'Rakshanedi' - New Telugu Story Written By Pitta Gopi
'రక్షణేది' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"ప్రస్తుతం ప్రపంచమంతా హత్యలు, ఆత్మహత్యలు, రేప్ లు, గ్యాంగ్ రేప్ లు, దోపిడీలు, దొంగతనాలు, మోసాలు, దౌర్జన్యాలతో నిండి కిటకిటలాడుతున్నది. డబ్బులు కోసం పరాయివారినే కాదు సొంత వాళ్ళని సైతం చంపుకునే రోజులు,
ఇక ఆడపడుచులు అంటే ఈ సమాజానికి లెక్కే లేదు.
ఎక్కడైనా ఆడపిల్లలు కనపడితే ఇంకో ఉద్దేశ్యం తో చూడటమే.. కొందరు ప్రేమ అని వెంటపడతారు, మరి కొందరు పెళ్ళి చేసుకో అంటూ వెంట పడతారు.
ప్రేమిస్తే తల్లిదండ్రులు, పెద్దల నుండి ఒక బాధ, ప్రేమించకపోతే ప్రియుడు ఏ యాసిడ్ పోసేస్తాడో.. లేక గొంతు కోసేస్తాడో.. లేక పొట్టలో ఎన్నిసార్లు కత్తితో పొడిచి చంపేస్తాడో తెలియని బాధ.
ప్రేమించేవాడు మంచోడైతే తల్లిదండ్రులు ఒప్పుకోరు, పెద్దలు చూసిన పెళ్ళైనా కట్నం వేదింపులు తప్పవు. అందంగా లేకపోతే అందంగా లేవంటారు.. అందంగా ఉంటే అనుమానంతో రగిలిపోతారు. ఏదైతేనేం నలిగిపోతుంది ఈ ఆడపిల్ల బతుకు.. "
కూర్చుని కూరగాయలు తరుగుతూ పురంధరేశ్వరి అంటున్న మాటలు ఇవి.
సైలాక్ అనే అమ్మాయికి యుక్త వయస్సు వచ్చి MBBS లో చేరి హాస్టల్ లో ఉండటంతో నానమ్మ పురంధరేశ్వరి ఆలోచనంతా మనుమరాలు మీదనే ఉంది.
"మా రోజుల్లో ఏ పగా లేదు ప్రతికారం లేదు. దొంగలు లేరు, దోపిడి దారులు లేరు. చక్కగా పెద్దలు కూర్చే పెళ్ళిరోజే కట్నకానుకలు, మంచిచెడులు మాట్లాడుతారు. అదే ఫైనల్. తర్వాత ఏ వేధింపులు ఉండవు.
కానీ ఇప్పుడు ఆడపిల్లలపై చెడు వార్తలు రాకుండా ఆసలు రోజు గడిచిందే లేదు. వీళ్ళకేమో.. అలవాటు అయిపోయిందో, లేక వీళ్ళు పుట్టిన నుండే ఈ దారుణాలు జరుగుతున్నాయనో ఏమో.. పట్టించుకోరు. పైగా దూరం పంపుతారు" అంటూ కొడుకు కోడల్ని తిడుతుంటుంది.
"అబ్బా ఏంటే ముసలి.. ఏదో ఒకటి గొణుగుతూనే ఉంటావు.. తన చదువు ఎలాగూ కొన్ని రోజుల్లో పూర్తి అయిపోతుందిగా. నీ మనుమరాలికి ఏమీ కాదు. తాను మహా శక్తివంతురాలు. అలాగే డాక్టర్ అయి తిరిగి వస్తుంది. ముందు నీకే వైద్యం చేయిస్తాలే" కొత్త చొక్కా వేసుకుంటూ తల్లి పురంధేశ్వరి ని ఆటపట్టిస్తాడు దాసు.
బుంగమూతి పెట్టి కొడుకుని వెక్కిరిస్తూ..
"హుమ్.. మనుమరాలితో ఆడుకోనివ్వకుండా చిన్నప్పుడు నుండే బాగా పే.. ద్ద.. చదువులని ఎక్కడో ఉంచి చదివించారు. ప్రేమగా ఒక ముద్దు పెట్టుకుందామన్నా.. హత్తుకుందామన్నా.. సాధ్యం కాదు " అంటూ బాదపడుతుంది.
"మోకాళ్ళ పై తల్లి దగ్గర కూర్చుని సైలాక్ MBBS పదిరోజుల ముందే పూర్తి అయిపోయిందమ్మా.. డాక్టర్ గా తన ప్రాక్టీస్ ఏర్పాట్లకు ఇన్ని రోజులయ్యాయి.
ఇప్పుడే ఫోన్ చేసింది. అందరూ వెళ్ళిపోయారట. తాను ఒక్కతే ఉందని, త్వరగా రమ్మని చెప్పింది. వెళ్లి తీసుకొస్తా " అంటూ నవ్వుతూ వెళ్తాడు.
సైలాక్ రాగానే నానమ్మ నే హత్తుకుంటుంది ముందు. ఎందుకంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు ఆఫీసుకి వెళ్ళిపోతే మంచి బుద్దులు నేర్పింది, దైర్యం నింపేది తానే, అన్ని చూసుకుంది తానే.
తల్లిదండ్రుల కంటే నానమ్మ కే ఎక్కువ విలువైన వస్తువులు తీసుకొచ్చింది సైలాక్. దీంతో పురంధేశ్వరి ఆనందానికి అడ్డే లేకుండా పోయింది. అక్కడి తో ఆగకుండా కొడుకు కోడలను వెక్కిరించింది.
అమ్మగా, అత్తగా ఆ వెక్కరింపులు, చిలిపిచేష్టలు చూసిన కొడుకు కోడలు చాలా ముచ్చట పడ్డారు.
కొన్నిరోజులు గడిచాయి. ఒకరోజు అర్దరాత్రి సమయంలో సైలాక్ ఫోన్ రింగ్ అయింది.. వెంటనే కిటికీ నుండి బయట ప్రపంచాన్ని చూసింది. చిమ్మ చీకటితో చలిగా ఉంది. అయినా లేచి దట్టంగా ఉన్న కోటు, హ్యాండ్ బ్యాగుతో ఇంట్లో చెప్పకుండా బయలుదేరింది.
మార్గం మద్యలో స్కూటి ఆగిపోయింది. ఎంత స్టార్ట్ చేసినా ఫలితం లేదు. చేతికున్న వాచ్ ను చూస్తూ.. "చ.. ఇప్పుడే పోవాలా.. ఈ స్కూటీ " అంటూ దాన్ని ఒక్క తన్ను తన్ని అక్కడ పెట్టి, గబగబా నడుస్తు ముందు కు వెళ్తుంది.
అలా వెళ్తూ.. వెళ్తూ.. పుట్పాత్ పై ఒక వ్యక్తి చలికి బాగా ఒణుకుతు పడుకోవటం చూసి వెనక్కి వచ్చి తన కోటు తీసి అతని పై కప్పుతుంది. అతను ఆ కోటుని దగ్గరగా తీసుకుని ఆమెను చూసి దండం పెట్టి పడుకుంటాడు.
కొంచెం ముందుకు వెళ్ళగా ముగ్గురు అకతాయిలు సైలాక్ కి ఎదురు పడతారు.
ఆమె పట్టించుకోకుండా వెళ్తుండగా ఆమెకు అడ్డుగా వస్తూ.. ఒకడు సైలాక్ చెయ్యి పట్టుకుని
"చాలా అందంగా ఉన్నావు. ఈ టైంలో మాకోసమే వస్తున్నావా.. " అంటాడు.
సైలాక్ కోపంతో ఆ చెయ్యి విడిపించుకుని "ఒరేయ్! మీ ఇంట్లో అమ్మనాన్న, అక్కచెళ్ళెళ్ళు లేర్రా " అంటుంది.
ఆ మాటలు వినగానే చలికి వణుకుతున్న వ్యక్తి వచ్చి సైలాక్ ఇచ్చిన కోటును, చీరలో ఉన్న సైలాక్ మీద వేసి "క్షమించమ్మ.. ఈ కోటు నాకు చలి నుండి మాత్రమే రక్షిస్తుంది. కానీ నీకు మాత్రం ఇలాంటి మృగాళ్ళ నుండి రక్షిస్తుంది. నాకు ఈ చలి బాధ కంటే అర్థరాత్రి సమయంలో ఒక ఆడబిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్ళటమే నాకు కావాలి " అంటాడు.
ఆ మాటలకు ముగ్గురు తలదించుకుంటారు.
"ఇంటికి కాదంకుల్.. మా పని మేం చేసుకోటానికి. నా పేరు సైలాక్. నేను డాక్టర్ ని. ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. దీంతో నా స్కూటీ పై బయలుదేరాను. కొద్ది దూరంలో అది పాడైంది. హాస్పిటల్ ఇక్కడ కి దగ్గర్లోనే కదా అని ఇలా నడుచుకుని వెళ్థున్నాను.
వీళ్ళింట్లో కూడా ఆడపిల్లలు ఉండే ఉంటారు. వాళ్ళకి మాత్రం ఏమీ కాకూడదు. వీళ్ళు మాత్రం ఇంకొకరిని ఏమైనా చేస్తారు. రేపటి రోజున వీళ్ళింట్లో ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళాల్సి వస్తే వాళ్ళకి ఇలాగే జరిగితే అప్పుడు ఆవేశంతో రగిలిపోతారు.
మనం ఈ రోజు మంచిగా ఉంటే రేపటి సమాజం నుండి ఆ మంచిని ఆశించగలం. గుర్తు పెట్టుకోండి " అని ముందుకు వెళ్తూ ఉండగా సైలాక్ ని ఆపి, క్షమించమని చెంపలు వేసుకుని, తమ వద్ద ఉన్న కోటు ఆ పేద పెద్దాయనకు ఇచ్చి, సైలాక్ కి రక్షణ గా హాస్పిటల్ వరకు వెళ్తారు ఆ ముగ్గురు అకతాయిలు.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం :
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
@user-lx2bb3on5h • 47 minutes ago
Supper