కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Preme Neramouna' Telugu Story Written By Madhukar Vaidhyula
రచన: మధుకర్ వైద్యుల
అతని ప్రేమలో లోపం లేదు.
ఆమె పొరపాటు వల్లనో, భయం వల్లనో అతను బాధ పడ్డాడు.
ఆ బాధను ద్వేషంగా మార్చుకున్నాడా.. మరింతగా ప్రేమించాడా.. ప్రముఖ రచయిత మధుకర్ వైద్యుల గారి ఈ కథలో తెలుసుకోండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
ఇక కథ ప్రారంభిద్దాం.
ఆఫీసులో అలస్యం అవడంతో కొంచెం ఆలస్యంగానే ఇంటికి బయలు దేరాను. రాత్రి 10 కావస్తోంది. బండితీసుకుని రావడం వల్ల ఆలస్యం అయినా ఎలాగోలా ఇంటికి వెళ్దాంలే.. అనుకుని బండితీసాను.
రాత్రి సమయం కావడంతో రోడ్డువీుద ట్రాఫిక్ పెద్దగా లేదు. నెవ్ముదిగా బండి నడుపుతున్నాను. నేను ఏదో ఆలోచిస్తూ బండి నడుపుతున్నట్లుగా విుగతా వెహికిల్స్ అన్ని నన్ను దాటి వెళ్తున్నాయి. బేగంపేట ఫ్లెఓవర్ దాటిన తర్వాత అనుకుంటా.. ఒక వ్యక్తి చేయి ఊపుతూ లిప్టు ఇవ్వమన్నట్లు సైగచేశాడు. నేను కూడా ఒకడినే ఉన్నాను కదా అని బండి ఆపి ఎక్కమన్నాను. అతను ఎక్కగానే బండి ముందుకు దూకించాను. అతను బండి ఎక్కి పది నివిుషాలు దాటినా ఒకమాట కూడా మాట్లడపోతే అనుమానం వచ్చి వెనకకు చూసాను, అసలు ఉన్నాడా? లేడా? అని. ఉన్నాడు. అంతేకాదు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. నేనే చొరవచేశాను.
“వీు పేరేవిుటీ?” అన్నాను.
“ధర్మతేజ” ఏదో ముభావంగా సమాధానమిచ్చాడు.
“వీు పేరు బాగుంది” అన్నాను.
“థాంక్స్.... పేరు బాగానే ఉంది. నా బతుకే బాగా లేదు” అన్నాడు.
ఆశ్యర్యంగా చూశాను. ఈ లోపు సికింద్రాబాద్ రానే వచ్చింది. అతను ఉప్పల్ వరకు వెళ్తానన్నాడు. నేను బండి పక్కకు పెట్టి.. “వీుతో మాట్లాడవచ్చా” అని అడిగాను.
“భలేవారే! వీురు నాతో మాట్లాడడానికి పర్మిషన్ అడగాలా సార్? నిర్భయంగా మాట్లాడండి” అన్నాడు. పక్కనే కూర్చున్నాము
“ఇంతకు ముందెందుకో నా బతుకే బాగాలేదని అన్నారు కదా? దాని గురించి తెలుసుకుందామని..” అన్నా ను.
“అదా.. ఆ విషయం చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అసలే అలసిపోయినట్టున్నారు. మళ్ళీ కలిసినపు డు చెబుతాను సార్” అన్నాడు.
“పరవాలేదు చెప్పండి. నాకు విషయం చెప్పడం వల్ల వీు మనసు కుదుటపడితే అదే సంతోషం” అన్నాను.
అతను చెప్పాలా? వద్దా? అన్నట్లు చూసి చెప్పడం వెుుదలెట్టాడు.
“మాది మహబూబ్‌నగర్ జిల్లా. చిన్నతనం అంతా అక్కడే గడిచింది. పెద్దగా చదువుకోలేదు. కొంతకాలం క్రితవేు ఇక్కడికి వచ్చాను. స్నేహితుల సహాయంతో ఆపని ఈ పని చేస్తూ ఇప్పుడు క్లబ్‌లో పనిచేస్తున్నాను. అయితే ఇక్కడో విషయం చెప్పాలి. నేను హెదరాబాద్ రావడానికి, ఇక్కడ పనిచేయడానికి ఒక కారణం ఉంది. అది వసు.. అవును సార్. నా వసుంధర కోసవేు ఇక్కడికి వచ్చాను. కానీ తానే లేదనుకున్నపుడు నా బ్రతుకేం బాగుంటుంది సార్” అంటూ ఏడ్వడం వెుుదలెట్టాడు.
“అది కాదండి. ఏడ్వడం దేనికి? తనకేం అయ్యింది చెప్పండి ప్లీజ్..” అన్నాను.
“ఏమమతుందండీ.. చనిపోయింది”.
“చనిపోయిందా...?” ఆశ్యర్యపోయాను.
“అవునండీ! వీురు సరిగ్గానే విన్నారు. ఆత్మహత్య చేసుకుంది” అన్నాడు నిర్లిప్తత నిండిన గొంతుతో...
నాకేం అర్థం కావడం లేదు. కాస్తా అర్థం అయ్యేటట్టు చెప్తారా? అని అడిగాను.
“నేను ఇష్టపడిన అవ్మూయి వసుంధర. తనను రోజు చూస్తూ ఉంటే రోజురోజుకు తను నాకంటికి మరింత అందంగా కనిపించేది. తను నాకు పరిచయం అయ్యే సమయానికి తను పదవతరగతి చదువుతుంది. ఒక రోజు నేనే ధైర్యం చేసి ఐలవ్‌యు అని చెప్పాను. తను సిగ్గుపడుతూ వెళ్లి పోయింది. అంటే నా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే కదా అని ఆనందంతో గంతులు వేశాను. నాలుగు సంవత్సరాలు అంతా సాఫిగా సాగింది. అప్పుడే తను నన్నొక కోరిక కోరింది.
“నువ్వు ఇలా పనిలేకుండా ఉంటే మానాన్న నీకు నన్ను ఇవ్వడు. ఏదైనా పనిచేయి” అని.
మన చదువుకు ఊర్లో పని అంటే కాని పని. అందుకే వెంటనే హైదరాబాద్ వచ్చేశా.
ప్రతినెల జీతం రాగానే తనకు తప్పకుండా ఒక డ్రెస్ తీసుకుని వెళ్లేవాణ్ణి. సెల్ కొనిచ్చాను. నగలు కొన్నాను. ఎన్నో కొనిచ్చాను. నేనే ప్రాణం అంది. నాతోటిదే లోకం అంది. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటన ఇప్పటికీ నా కళ్ల నుండి చెరిగిపోలేదు సార్” అంటూ ఆగిపోయాడు ధర్మతేజ.
నేను అలాగే చూస్తూ ఉండి పోయాను.
“ఆరోజు తను కాలేజీకి వెళ్లలేదు. ఇంట్లోనే ఉంది. వాళ్లింట్లో వాళ్లు కూడా ఎవరు లేరు. నాకు ఫోన్ చేసింది రమ్మని. నేను రెక్కలు కట్టుకుని మా వూళ్ళో వాలాను.నేరుగా వాళ్లింట్లోకి వెళ్లాను. నేను కొనుక్కొచ్చిన చీర తనకు ఇచ్చాను. చీర కట్టుకుంటానని లోనికి వెళ్లిన వసుంధర లంగా, జాకెట్ వీుద బయటకు వచ్చింది. నేను ఆశ్యర్యపోయాను.
తేరుకునే లోపే ‘నాకు చీర కట్టుకోవడం రాదు. నువ్వే కట్టు’ అంటూ నా ముందు నిలిచింది” అంటూ ఒకసారి కళ్లు మూసుకున్నాడు.
నేను ఒక్కక్షణం ఏం జరిగి ఉంటుందబ్బ అని ఆలోచిస్తున్నాను.
ఆరోజు వెుుదటిసారి ఆవెును అలా చూడడం. ఒక అందమైన శిల్పం నా ముందు నిలిచిందనిపించింది. చీర తీసుకుని తనకు చుడుతుంటే తను కిలకిలమని నవ్వుతూనే ఉంది. ఆ నవ్వు కోయిలా రాగంలా ఉంది. ఆ నవ్వులో సన్నజాజి పరిమళం ఉంది. ఆ నవ్వులో ఇంకా ఏదో తెలియని మాధుర్యం ఉంది....కానీ ఆ నవ్వు ఎంతోసేపు నిలవలేదు. నేను చీరకట్టడం పూర్తి కాకుండానే బయటనుండి ఎవరో పిలుస్తున్న అలికిడి. వెంటనే నేను ఆవెుకు దూరంగా జరిగాను. తను వెళ్లి తలుపు తీసింది. ఆశ్చర్యం చుట్టుపక్కల జనం పొగయ్యారు.
ఆడపిల్ల ఇంట్లో ఒక్కతే ఉండగా వచ్చి అల్లరి చేస్తున్నాడు అని అరిచారెవరో..
నాకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అందరూ నన్ను పట్టుకున్నారు. కొడుతున్నారు.
ఆ గొడవలో నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు.
“నేను అమ్మాయిని అల్లరి చేయడం లేదు. కావాలంటే వసుంధరను అడగండి. నేను తను ప్రేవిుంచుకుంటున్నాం” అన్నాను.
అందులో ఎవరో అన్నారు “ఆ అవ్మూయిని అడగండి” అని.
ఏడుస్తున్న వసును తీసుకొచ్చారు.
“ఏమమ్మా! వీడు చెబుతున్నది నిజవేునా? వీురిద్దరూ ప్రేవిుంచు కుంటున్నారా?” ఒక పెద్దయన అడిగాడు.
“లేదండీ! ఈయన మా పక్కింట్లో ఉంటాడు. చాలా రోజుల నుండి నన్ను ఏడిపిస్తున్నాడు. ఈరోజు నేను స్నానం చేసి బట్టలు మార్చుకుంటుంటే లోనికి వచ్చి డోర్ వేశాడు. వీురు రావడంతో మాట మార్చుతున్నా డు” అంటూ ఏడుస్తూ చెప్పింది.
ఒక్కసారిగా నాగుండె పగిలిన ఫీలింగ్. వసునేనా ఇలా చెప్పేది. ఆ మరుక్షణం ఏం జరిగిందో తెలిదు. జనం తమ ఇష్టం వచ్చినట్లు కొడుతూనే ఊరి చివరికి వరకు తీసుకువచ్చారు. వాళ్లు అంతగా కొడుతున్నా నాకు నొప్పి తెలియడం లేదు. ఎందుకంటే వసు గుండెల్లో చేసిన గాయం కంటే ఇవేం పెద్దవి కాదు కదా? ఎలా వచ్చానో తెలీదు. బస్సెక్కి హైదరాబాద్ వచ్చాను. పిచ్చిపట్టినట్లు తిరిగాను. ఎక్కడ తిన్నానో? ఎక్కడ పడుకున్నానో గుర్తులేదు. ఈ లోపు నా స్నేహితులు నా కోసం వెతుక్కుంటూ వచ్చారు. నన్ను వాళ్ల రూముకు తీసుకు వెళ్లారు. మూడు నెలలు గడిచింది.
ఒకరోజు వసుంధర నుండి ఫోన్. “సారీ ధర్మా! ఆరోజు నేను అలా చెప్పక పోతే నిన్ను చంపేస్తామని వచ్చిన వాళ్లు భయపెట్టారు. దీంతో భయంతో అలా చెప్పాను. అంతేకానీ నీవీుద ప్రేమ లేక కాదు” అంటూ ఏడ్చింది.
తిరిగి నా కలలకు రూపం వచ్చిందని తెగ సంతోషించాను. ఫోన్‌లో ప్రతిరోజు మాట్లాడుతుండేవాణ్ణి. మా స్నేహితులతో బహుమానాలు పంపుతుండేవాణ్ణి. కానీ తను మళ్లీ నాకు మరో షాక్ ఇచ్చింది. ఒకరోజు ఫోన్‌చేసి తను పెళ్లి చేసుకుంటున్నానని, నాతో పెళ్లికి వాళ్లింట్లో ఒప్పుకోలేదని, తనను మరిచిపొవ్ముని చెప్పి ఫోన్ పెట్టేసింది. నాకు పిచ్చెక్కినట్లు అయ్యింది. అసలేంటీ ఆడవాళ్లు అనుకున్నాను.
ఆడజాతి వీుదే వెుుదటిసారి అసహ్యం వేసింది.
‘ఒకే.. వసును మరిచిపోదా’మని నిర్ణయించుకున్నాను.
కానీ పెళ్లికి పది రోజుల ముందే వాళ్ల కుటుంబమంతా యాదగిరి గుట్టకు దైవ దర్శనానికి వెళ్లారు. సుమో లో వెళుతుండగా అది అదుపు తప్పి బోల్తా పడి అందరికీ గాయాలు అయ్యాయి. వసుంధర కాలు విరిగింది. ఇక నడవలేదని చెప్పారు. దీంతో పెళ్లి క్యాన్సల్ అయ్యింది. నాకు ఆలస్యంగా విషయం తెలిసింది. కానీ వెళ్లాలనిపించలేదు. రెండుసార్లు నన్ను మోసం చేసిందన్న కోపమే దానికి కారణం.
రెండు నెలల తరువాత నాకు తిరిగి ఫోన్‌చేసి తనను తీసుకువెళ్లమంది. అప్పటికీ తనవీుద ప్రేమ తగ్గలేదు. కానీ నన్ను రెండుసార్లు పూల్‌ను చేసిన తనను ఇష్టం వచ్చినట్లు తిట్టాను. అదికూడా తన మనసు ఇప్పటికైనా ఒక మాటవీుద ఉంటుందనే ఉద్ధేశంతో మాత్రవేు.
అయితే నా మాటలను తప్పుగా ఆర్థం చేసుకున్న వసుంధర వారం రోజుల పాటు భోజనం చేయకుండా ఏడ్చిందట. వారం తరువాత నాకు తిరిగి ఫోన్ చేసింది.
“ఒక్కసారి వచ్చిపోవా? నిన్ను చూడాలని ఉంది” అంటూ ఏడ్చింది. సరేనని వెళ్లాను. వాళ్లింటికి దూరంగా నిలబడి కనిపించాను. నన్ను చాలాసేపు చూసింది. చేతిలో కర్రతో నిలబడిన ఆమెను చూడలేకపోయాను. బాధనిపించింది.
అయినా ఆమె మీద ప్రేమ తగ్గలేదు. ఎలాగైనా తనను నాతో తీసుకెళ్లాలనుకున్నాను. సాయంత్రం వరకు మా ఇంట్లోనే ఉన్నాను. సాయంత్రం ఆరు అమతుందనగా వారింట్లో ఏడుపులు, అరుపులు మొదలయ్యాయి. ఏం జరిగిందా? అని మా ఇంట్లోవాళ్లందరం బయటకు పరిగెత్తాం. జనం పోగయ్యారు. వారిలో ఎవరో అంటున్నారు వసుంధర ఆత్మహత్య చేసుకుంది అని. అంతే నా కళ్లముందు ప్రపంచమంతా చీకటిగా మారుతున్నట్లనిపించింది. కళ్లు బైర్లు కమ్మాయి.
కళ్లు తెరిస్తే ఆసుపత్రిలో ఉన్నాను. కోలు కోవడానికి నెలకు పైగా పట్టింది. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సిన వసు స్మశానానికి వెళ్లింది. ఒక యాక్సిడెంట్ ఆమె జీవితాన్నే నాశనం చేసింది. అంతే కాదు. తన మనసు మార్చడానికి నేను ఆడిన ఒక అబద్ధం కూడా అందుకు కారణమైంది. నన్ను మోసం చేసింది కనుకే పాపం అనుభవించిందని కొందరు, నా వల్లే చనిపోయిందని కొందరూ ఇలా ఎవరికి వారే అనుకుంటున్నారు. ఏదేమైనా నేను ప్రేమించడమే నేరమైంది.
అలాంటపుడు నేనేందుకు బతికుండాలి. అందుకే నా బతుకే బాగాలేదను కుంటున్నాను. ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు. బతికినన్ని రోజులు మాత్రం తన జ్ఞాపకాలతో బతుకుతాను” అంటూ లేచాడు.
నేను ఆయనకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. సమయం రాత్రి పన్నెండు కావస్తోంది. ఆయన లేచి నిలబడి నోరు తెరుచుకు చూస్తున్న నన్ను ‘వెళుతున్నా’ అన్నట్లు చూసి ముందుకు కదిలాడు.
నేను ఆయన ఆయన వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాను.
***సమాప్తం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
పేరు: మధుకర్ వైద్యుల
తండ్రి పేరు: సుధాకర్
చదువు: ఎం.ఎ, పీజీడీసీజే
రచనలు: స్వతంత్రసుమాలు ( కవిత్వం)-2014, నువద్ధి(కథలు)-2021, బొగ్గుపూలు (కవిత్వం)-2021, వలపోత (కరోనా కవిత్వం)-2022,
జర్నలిస్టు, కవి, రచయితగా
మధుకర్ వైద్యుల అను నేను జర్నలిస్ట్గా, కవిగా, రచయితగా వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలందిస్తున్నాను. ఆయా రంగాల్లో నా ప్రతిభకు తగిన గుర్తింపు కూడా పొంది ఉన్నాను. ఆయా రంగాలకు సంబంధించి పూర్తి వివరాలు.
కవిగా....
నా పదమూడవ ఏటా తొలిసారి కవిత రాశాను. నేను ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలో మా స్కూల్ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా తీసిన ‘శాంతికిరణం’ అనే పాఠశాల మ్యాగజిన్కు ‘జ్ఞాపిక’ అనే కవిత తొలిసారి రాశాను. అప్పటి నుంచి నిరంతర కవితా ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటర్లో ఉండగా కాలేజీ మ్యాగజిన్ ‘దర్శన’ కోసం ‘వరకట్న పిశాచాలు’ అనే కవిత, ‘అమ్మకావాలి’ అనే కథ రాశాను. ఆ తరువాత అనేక పత్రికలు, మ్యాగజిన్లు, ప్రత్యేక సంచికల్లో నా కవితలు ప్రచురితమయ్యాయి. నా రచనలకు గాను 2005-06 సంవత్సరానికి గాను జిల్లా యువజన సంక్షేమ శాఖ ఉత్తమ యువ రచయిత అవార్డు అందుకున్నాను. ఇక నేను రాసిన కవితలతో 2014 సంవత్సరంలో ‘స్వతంత్ర సుమాలు’ పేరుతో కవితా సంపుటి తీసుకు వచ్చాను. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్రెడ్డిలు ఈ పుస్త కాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ వెలు వరించిన ‘తంగేడువనం’, ‘తొలిపొద్దు’ కవితా బకవుల సంకలనంలోనూ నా కవితలు అచ్చయ్యాయి. రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య తీసుకువచ్చిన ‘వినియోగం’, చెన్నైకి చెందిన మాడభూషి సంపత్కుమార్ స్వర్గీయ అబ్దుల్కలాం మీదా తీసుకువచ్చిన ‘ఒకవిజేత’ ఇలా పలు కవితా సంకలనాల్లో నా కవితలు అచ్చయ్యాయి.
రచయితగా......
కవితలతో పాటు నాటికలు, కథలు రాయడం కూడా చిన్నతనం నుంచే అలవాటయ్యింది. నేను పదవతరగతిలో రాసిన ‘పేరులోనేముంది’ అనే హాస్యనాటిక అనేక వేదికల మీదా ప్రదర్శించబడి పలువురి ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత పలు కథలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ‘ అమ్మకావాలి’, ‘బతుకు చిత్రం’, ఒక అమ్ము ఒక అభి’, ‘ప్రేమిస్తే’ ‘కడప టూ హైదరాబాద్ వయా అనంతపూర్ తదితర కథలు ప్రజాశక్తి, సూర్య దినపత్రికల్లో అచ్చయ్యాయి. 2015లో రాసిన ‘మా ఊరి జాడేది’ అనే కథకు గాను నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ సాహితివేత్త నోముల సత్యనారాయణ పేరుమీదా ఇచ్చే ‘నోముల కథా పురస్కారం’ అందుకున్నాను.
జర్నలిస్టుగా
నా 1996లో జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టిన నేను పాత్రికేయునిగా కోల్వాయిస్, చర్చ, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి దినపత్రికల్లో పాత్రికేయునిగా సేవలందించాను. ఆ తర్వాత సూర్య దినపత్రికలో సబ్ఎడిటర్గా చేరి ప్రతిభ చూసి అనతికాలంలోనే ఆదివారం అనుబంధం ఇన్చార్జ్గా, ఫీచర్స్ ఇన్చార్జ్గా పదోన్నతి పొందాను. ప్రస్తుతం నమస్తే తెలంగాణ దినపత్రికలో ఆదివారం అనుబంధం ‘బతుకమ్మ’లో సీనియర్ జర్నలిస్ట్గా సేవలందిస్తున్నారు. ఉద్యమసమయంలో ఎంతోమంది తెలంగాణ కళాకారులు, సామాజిక కార్యకర్తలను వెలుగులోకి తీసుకువచ్చి ఉద్యమానికి చేయూతనిచ్చాను. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక కథనాలతో అనేక కవర్స్టోరీలు రాస్తూ పలువురి మన్ననలు అందుకున్నాను.
అందుకున్న ఆవార్డులు
-డా. కాలువ మల్లయ్య సాహితీ స్పూర్తి పురస్కారం-2022
-ఫీచర సునీతారావు సాహితీ పురస్కారం-2022
-బి.ఎస్.రాములు సాహితీ ప్రతిభాపురస్కారం-2019
-తెలంగాణ సాహిత్య అకాడమీ కవితాసప్తాహం-2019
-రాష్ట్ర పర్యాటక శాఖ వారి టూరిజం ఎక్స్‌లెన్స్ ఆవార్డు-2018
-మధురవాణి డాట్.కం(అమెరికా) వారి ఉత్తమ కథా పురస్కారం-2017
-బండికల్లు వెంకటేశ్వర్లు మెమోరియల్ ట్రస్ట్ జాతీయ కవితల పోటీ-2017
-ప్రపంచ తెలుగు మహాసభల్లో మంత్రి డా౹౹ లక్ష్మారెడ్డితో సత్కారం-2017
-తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ వారి రాష్ట్రకవితల పోటీలో ద్వితీయ
బహుమతి-2017
-సామాజిక రచయితల సంఘం రాష్ట్రస్థాయి కవితల పోటీలో ద్వితీయ బమతి-2017
- తెలంగాణ సాహితీ వేదిక (కరీంనగర్) వారి రాష్ట్రస్థాయి కథల పోటీల్లో ద్వితీయ
బమతి-2016
- రాష్ట్ర పర్యాటక శాఖ వారి టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డు-2016
- చీటి జగన్రావు స్మారక జిల్లా ఆత్మీయ సేవా పురస్కారం -2016
- నోముల సత్యనారాయణ కథాపురస్కారం-2015
- జాగృతి కవితా పురస్కారం-2015
- కువైట్ ఎన్నారైస్ డాట్కం ఉత్తమ కవితా పురస్కారం-2015
- సాహితి సేవా ఉత్తమ కవితా పురస్కారం -2014
- జాగృతి కవితా పురస్కారం-2013
- నేషనల్ యూత్ ప్రాజెక్ట్ వారి బెస్ట్ యూత్ అవార్డు-2008
- జిల్లా యువజన సంక్షేమ శాఖ ఉత్తమ యువ రచయిత అవార్డు -2005-06
- ఫోక్ ఆర్ట్ అకాడమీ వారి గ్రామీణ కళాజ్యోతి అవార్డు-2004
- బెస్ట్ జర్నలిస్ట్గా పద్మపీఠం పురస్కారం-2003
- బెస్ట్ వాలంటరీగా శాతావాహన కళోత్సవాలలో సర్టిఫికెట్-2003
- శివజ్యోతి జానపద కళా మిత్ర మండలి వారి జిల్లా ఉత్తమ యువకవి అవార్డు-2002
- నెహ్రూ యువకేంద్రం సర్టిఫికెట్-2001
Comments