పూలకథ
- Peddada Sathyanarayana

- Aug 30
- 2 min read
#PeddadaSathyanarayana, #పెద్దాడసత్యనారాయణ, #Pulakatha, #పూలకథ, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Pulakatha - New Telugu Story Written By - Peddada Sathyanarayana
Published In manatelugukathalu.com On 30/08/2025
పూలకథ - తెలుగు కథ
రచన: పెద్దాడ సత్యనారాయణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“హాయ్ సుజాత! చాలారోజులకి దర్శనం,” అని ఆప్యాయముగా పలకరించింది సుమిత్ర. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు.
“సుమిత్ర, మీ ఇంట్లో ఏమయినా ప్రత్యేకమైన పూజ చేస్తున్నావా?”
“ఆబ్బే, అదేమీ లేదు. నీవు ఎందుకు అడుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు” అంది సుమిత్ర.
“నేను ఆటోలో వస్తుంటే మీవారు పూల దుకాణం దగ్గర ఉండగా చూసాను.” అంది సుజాత.
“ఆయనతో ఇంకెవరైనా ఉన్నారా?” అని ఆత్రుతగా అడిగింది సుమిత్ర.
“పక్కన ఎవరో స్త్రీ ఉన్నట్లు అనిపించింది,” అని చెప్పి, అరగంట సేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత సుజాత వెళ్ళిపోయింది.
యధాప్రకారం కేశవరావు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కాఫీ ఇవ్వకుండా, సుమిత్ర బెడ్‌రూంలో బట్టలు సూట్‌కేసులో సర్దుకుంటూ కనిపించింది.
“ఏమైంది? బట్టలు సర్దుకుంటున్నావు?”
“నాకేమీ కాలేదు. నేను ఉంటే మీ ప్రియురాలికి అడ్డముకదా,” అని కిచెన్‌లోకి వెళ్ళిపోయింది సుమిత్ర.
“నే చెప్పేది విను సుమిత్ర! మా ఆఫీస్‌లో ఒక కొలీగ్‌కి ప్రమోషన్ వచ్చింది. పార్టీ ఇచ్చాము.”
“మీరు చెప్పే కాకమ్మ కబుర్లు విని నమ్మేటంత వెర్రిదాన్ని కాదు. నేను మా ఇంటికి వెళ్లిపోతున్నాను,” అని సూట్‌కేసుతో సహా హాల్‌లోకి వచ్చింది సుమిత్ర.
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే—
“కేశవరావు ఉన్నారా అండి? నేను కొలీగ్ మోహన్,” అని లోపలికి వచ్చాడు. కేశవరావు హాల్‌లోకి వచ్చి పలకరించాడు.
“నీవు పార్టీ అయిన తర్వాత నీ బ్యాగ్ మర్చిపోయావు,” అని కేశవరావుకి ఇచ్చాడు.
“థాంక్యూ,” అని కేశవ్ బ్యాగ్ తీసుకుని, “కూర్చోండి. కాఫీ తెమ్ము,” అన్నాడు సుమిత్రని. సుమిత్ర రుసరుసలాడుతూ కిచెన్‌లోకి వెళ్లబోతుంది.
“మన ఆఫీస్ పార్టీ పిక్స్ నీకు షేర్ చేశాను. చూసుకున్నావా?” అని అడిగాడు మోహన్.
“లేదు మోహన్,” అని చెప్పి, కేశవ్ సెల్ కోసం కిచెన్‌లోకి వెళ్ళాడు. అక్కడ సుమిత్ర సెల్‌లో ఉన్న పార్టీ వీడియో చూడటం గమనించి తిరిగి హాల్‌లోకి వచ్చాడు.
“అన్నయ్యగారు, కాఫీ టిఫిన్ తీసుకొస్తాను,” అని నవ్వుతూ మోహన్‌కి చెప్పి కిచెన్‌లోకి వెళ్లిపోయింది.
“కేశవ్, చెల్లమ్మ అరగంట క్రితం సీరియస్‌గా ఉండి ఇప్పుడు నవ్వుతోంది,” అని మెల్లగా కేశవ్‌తో అన్నాడు మోహన్.
“కారణం తర్వాత చెబుతాను. ఎవరైనా అబద్ధాన్ని నమ్మినంత తొందరగా నిజాన్ని నమ్మరు,” అన్నాడు కేశవ్.
“నాకర్థమయ్యింది,” అని మోహన్ కాఫీ తాగి వెళ్లిపోయాడు.
***
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.




Comments