top of page
Original.png

సోషలిజాన్ని కలగన్న నాయకుడు లోహియా

57 minutes ago
4 min read

సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా – స్వాతంత్ర్యోద్యమం మరియు సమానత్వం కోసం పోరాడిన నాయకుడు

Socialogyni Kalakanna Nayakudu Lohiya - Telugu Social Article | Thokala Rajesham

సోషలిజాన్ని కలగన్న నాయకుడు లోహియా - తెలుగు సామాజిక వ్యాసం | తోకల రాజేశం

Published in manatelugukathalu.com on 23/11/2026


రామ్ మనోహర్ లోహియా భారత స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ సోషలిస్టు నాయకుడు. సమానత్వం, స్వేచ్ఛ, కుల నిర్మూలన, మహిళా సాధికారతపై ఆయన ప్రగతిశీల ఆలోచనలు నేటికీ సమాజానికి స్ఫూర్తినిస్తాయి.


భారత స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలక భాగస్వామ్యం కలిగిన ఆ తరం నాయకులలో చాలామంది బాగా విజ్ఞానవంతులు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివినవారు. 


రష్యా విప్లవంతో ప్రభావితులై, మార్క్సిజాన్ని అధ్యయనం చేసి, వాటిని భారతదేశ పరిస్థితుల నేపథ్యంలో అర్థం చేసుకుంటూ సోషలిస్టు పంథాను మనస్ఫూర్తిగా నమ్మి అందుకోసం పోరాటం చేయాలనే దృఢ నిశ్చయం కలవాళ్ళు. 


ఆ సోషలిస్టు నాయకగణానికి చెందిన విశిష్టమైన నాయకుడు రాం మనోహర్ లోహియా.

లోహియా తండ్రి హీరాలాల్ కాంగ్రెసులో ఉంటూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనేవాడు. 


ఆయనకు గల రాజకీయ సంబంధాలు చిన్నారి లోహియా మీద ప్రభావం చూపెట్టాయి. సెకండరీ విద్యలో ఉన్నప్పుడే నెహ్రూతో, గాంధీతో పరిచయాలు ఏర్పడ్డాయి. 


1920లో బాలగంగాధర తిలక్ మరణించినప్పుడు పదేళ్ల వయసుగల లోహియా తన నాయకత్వంలో విద్యార్థుల హర్తాళ్‌కు పిలుపునివ్వడంతో తన రాజకీయ జీవితం ఆరంభమైంది. 


ఇక్కడ విద్యాభ్యాసం పూర్తయ్యాక లోహియా 1933లో బెర్లిన్‌లోని హంబోల్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్.డి. పట్టా పొందాడు. 


ఉన్నత చదువుల కోసం విదేశాలలో ఉన్నప్పుడు 1930లో జెనీవాలో నానాజాతి సమావేశం జరిగింది. 


అక్కడికి ఆనాటి బ్రిటిషు ఇండియా ప్రతినిధిగా వచ్చిన బికనీర్ మహారాజుకు, బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికలకు లేఖ విడుదల చేశాడు. 


దానితో అంతర్జాతీయంగా లోహియా పేరు మారుమోగింది. దీంతో ప్రేరణ పొందిన లోహియా తన జీవితాన్ని పూర్తిగా రాజకీయాలకే అంకితం చేయాలనే నిర్ణయానికి వచ్చాడు.


"భార్యాపిల్లలు సంఘసేవకుడిని భ్రష్టు పట్టించవచ్చు"ననే అభిప్రాయంతో ఆయన వివాహానికి దూరంగా ఉండిపోయాడు. 


అట్లా అని ఆయన మహిళల పట్ల చిన్నచూపు గలవాడు కాదు. ఆయన మహిళలను ఇంట్లోనుంచి సమాజంలోకి తీసుకురావటానికి అనేక రకాలుగా ప్రోత్సాహాన్ని అందించేవాడు. 


"స్త్రీల సౌశీల్యాన్ని నిర్ణయించడానికి లైంగికపరమైన స్వచ్ఛతే కారణం కాదు" అని చెప్పగలిగేంత గొప్ప స్థాయిలో మహిళల గురించి ఆలోచించాడు. అనేక సందర్భాల్లో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయనకు మహిళా సాధికారత పట్ల గల చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తాయి.


లోహియా ఆలోచనలన్నీ ఆ కాలానికి ఎంతో ప్రగతిశీలంగా ఉండేవి. రాజకీయాల గురించి మాట్లాడినా, కులమతాల గురించి మాట్లాడినా ఆయన మీద ఎవరి ప్రభావాలు ఉండేవి కావు. 


స్వతంత్రమైన ఆలోచనాధోరణి కలిగిన నాయకుడు లోహియా. "తరచూ భారతదేశం మీద దండయాత్రలు జరగటానికి, మనం ఎక్కువ కాలం ఇలా పరాయి పాలనలో మగ్గిపోవటానికి మనలోమనకు ఐక్యత లేకుండా చేసిన కులమే కారణ"మని నిర్ధారణకు వచ్చాడు లోహియా. 


కులం విషయంలో ఈయన అభిప్రాయాలు చాలావరకు అంబేద్కర్ గారితో ఏకీభవిస్తాయి. 


అలాగే మతం గురించి కూడా చాలా శాస్త్రీయంగా మాట్లాడాడు. "మతం ఘర్షణను, ప్రస్తుత సామాజిక ఆర్థిక వ్యవస్థ యథాతథవాదాన్ని సమర్థించే ధోరణిని విడనాడాలి. 


ఆ పని చేయటానికి నిరాకరించే మతాన్ని ఈసడించాల్సిందే"నని ఒక సందర్భంలో పేర్కొన్నాడు. ఇది ఎంత పురోగమన దృష్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 


మతమైనా ఇంకొకటి అయినా శిలాసదృశంగా ఉండరాదని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రూపాంతరం చెందుతూ, మానవునిలో సరియైన మార్పు కలిగిస్తూ ఉండాలన్నది ఆయన అభిప్రాయం.


"పిరికి వాళ్ళు ఉండేచోట నిరంకుశులు వర్ధిల్లుతారు" అని నమ్మిన లోహియా ఎప్పుడూ ఎవరికీ తలవంచేవాడు కాదు. 


తాను చెప్పదల్చుకున్న విషయాన్ని ఎంత పెద్దవారైనప్పటికీ కొంత తీవ్రంగానే చెప్పేవాడు. 


లోహియా తన చిన్ననాటి మార్గదర్శకుడైన నెహ్రూను సైతం ఆయా సందర్భాలకు అనుగుణంగా తీవ్రంగా విమర్శించేవాడు. 


దీనికి కారణం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నెహ్రూ అవలంబించిన విధానాలు. 


"చరిత్ర గమనానికి గాంధీజీ చూపుడు వేలువంటి వారు" అని ఒక సందర్భంలో పొగిడిన లోహియా ఆయనతో కూడా మరికొన్ని సందర్భాలలో విభేదించాడు. 


మొదట్లో మార్క్స్ రచనలు శ్రద్ధగా అధ్యయనం చేసిన వాడే అయినా రష్యా, యూరప్ దేశాల తరహా సోషలిజం మనదేశానికి సరిపడదని ప్రకటించాడు. 


అలాగని ఆయన సోషలిస్టు కాదని చెప్పటానికి వీలు లేదు. స్వాతంత్ర్యం, సమానత్వం అనే భావనల ప్రాతిపదిక మీద సోషలిజం నిర్మాణం కావాలన్నాడాయన. 


ఈ దేశంలో ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని సాధించాలంటే దోపిడీ వర్గం చేతిలో ఉన్న కులం మరియు భాష అన్న రెండు ప్రధానమైన అస్త్రాలను లాక్కోవాలని చెప్పిన వాడు సోషలిస్టు కాక మరేమవుతాడు? ఈ నేపథ్యంలోనే ఆయన తన స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ "నేను మార్క్సిస్టు కాను, మార్క్సిస్టు వ్యతిరేకిని కాను. 


గాంధేయవాదిని కాను, గాంధీ వ్యతిరేకిని కాను" అని ఒకసారి ప్రకటించాడు. వ్యక్తి స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే లోహియా స్వతంత్ర వ్యక్తిత్వాన్ని కొందరు అహంకారంగా, అనాగరిక మనస్తత్వంగా అభివర్ణించారు కానీ ఆయన జీవితాచరణను పరిశీలించిన వాళ్ళెవరూ అలా అపార్థం చేసుకోలేరు.


ఆయన జీవితం నిరంతరం పోరాటాలతోనే గడిచింది. స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశాడు. 


దానికి అనుబంధంగా ఏర్పడిన "కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ" అధికార వారపత్రిక "కాంగ్రెస్ సోషలిస్టు"కు సంపాదకునిగా పనిచేశాడు. కలకత్తాలో విద్యార్థి, కార్మికోద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించాడు. 


రెండవ ప్రపంచ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ప్రచారాల వల్ల రెండుసార్లు జైల్లో నిర్బంధింపబడ్డాడు. 


1942, ఆగస్టులో బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా బొంబాయి, కలకత్తా కేంద్రాలుగా రహస్య రేడియో కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రసంగాల ద్వారా, వివిధ కార్యక్రమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశాడు. 


పోర్చుగీసు పాలనలో స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు కోల్పోయిన గోవా ప్రజల తరఫున నిలబడి ఉద్యమించాడు. 


అరెస్టు అయ్యాడు. దేశవిభజనను లోహియా మొదట వ్యతిరేకించాడు. 1947, ఫిబ్రవరిలో జరిగిన 'కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ' మహాసభలలో కాంగ్రెస్ అన్న పదాన్ని తీసేసి "సోషలిస్టు పార్టీ"గా మార్చాడు. 


1952లో ఆచార్య కృపలాని నేతృత్వంలోని 'కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ', లోహియా నేతృత్వంలోని సోషలిస్టు పార్టీని కలిపి "ప్రజా సోషలిస్టు పార్టీ"గా ఏర్పాటు చేశాడు. 


రెండుసార్లు ఓడిపోయిన తరువాత 1963లో జరిగిన ఉపఎన్నికల్లో ఫరూకాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. 


తానే ఒక ప్రతిపక్షంగా మారి నిరంతరం ప్రజాసమస్యలపై ఆనాటి ప్రభుత్వంతో అలుపెరుగని పోరాటం సలిపాడు. 


ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. బ్యాంక్ అకౌంటు లేదు. సొంత ఆస్తి ఏదీ లేదు. నిజమైన సోషలిస్టు ఎలా ఉంటాడో చెప్పాలనంటే రాం మనోహర్ లోహియాను చూపిస్తే సరిపోతుంది. 


సమసమాజం కోసం ఈ దేశంలో పోరాటాలు సాగినంత కాలం లోహియా స్ఫూర్తి నిలిచే ఉంటుంది.


***



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y








తోకల రాజేశం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



తోకల రాజేశం

రచయిత పరిచయం: నా పేరు తోకల రాజేశం.

తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024),ఆట సాగుతూనే ఉంటది(వచన కవిత్వం-2026)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page