top of page

పున్నమి రాత్రి


'Punnami Rathri' New Telugu Story



(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఆదివారం ఉదయాన్నే లేచిన కొడుకుని "అప్పుడే ఎందుకు లేచావు, కాసేపు పడుకో.. సెలవే గా" అన్నాడు త్రినాధ్ రావు.


"లేదు డాడీ, నేనూ మా ఫ్రెండ్స్ కలిసి కారులో శ్రీశైలం రోడ్డులో వున్న వాటర్ఫాల్స్ చూడటానికి వెళ్తున్నాము" అన్నాడు శశి.


"ఒరేయ్! అంతదూరం కారులో ఎందుకు, కావాలంటే ఏ సినిమా కో వెళ్ళండి. అసలే అమ్మ అమెరికా లో వుంది. కారులో నిన్ను పంపించానని తెలిస్తే గొడవ పెడుతుంది" అన్నాడు త్రినాద్ రావు కొడుకు తో.


"సరే డాడీ, మిమ్మల్ని కారులో మీ ఆఫీసులో దింపేసి నేను కారు తీసుకువెళ్తాను. రిటర్న్ లో మిమ్మల్ని పికప్ చేసుకుంటాను" అని అన్నాడు.


'వాడి పంతం వాడిది, కూతురు చాలా భయస్తురాలు, వీడికే ఈ దుందుడుకు స్వభావం వచ్చింది' అనుకుని, తను కూడా త్వరగా తయారై ఆఫీస్ లో దిగి, కారు కొడుకు కి యిచ్చి, "జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి, స్పీడ్ వద్దు" అని చెప్పి పంపించాడు.


రాత్రి 7గంటలు అయినా కొడుకు తనని తీసుకువెళ్ళడానికి రాలేదు సరికదా, ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. త్రినాధ్ రావు కి కంగారు పుట్టింది. 9 అయింది, ఆఫీస్ లో తను తప్ప ఎవరూ లేరు. కొడుకు మీద విపరీతంగా కోపం, ఏమైందో అని భయం తో సతమత పడుతావుండగా, కొడుకు నుంచి ఫోన్ వచ్చింది. "డాడీ, car కి ఆక్సిడెంట్ అయింది, మాకు ఏమి దెబ్బలు తగలలేదు, కానీ కారు బాగా దెబ్బతింది. కదలడం లేదు" అన్నాడు.


"ఎక్కడ జరిగింది?" అని అరిచాడు త్రినాధ్ రావు.


"శ్రీశైలం అడివిలో జరిగింది" అన్నాడు బయపడుతో.


"అక్కడికి ఎందుకు చచ్చావ్, నువ్వు సినిమా కి అని శ్రీశైలం ఎందుకు వెళ్ళావు? "అన్నాడు కోపం పట్టలేక కొడుకుతో.


అటునుంచి జవాబు లేదు. ఏమిచేయాలో పాలుపోక, చివరికి తన వనపర్తి ఆఫీస్ ఇంజనీర్ కి ఫోన్ చేసి, జరిగింది చెప్పి, "ఎలాగైనా వాళ్ళని మీ దగ్గర కి తెప్పించండి" అని అడిగాడు త్రినాధ్ రావు.


ఆఫీస్ లో మంచి పేరు వుండటం తో, త్రినాధ్ రావు అడగగానే, ఆ ఇంజనీర్, "కంగారు పడకండి రావు గారు, పిల్లలు కి ఏమి కాలేదుగా.. నేను ఆ రోడ్డు కాంట్రాక్టర్ ని పంపి మీ పిల్లలు ఎక్కడ వున్నారో తెలుసుకుని, సేఫ్ ప్లేస్ లో రాత్రి కి వుంచుతాను" అన్నాడు.


యిహ అక్కడ త్రినాధ్ రావు కొడుకు శశి, అతని ఫ్రెండ్స్ పరిస్థితి.. రాత్రి 7 గంటలకు దర్శనం పూర్తి చేసుకుని, కరి వేన సత్రం లో టిఫిన్ కడుపునిండా తిని, హుషారుగా బయలుదేరారు నలుగురు స్నేహితులు. కారు శశి నడుపుతున్నాడు. సినిమా పాటలు పాడుకుంటూ, ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. కారు 80 కిలోమీటర్లు స్పీడ్ లో డ్రైవ్ చేస్తున్నాడు శశి.


కారు అడివిలో కి ప్రవేశిస్తోవుండగా, శశి సీట్ బెల్ట్ పెట్టుకుంటూ, తన స్నేహితులు ని కూడా హెచ్చరించాడు సీట్ బెల్ట్ పెట్టుకోమని. కారు రోడ్డు మలుపులతోపాటు మెలికలు తిరుగుతో స్పీడ్ గా వెళ్తోంది. ఇంతలో రోడ్డు మీదకి ఒక ఎలుగుబంటి సడన్ గా రావటం తో కంగారుగా శశి కారుని ఎడమ వైపు కి తిప్పడం తో మంచి స్పీడ్ లో వున్న కారు ఒక్కసారి గా రోడ్డు పక్కకి పల్లం లోకి దిగి వెళ్ళి చెట్టుకి కొట్టుకుని ఆగిపోయింది. అదృష్టం కొద్దీ ఎవరికి గాయాలు కాలేదు.


కారు తలుపులు తీసుకొని క్రిందకి దిగి చూస్తే కారు ముందు భాగం లోపలికి వెళ్ళిపోయింది. టైర్ ఒకటి వూడిపోయింది.

షాక్ లో నుంచి ముందుగా శశి తేరుకుని, స్నేహితులు కి దెబ్బలు తగలలేదు అని తెలుసుకుని, తండ్రికి ఫోన్ చేసి బయపడుతో జరిగింది చెప్పాడు.


తండ్రి 'ఎవరినైనా సహాయం కోసం పంపుతాను, అక్కడే వుండ'మనటంతో చేసేదిలేక రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు శశి, అతని స్నేహితులు.


పౌర్ణమి అవటం తో నిండు చంద్రుడు పెద్ద పెద్ద చెట్ల మధ్య నుంచి వెన్నెల కురిపిస్తున్నాడు. ఆ రోడ్డు మీద ఈ నలుగురు తప్ప జన సంచారం లేదు. సత్రం లో తిన్న గోధుమ రవ్వ ఉప్మా ప్రమాదం తో అరిగిపోయి ఆకలి మొదలైంది నలుగురికి.


వెన్నెల గానే వుండటంతో అడివిలోకి వెళ్తే ఏమైనా పళ్ళు దొరుకుతాయేమో అని నలుగురు నాలుగు కర్ర ముక్కలు పట్టుకుని బయలుదేరారు. ఒక కిలోమీటర్ దూరం వెళ్లే సరికి వెన్నెల లో ఆనందం తో పురి విప్పి ఆడుతున్న నెమళ్ళు కనిపించాయి. అదుభతమైన ఆ నాట్యం చూస్తోవుంటే వొళ్ళు మరిచిపోయారు. అలాగే ఒక చెట్టుకింద కూర్చొని ఆ నెమళ్ళ నాట్యం చూస్తోవుండగా, వాళ్ళ వొళ్ళో రెండు అరటిపళ్ళు పడ్డాయి చెట్టు మీద నుంచి. తలెత్తి చూస్తే రెండు నామాలకోతులు వీరివంక చూస్తో యికిలిస్తున్నాయి.


ఆ హనుమంతుడే ఈ రూపం లో తమ ఆకలి తీర్చుతున్నాడనుకుని ఆ రెండు అరటి పళ్ళు సగం సగం తిని, అక్కడే పారుతున్న చిన్న నీటి పాయ లో చల్లటి నీరు తాగి, తిరిగి కారు దగ్గరికి బయలుదేరుతో శశి అన్నాడు , ఆక్సిడెంట్ అయితే అయ్యింది కానీ ఈ నెమళ్ళ నాట్యం, మనుషులు కంటే మేమే నయ్యం అన్నట్టు గా ఆ నామాలకోతులు అరటిపళ్ళు పడేయటం "యిది మనకి మధురమైన జ్ఞాపకమిది జీవితాంతం మరచిపోను "అనగానే నిజమే రా, ఈ అడవిలో వుండే వాళ్ళు పట్నం లో వుండటానికి యిష్టపడకపోవటం, ఈ అందాలు వదులుకోలేక " అన్నారు.


కారు దగ్గరకి వచ్చే సరికి కారు దగ్గర ఒక జీపు, దానికి దగ్గర నిలబడి యిద్దరు టార్చి లైట్ వేస్తో చుట్టుపక్కల వెతుకుతో కనిపించారు. వాళ్లే డాడీ పంపించిన కాంట్రాక్టు ఉద్యోగులు అని తెలుసుకుని, కారు ని చెట్టు పొదలలోకి త్రోసి, వారి జీపులో బయలుదేరారు. ఆ కాంట్రాక్టర్ వీరిని దగ్గర లో వున్న ఒక ఫారెస్ట్ గార్డ్ రూంకి తీసుకుని వెళ్ళి అతనితో మాట్లాడి ఆ రాత్రికి ఈ నలుగురు కి బస ఏర్పాటు చేసాడు.


పాపం మళ్ళీ ఉదయమే ఒక లారీలో కూలీలను తీసుకువచ్చి, కారు ని లారీలోకి ఎక్కించి, వీళ్ళని కూడా అదే లారీ లో హైదరాబాద్ పంపించాడు.

యింకా మిగిలింది ఏముంది..శశి యింటికి చేరిన తరువాత తండ్రితో తిట్లు తప్పా!


... శుభం.....

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link


Twitter Link



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







22 views0 comments
bottom of page