపించాడు.
వర్షం పడుతున్న సాయంత్రం. అలా ఇల్లు సర్దుతుంటే రాఘవ్‌కు దుమ్ము పట్టిన ఒక పాత ఇత్తడి ట్రంకు పెట్టె కంటపడింది. దానిని తెరిచి లోపల చూస్తే, పట్టు గుడ్డలో చుట్టి ఒక గడియారం ఉంది.
బయటకు పాతదిగా ఉన్నా, లోపల మెషిన్ మాత్రం కొత్తదానిలా ఉంది. పని పూర్తి చేసుకున్నాక ఆ గడియారాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు రాఘవ్.
రాఘవ్ ముప్పై ఐదేళ్ల వయసులో ఉన్నాడు. ఐటీ రంగంలో పదేళ్లు పని చేసినా, ఇటీవల కంపెనీలో రీస్ట్రక్చరింగ్ వల్ల జాబ్ పోయింది.
చేతిలో ఉన్న పొదుపు డబ్బులు కొంతమేర మాత్రమే ఉన్నాయి. మరోవైపు, తన కాలేజీ ఫ్రెండ్ సందీప్ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌లో పార్టనర్‌షిప్ ఆఫర్ తీసుకొచ్చాడు.
"ఇప్పుడే భూముల రేట్లు పెరుగుతున్నాయి, ఇన్వెస్ట్ చేస్తే ఆరు నెలల్లో రెట్టింపు అవుతుంది" అని నమ్మించాడు. జాబ్ లేని టెన్షన్‌లో ఉన్న రాఘవ్, ఎలాంటి లీగల్ డాక్యుమెంట్లు చెక్ చేయకుండానే ఆ డబ్బు మొత్తం సందీప్‌కి ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాడు.
కరెక్ట్‌గా అప్పుడే... ఇంటికి తెచ్చి టేబుల్ మీద పెట్టిన గడియారం స్టార్ట్ అయి ముళ్లు తిరగడం మొదలుపెట్టాయి! రాఘవ్ షాక్ అయ్యాడు. "ఇదేంటి? లోపల బ్యాటరీ కూడా లేదు కదా, మరి ఎలా తిరుగుతోంది?" అనుకుంటూనే, "పోనీలే, బిజినెస్‌లో చేరిపోదాం" అని మనసులో గట్టిగా అనుకున్నాడు.
వెంటనే ఆ గడియారం లోపలి నుంచి ఒక చిన్న హెచ్చరిక బీప్ సౌండ్ లాగా, డేంజర్ అలారంలా అప్రమత్తం చేసే సౌండ్ వచ్చింది.
రాఘవ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. "ఒకవేళ ఈ నిర్ణయం తప్పేమో?" అని డౌట్ వచ్చింది.
కాసేపు ఆలోచించి, "వద్దులే, ముందు పేపర్లు, లెక్కలు మొత్తం చూసిన తర్వాతే అడుగు వేద్దాం" అని నిర్ణయం మార్చుకున్నాడు. అంతే... తిరుగుతున్న గడియారం ముళ్లు ఆగిపోయాయి!
ఆ రాత్రి రాఘవ్‌కు నిద్ర పట్టలేదు. సందీప్ చెప్పిన వెంచర్ సర్వే నంబర్లను ఆన్‌లైన్‌లో చెక్ చేశాడు.
ఆ భూమి మీద ఆల్రెడీ ఒక సివిల్ కోర్టు కేసు పెండింగ్‌లో ఉందని, డాక్యుమెంట్లు సరిగ్గా లేవని తేలింది.
సందీప్ తన ఇబ్బందిని అడ్వాంటేజ్‌గా తీసుకుని, తనకు వచ్చే కమిషన్ కోసం రాఘవ్ పొదుపు డబ్బును ప్రమాదంలో నెట్టాలనుకున్నాడు.
మరుసటి రోజు సందీప్ ఫోన్ చేసి, "ఏమైంది రా, అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేశావా?" అని అడిగాడు. రాఘవ్ ప్రశాంతంగా, "సర్వే నంబర్లలో కోర్టు కేసు ఉందట కదా, ఆ డాక్యుమెంట్లు క్లియర్ అయ్యాక మాట్లాడుకుందాం" అన్నాడు.
సందీప్ గొంతులో వెంటనే తడబాటు మొదలైంది. "అది... చిన్న ఇష్యూలే రా, సెటిల్ అయిపోతాయి" అంటూ మాట మార్చాడు.
ఆ తర్వాత కొన్ని రోజులకే రాఘవ్‌కు మరో సిట్యుయేషన్ ఎదురైంది. జాబ్ పోయిన బాధలో, ఇంట్లో ఖర్చులు పెరిగిపోతున్న టెన్షన్‌లో తన కారును అమ్మేసి, ఆ డబ్బుతో ఒక చిన్న కేఫ్ పెట్టాలని ఆలోచించాడు. త
ను ఎప్పుడూ ఫుడ్ బిజినెస్ చేయలేదు, మార్కెట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు.
అయినా "ఏదో ఒకటి చేయాలి కదా" అని కారు అమ్మేద్దామని ఫిక్స్ అయ్యాడు. మళ్లీ టేబుల్ మీద ఉన్న గడియారం ముళ్లు తిరగడం మొదలుపెట్టాయి, లోపలి నుంచి ఆ డేంజర్ సౌండ్‌లాంటి బీప్ వచ్చింది.
రాఘవ్ ఆగిపోయాడు. కారు అమ్మితే తిరిగి రావడం కష్టమని, ముందు కేఫ్ బిజినెస్ గురించి బాగా తెలుసుకుని, ఒక చిన్న పార్ట్‌టైమ్ కన్సల్టింగ్ జాబ్ చేస్తూ నెమ్మదిగా అడుగు వేయాలని నిర్ణయించుకున్నాడు. గడియారం ముళ్లు ఆగిపోయాయి.
కొన్ని రోజులకే ఆ ఏరియాలో అలాంటి కేఫ్‌లు రెండు మూతపడ్డాయి. రాఘవ్ తన కారును కాపాడుకున్నాడు.
ఇంకో వారానికి రాఘవ్‌కు ఒక కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది. కూర్చుని ఆఫర్ లెటర్ చదువుతుండగా, శాలరీ ప్యాకేజీ అనుకున్నంత లేదు, పైగా టార్గెట్ల ప్రెజర్ ఎక్కువగా ఉంటుందని అర్థమైంది.
"జాబ్ లేదు కదా, ఏదైనా పర్వాలేదు, జాయిన్ అయిపోదాం" అని ఆఫర్ ఒప్పేసుకుందామని ఫిక్స్ అయ్యాడు.
టేబుల్ మీద ఉన్న గడియారం కదిలి ఆ హెచ్చరిక బీప్ సౌండ్ ఇచ్చింది. రాఘవ్ ఆలోచించాడు.
తక్కువ జీతానికి కష్టపడి, టార్గెట్ల ఒత్తిడిలో పడితే మళ్లీ అలసిపోతానని, ఇంకొన్ని రోజులు స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకుంటూ మంచి ఆఫర్ కోసం ఆగడమే బెటర్ అని ఆఫర్ వదులుకున్నాడు.
గడియారం ముళ్లు ఆగిపోయాయి. సరిగ్గా రెండు వారాలకే అతని ప్రొఫైల్‌కు తగ్గ మంచి రోల్, మంచి ప్యాకేజీతో మరో కంపెనీ నుంచి కాల్ వచ్చింది.
కొత్త ఆఫీస్‌లో జాయిన్ అయిపోయి, ఆ రోజు సాయంత్రం జాబ్ ముగించుకుని ఇంటికి వచ్చాడు రాఘవ్.
టేబుల్ వైపు చూస్తూ, "అసలు ఏంటి ఇది విచిత్రంగా... నా జీవితంలో కీలకమైన నిర్ణయాలన్నింటినీ సరిదిద్దుకునేలా, మంచి నిర్ణయాలు తీసుకునేలా నాకు స్కోప్ ఇస్తోంది.
నా లైఫ్‌లో ఇది చాలా పెద్ద పాత్రే పోషిస్తోంది. దీని స్పెషాలిటీ అసలు ఏంటి?" అనుకుంటూ గడియారాన్ని చేతిలోకి తీసుకుని చూసుకున్నాడు.
దాని మూత ఓపెన్ చేసినప్పుడు, లోపల వాళ్ల తాతగారు రాసిన ఒక చిన్న పేపర్ బయటపడింది.
అందులో ఇలా రాసి ఉంది: "నేను కూడా నా జీవితంలో చాలా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ గడియారం మీదే ఆధారపడ్డాను. ఇప్పుడు ఇంకా మిగిలినవి మూడే మూడు ఛాన్సులు ఉన్నాయి. ఎవరు తీసుకుంటే ఆ గడియారం వాళ్ళకి ఉపయోగపడుతుంది.
ఆ తర్వాత ఇంక దానిలో పవర్ పోతుంది." ఆ పేపర్ చదివిన కొద్దిసేపటికే, గడియారం ఇక పనిచేయడం మానేసింది.
ఆ తర్వాత ఒకరోజు చెల్లెలు వచ్చి తన ఖర్చుల కోసం ఒక పెద్ద అమౌంట్ అడిగింది. తన దగ్గర ఉన్నది కొంచెమే అయినా, ముందులా ఆలోచించకుండా ఇచ్చేయాలని అనిపించలేదు.
గడియారం లేకపోయినా, ఆగి నిదానంగా చెల్లితో కూర్చుని మాట్లాడాడు. అసలు డబ్బు ఎందుకు కావాలి, తిరిగి ఎలా కవర్ చేస్తారు, ఇంట్లో మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి అనేవి లాభనష్టాలు బేరీజు వేసుకుంటూ ప్రశాంతంగా చర్చించాడు.
అలా మాట్లాడటం వల్ల చెల్లి కూడా తన ప్లాన్‌లో ఉన్న లోపాలను గుర్తించి, అనవసరమైన ఖర్చును తగ్గించుకుంది.
అప్పటినుంచి రాఘవ్ తన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పదిసార్లు ఆలోచించి, ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటూ ముందుకు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు.
గడియారం లేకపోయినా, ప్రతి కీలక సమయంలోనూ లోపల గడియారం చెప్తున్నట్టే అనిపిస్తుంటుంది రాఘవ్‌కి.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.













Comments