top of page
Original.png

రాజు ఉపాయం!

54 minutes ago
3 min read

అవినీతిని అరికట్టేందుకు మంత్రులు, ఉద్యోగులకు కఠిన ఆదేశాలు జారీ చేస్తున్న రాజు నరసింహుడు – రాజు ఉపాయం నీతి కథ.

Raju Upayam! - Telugu Moral Story | Purushotham Boga

రాజు ఉపాయం! - తెలుగు నీతి కథ | బోగా పురుషోత్తం

Published in manatelugukathalu.com on 04/11/2026


రాజు ఉపాయం! బోగా పురుషోత్తం రచించిన ఈ చక్కని నీతి కథ అవినీతి, లంచగొండితనాన్ని అరికట్టడంలో నిజాయతీగల పాలన ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ప్రజాసేవే పరమావధిగా భావించే నాయకత్వం సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురాగలదో ఈ కథ ద్వారా తెలుసుకుందాం.


శింగరాయకొండను నరసింహుడు పాలించేవాడు. నరసింహుడు ఉగ్రస్వభావి. తన పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భావించేవాడు. 


తన పాలనలో ఎక్కడా ఎలాంటి లోపాలు కనిపించకూడదని కోరుకునేవాడు. అయితే రాజ్యంలో అవినీతి పెరిగి ప్రజలు సమస్యలతో సతమతమయ్యేవారు. 


ఇది చూసి రాజుకు కంటిమీద కునుకు కరువైంది. పరిపాలనను ప్రక్షాళన చేయాలనుకున్నాడు.


ఓ రోజు అన్ని శాఖల మంత్రులను పిలిచి, "నా పాలనలో లంచగొండితనం రాజ్యమేలుతోంది... దీన్ని కూకటివేళ్లతో సహా పెకళించండి. ప్రజలకు సుఖశాంతి కల్పించండి... ఇది మన బాధ్యత!" అని ఆదేశించాడు.


"అలాగే తప్పకుండా చేద్దాం ప్రభూ!" అన్నారు మంత్రులు.


ఆర్థిక మంత్రి ఆనందయ్య అవినీతి ఎక్కడ ఉందో కనుక్కున్నాడు. తన కళ్ల ముందే ఓ రెవెన్యూ అధికారి భూమి కోసం నిరుపేద వద్ద ఉన్న ఇల్లు అమ్మివేయించి రెండు లక్షల రూపాయలు లంచం తీసుకోవడం చూశాడు. 


మరుసటి రోజు ఆ అధికారిని పిలిపించి, "లంచం తీసుకోవడం నేరం... నీ పద్ధతి మార్చుకో" అని హెచ్చరించాడు. నెల రోజులైనా ఆ ఉద్యోగి తన ప్రవర్తన మార్చుకోలేదు. ఎంత కట్టడి చేసినా అరికట్టడం మంత్రి వల్ల కాలేదు.


న్యాయశాఖా మంత్రి నరేంద్రుడు తన శాఖలో లంచగొండితనం పెరిగిందని గుర్తించాడు. 


నిజాయతీగా తీర్పులు ఇవ్వాల్సిన న్యాయాధిపతులు లంచం రుచి మరిగి తీర్పులను తారుమారు చేయడం గమనించి, "ఇది అన్యాయం... పద్ధతి మార్చుకుని ధర్మం వైపు నిలబడండి" అని హితవు పలికాడు. 


అయితే లంచగొండితనం రూపుమాపలేకపోయాడు.

మళ్లీ రాజు రెండు నెలల తర్వాత సమావేశమయ్యాడు.


మంత్రులు నీళ్లు నమిలి, "ప్రభూ! లంచాన్ని అరికట్టడం మా వల్ల కాలేదు..." అంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు.


ఇక చేసేదేమీ లేక రాజే స్వయంగా రంగంలోకి దిగాడు. మారువేషంలో రాజ్యం అంతా తిరిగి ఉద్యోగుల్లో పెరిగిన లంచగొండితనాన్ని రూపుమాపడంపై దృష్టిపెట్టాడు. 


తన కళ్ల ఎదుటే ప్రజలు తమ సమస్యలు రాజుగారికి చెప్పుకోవడానికి వెళ్లేందుకు కూడా లంచం తీసుకోవడం గుర్తించాడు.


రాజ్యం మొత్తం తిరిగి మంత్రులను సమావేశపరిచి ఉద్యోగులను మూడు రకాలుగా విభజించాడు. సమర్థులు, అసమర్థులు, సోమరులు అని మూడు రకాలుగా వర్గీకరించాడు.


ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించే ఉద్యోగులకు వేతనం పెంచాడు. అసమర్థతతో లంచం తీసుకుని అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగుల జీతంలో సగం కోత పెట్టి, ప్రభుత్వం కల్పించే సౌకర్యాలన్నింటినీ ఆపివేశాడు. 


చివరగా పూర్తిగా లంచగొండితనానికి అలవాటుపడి ప్రజలను సమస్యలకు గురిచేస్తున్న సోమరులను ఉద్యోగం నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు.


రాజు ఆదేశంతో అసమర్థులైన ఉద్యోగులు తమ పనితీరు మార్చుకుని నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయసాగారు. సమర్థులు సైతం మరింత నిజాయతీగా పనిచేయసాగారు. 


రాజు నరసింహుడు ఉపాయంతో పాలనలో తెచ్చిన మార్పుతో ప్రజలు సుఖశాంత్రులతో జీవించారు.


***


మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


బోగా పురుషోత్తం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 







మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



బోగా పురుషోత్తం

పరిచయం: బోగా పురుషోత్తం https://www.manatelugukathalu.com/profile/purushotham/profile

1997 నుంచి బాలల కథలు రాస్తున్నాను. కార్టూన్లు గీస్తున్నాను.  1998లో నేను ప్రజాశక్తి, విశాలాంధ్ర దినపత్రికలలో ఎడిటోరియల్ కార్టూన్లు గీశాను. ఇప్పటి దాకా ప్రజాశక్తి, విశాలాంధ్ర వార్త, ఆంధ్రజ్యోతి వార పత్రికతో పాటు వివిధ వార, మాస పత్రికలలో 2 వేల కార్టూన్లు ప్రచురితమయ్యాయి. కథలు సైతం 150 దాకా రాశాను. అందులో అన్ని కథలు బుజ్జాయి, బాలజ్యోతి, బాలమిత్ర, మొలక, ఈనాడు (హాయ్ బుజ్జీ), ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, వార్త, సాక్షి, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి, విశాలాంధ్ర, వి6 వెలుగు దినపత్రికల ఆదివారం అనుబంధం లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ప్రజాశక్తి దినపత్రిక తిరుపతి డెస్క్ లో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను..






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page