top of page
Original_edited.jpg

పూతన సంహారం

  • Writer: Sudha Vishwam Akondi
    Sudha Vishwam Akondi
  • 6 hours ago
  • 1 min read

#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguDevotionalStories, #తెలుగుభక్తికథలు, #PuthanaSamharam, #పూతనసంహారం

ree

పూతన సంహారం: పోతన భాగవత పద్యం

Puthana Samharam - New Telugu Story Written By Sudhavishwam Akondi Published In manatelugukathalu.com On 17/11/2025 

పూతన సంహారం - తెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి

"గుబ్బాగుబ్బయిన కూత గూలెన్ నేలన్! విషధరరిపు గమనునికిని విషగళ సఖునికి విమల విషశయనునికిన్ విషభవభవ జనకునికిని విషకుచ చనువిషము గొనుట విషమే తలపన్!" 

 

పూతనా సంహార ఘట్టంలో పోతనగారి అద్భుతమైన పద్యం ఇది.


వివరణ: 

విషధరరిపు గమనునికిని అంటే విషాన్ని కలిగిన పాములకు శత్రువు అయిన గరుత్మంతుడిని ఎక్కి తిరిగేవాడికి, విషగళ సఖునికి అంటే విషాన్ని కంఠంలో ధరించిన శివునికి స్నేహితుడైన వాడు, విమల విషశయనునికిన్ అంటే స్వచ్చమైన తెల్లని తెలుపులో ఉన్న శరీరం కలిగి, విషాన్ని తనలో కలిగిన వాడైన ఆదిశేషుని శయ్యగా చేసుకుని పడుకునేవాడికి, విషభవభవ జనకునికిని అంటే విషం అంటే ఇక్కడ బురద. బురదలో నుండి జన్మించిన తామరపువ్వులోనుంచి పుట్టిన బ్రహ్మకు తండ్రి అయినవాడికి, విషకుచ చనువిషము గొనుట విషమే తలపన్ అంటే విషంతో నిండిన ఆ రాక్షసి స్తనం ద్వారా వచ్చే విషం ఏం చేయగలదు..?  అందుకే  పాలు త్రాగుతున్నట్లుగా నటిస్తూ, ఆ రాక్షసి ప్రాణాలు అన్నీ లాగేసాడు పసివాడిలా కనిపిస్తున్న ఆ పరాత్పరుడు.


శ్రీకృష్ణార్పణమస్తు



ree

-సుధావిశ్వం





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page