రక్షాబంధన్
- Yasoda Gottiparthi
- Aug 9
- 1 min read
#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #రక్షాబంధన్, #Rakshabandhan

Rakshabandhan - New Telugu Poem Written By Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 09/08/2025
రక్షాబంధన్ - తెలుగు కవిత
రచన: యశోద గొట్టిపర్తి
💐🌺రక్షాబంధన్💐🌺
బంధాన్నిభగవంతుడు కలిపేను
అనుబంధాన్ని అమ్మ తెలిపేను
అన్నా, చెల్లెలు, అక్క, తమ్ముడి అనురాగానికి
పుట్టుక బంధమని అపురూప ప్రేమనీ తెలిపేను
స్నేహానికి ప్రతి రూపం రక్షాబంధన్
ఎన్ని కష్టాలెదురైనా అన్నే చెల్లెలుకు ధైర్యం,
అక్కకు తమ్ముడు బలం,
అన్న, తమ్ముడి క్షేమం కోసం
సోదరి కట్టును రక్షాబంధనం అందుకొనును దీవెనలు
కలకాలం సంతోషం కోసం
చిన్న నాటి పోట్లాటలు,
అలకలు, గిల్లి కజ్జాలు
పెద్దతనం మమకారానికి
మంత్రాలు
జయాలు అపజయాలు ఎదురైనా అక్కా చెల్లి ప్రేమ
ముందు దిగ దుడుపే
అనంత మయినది
అన్నయ్య ఆత్మీయత,
తరగని ప్రేమ తమ్ముడి తోడు కు ప్రతీకగా నిలిచేదే రాఖీ పండుగ
మనిషికి మనిషి తోడు నీడలా, మానవత్వం తో మసలే విధంగా, ఈర్ష్యా సూయలు నశిoచేలా ఐకమత్యమే ఏకైక శక్తి అనే మార్గాన్ని సూచించేది సోదర,సోదరీమణుల పండుగ
🌹🪔💐🌺💥🎉🌟
***

-యశోద గొట్టిపర్తి
Komentáře