రైతన్న తడాఖా

'Raithanna Thadaka' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 16/10/2023
'రైతన్న తడాఖా' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
క్రిష్ణయ్య చనిపోయాక తనతో ఏడడుగులు వేసిన శాంతమ్మ కూడా చనిపోవడంతో శోకసంద్రంతో తల్లిదండ్రులు అంత్యక్రియలు చేశాడు శంకరయ్య.
క్రిష్ణయ్య కు ఉన్న 20ఎకరాలు భూమి మరియు విశాలమైన భవంతి ఏకైక కుమారుడు అయిన శంకరయ్య పేరనే ముందే రాసేశాడు క్రిష్ణయ్య.
ఆస్థి అంతా శంకరయ్యకు దక్కింది.
తనకు కూతురు గారాలా పట్టీ సంద్యారాణి ఉంది. ఆమె పెళ్ళి వయస్సు లో ఉన్నా.... ఇన్నాళ్లు పెళ్ళి చేసుకోలేదు. నాన్నమ్మ తాతయ్యలు పోయాక మరో ఏడాది ఆగవల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక శంకరయ్య ఇన్నాళ్లు ఆస్థి అంతా తండ్రి పేరానా, తండ్రి ఆలోచనలతో నడవటంతో కేవలం క్రిష్ణయ్య పేరు చుట్టుపక్కల తప్ప అంతగా ఎవరికి తెలియదు.
ఇప్పుడు శంకరయ్యకు ముట్టడంతో తన ఆలోచనలకు పదును పెట్టాడు.
మొదట రెండు ఎకరాల్లో తన తల్లిదండ్రుల పేరుతో ఒక స్మృతివనం, పార్కు ఏర్పాటుచేసి పర్యాటకులకు ఉచిత సందర్శన కల్పించాడు.
మిగిలిన భూమిని కేవలం వ్యవసాయం చేసి వరి పంటతో వచ్చే ధాన్యంను తానే విత్తనాలు తయారుచేసే పరిశ్రమ ఒకటి, బియ్యం పరిశ్రమ ఒకటి పెట్టించి తన ఆస్థులను ఏడాది కాలంలోనే పెంచుకుని దేశం అంతటికి తన పేరుతో బియ్యం ప్యాకెట్లు, నాణ్యమైన విత్తనాలు సరాఫరా చేయటం, మరలా వ్వయసాయం చేయటం ఇదే అతని పని.
దేశంలో పెద్ద పెద్ద మార్కెట్లుకు కూడా శంకరయ్య పరిశ్రమలు నుంచి భారీగా అమ్మకాలు జరిగేవి.
వ్వయసాయంలో మంచి పద్దతులు వినియేగించటంతో నాణ్యమైన బియ్యం, విత్తనాలు సరాఫరా చేసే వ్యక్తిగా శంకరయ్య పరిశ్రమలకు పేరు ఉంది.
ఇలా ఏడాది దాటిపోగా శంకరయ్య కూతురు కి తగిన జోడిని కూడా వెతికాడు. అప్పటికే కూతురు పెళ్ళి పై కలలు కన్న శంకరయ్య ఆలస్యం చేయకుండా పట్టణానికి చెందిన ఒక ఆర్మి జవానుతో ఘణంగా పెళ్ళి చేశాడు. ఇక తన ప్రాణం పట్టణానికి పోయిందని కొన్నిరోజులు విచారంలో మునిగిపోయాడు.
వ్వయసాయాన్ని, పరిశ్రమలను చూసుకోటానికి కూలీలు, సూపర్వైజర్లు ఉండటంతో ఎప్పుడూ కూతురుని చూసేందుకు పట్టణం పోతు వస్తు ఉండేవాడు శంకరయ్య. పట్టణం పోయినా తన వాలకంలో మార్పులు చేసుకోడు శంకరయ్య. ఎప్పుడు కూడా తెల్లని పంచే, తెల్లని చొక్కాతో తలపాగా చుట్టుకునే తాను అక్కడ ఎలా ఉంటాడో ఎక్కడ అయినా అలాగే ఉంటాడు
ఒకరోజు ఎప్పటిలాగే కూతురు ఇంటికెళ్లి తిరిగి వస్తుండగా..
తాను ప్రయాణించాల్సిన రైలు ఎక్కడో ప్రమాదం జరగటంతో కాస్త ఆలస్యంగా వస్తుందని తెలుసుకుని మరలా అక్కడ నుండి కూతురు ఇంటికి రెండు గంటల బస్సు ప్రయాణం ఎందుకని స్టేషన్లోనే ఉండిపోయాడు శంకరయ్య
ఆ రోజు మధ్యాహ్నం ఎండ బాగా కాస్తున్నందున ఎటు పోకుండా స్టేషన్లోనే కాలక్షేపం చేశాడు. బోజనం సమయం మించటంతో స్టేషన్ కి ఆనుకుని ఒక భారీ ఫైవ్ స్టార్ హొటల్ ఉంది. అది చూసి అందులోకి వెళ్ళాడు. అందులో బాగా డబ్బుగలవారే తప్ప సామాన్యులు కనపడరు. పైగా అక్కడ బోజనం రేట్లు ఆకాశానికి అంటుతాయి.
అయినా శంకరయ్య దర్జాగా అక్కడ ఉన్న ఒక సింగిల్ టేబుల్ పై కూర్చున్నాడు.
అది చూసిన వెయిటర్లు ఓనర్ కి విషయం చెప్పారు.
ఓనర్ వచ్చి శంకరయ్య వాలకం చూసి " నీ వద్ద డబ్బులు ఉన్నాయా.. ? అంటూ శంకరయ్యని లేపి బయటకు తీసికెళ్ళి
"నువ్వు బోజనం చేయాలన్నా, ఏమైనా తినాలన్నా అక్కడ చాలా చిన్న చిన్న హొటల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి తిను" అన్నాడు.
తన పేరు పై ఫైవ్ స్టార్ హోటల్ పెట్టుకున్న ఆ ఓనర్ తననే గుర్తు పట్టకుండా అవమానించటం అతనికి నచ్చలేదు. సరికదా తాను దేశం నలుమూలలా బియ్యం, విత్తనాలు సరాఫరా చేసే శంకరయ్య నని చెప్పటానికి మనసు రాలేదు. వారికే బోదపడేలా చేద్దామని అటూ ఇటూ చూశాడు.
చుట్టుపక్కలా ఎంతోమంది బిచ్చగాళ్ళు, ట్రాన్స్జెండర్లు, పేదవారు, రైలు ఆలస్యంతో ఏమి తినకుండా ఉండే ప్రతి ఒకరిని పిలిచి, "తమకు ఉచితంగా బోజనం పెడతా" నని చెప్పి ఆ హోటల్ కి తెచ్చాడు.
ఓనర్ వద్దకు వెళ్ళి పదిలక్షల రూపాయలు చెక్కు రాసి ఇచ్చి వెంటతెచ్చిన జనాన్ని హోటల్లోకి ఆహ్వానించాడు.
అది చూసి ఓనర్ కి ఏదో అనుమానం కల్గింది. తనకు బుద్ధి చెప్పటానికి ఇలా చేసి ఉండొచ్చు కానీ ఒక రైతుకి ఇంత డబ్బు ఎక్కడిది అనుకుంటు, చెక్కు పై సంతకం చూసిన ఓనర్ కి తెలివి వచ్చింది.
వెంటనే తన రైస్ ప్యాకెట్లు నిల్వచేసిన రూంకి వెళ్ళి ప్యాకెట్ కవర్ పైన ఫొటో చూసి చెమటలు కక్కుతూ వస్తాడు.
శంకరయ్య పరిశ్రమ నుండే తన హోటల్ కి బియ్యం ప్యాకెట్లు కొంటున్నా శంకరయ్య ని గుర్తు పట్టలేదు, అతని రాక ఊహించక రైతు అని చిన్నచూపు చూసినందుకు పెద్ద
తప్పే జరిగిందని మనసులో అనుకుంటూ కూర్చున్నాడు.
వారందరూ బోజనం చేస్తుండగా శంకరయ్య మాత్రం చిన్న చిరునవ్వుతో తింటూ ఓనర్ ని ఒక కంట కనిపెడుతూ అతని టెన్షన్ గమనించాడు.
చాలసేపటి వరకు తృప్తిగా బోజనం చేసి అందరూ శంకరయ్య కు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయారు. శంకరయ్య తాను ఇంకా కావల్సినవి తెప్పించుకుని తిన్నాడు.
వెయిటర్లు అందరికీ వడ్డించి చెమటలు కక్కారు.
శంకరయ్య బయటకు వెళ్తూ... హోటల్ ముందు ప్రచారం కోసం తన ఫొటో తో ఉన్న, తన పరిశ్రమ నుండి వచ్చిన బియ్యం ప్యాకెట్ చూసి కాస్తా దూళి ఉండటంతో తన తలపాగా తీసి దూళి లేకుండా కొట్టాడు. అది చూశాక ఓనర్ పరిగెత్తుకుంటు వచ్చి క్షమాపణ చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు.
"తమరెవరో తమ రాక ఊహించలేద"ని, “జీవితంలో ఎప్పుడు అలాంటి తప్పు చేయ”నని వేడుకున్నాడు.
"ఏసి రూంలో దర్జాగా హొటల్స్ నడుపుతున్నవారు.. రైతులు అక్కడ ఎంత కష్టపడుతున్నారో తెలుసుకోలేక పోతున్నారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా రైతు అవమాన పడాల్సి వస్తుంది.
ఒకసారి రైతులు గానీ లాక్ డౌన్ చేస్తే.... పిడికెడు మెతుకుల కోసం పోటి తప్పదు గుర్తుపెట్టుకోండి "అంటూ, రైలు కూత వినిపించగా, ముందుకు కదిలాడు శంకరయ్య.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
Profile:
https://www.manatelugukathalu.com/profile/gopi/profile
Youtube Playlist:
https://www.youtube.com/playlist?list=PLUnPHTES7xZr6ydmGx54TvfeVNu5lRgUj
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం