top of page
Original.png

శుభం కార్డు పడేదాకా!

14 hours ago
2 min read

పాత తెలుగు కుటుంబ సినిమాలు, ఆధునిక యాక్షన్ సినిమాల మధ్య వ్యత్యాసాన్ని చూపించే చిత్రం — శుభం కార్డు పడేదాకా, కొత్త విరిత.
ఒకప్పుడు శుభం కార్డుతో కథ ముగిసేది… ఇప్పుడు మరో పార్ట్ కోసం ఎదురుచూపులు!

Subham Card Padedaka - Telugu Inspirational Article | Kotha Viritha

శుభం కార్డు పడేదాకా! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Published in manatelugukathalu.com on 20/11/2026


సినిమాలు మారాయా? ప్రేక్షకుల అభిరుచులు మారాయా? ప్రతి మార్పూ అభివృద్ధేనా?

ఈ ప్రశ్నలను తనదైన వ్యంగ్య శైలిలో సంధిస్తున్న కొత్త విరిత గారి ఆసక్తికరమైన రచన “శుభం కార్డు పడేదాకా!”



ఒకప్పుడు సినిమా చూస్తే హీరో కష్టాలు పడాలి, చివరికి హీరోయిన్ దక్కాలి, కుటుంబం కోసం త్యాగం చేయాలి అనుకునేవాళ్లం!


చేసిన తప్పు వెనుక మంచి ఉద్దేశం ఉందని జడ్జిగారు తీర్పిస్తే, అయ్యో పాపం హీరో అనుకుంటూ ఊపిరి పీల్చుకునేవాళ్లం! చివరి ఫ్రేమ్‌లో అందరూ నవ్వుతూ కనిపిస్తే, మన ముఖంలోనూ చిరునవ్వు వచ్చేది! చివరికి శుభం కార్డు పడితే, కథ సుఖాంతమైందని సంతృప్తిగా ఇంటికెళ్లేవాళ్లం!


ఇప్పుడు సినిమా అయిపోయినా కథ అయిపోకూడదు, మరో పార్ట్ రావాలి, దానికోసం ఇంకో మూడేళ్లు ఎదురుచూడాలి! కథలో విషయం కంటే బడ్జెట్ ఎంత, హీరో ఎవరిని ఎంత గట్టిగా కొట్టాడన్నదే ముఖ్యమైపోయింది! ఒకప్పుడు హీరో విలన్‌ని ఓడిస్తే చప్పట్లు కొట్టేవాళ్లం, ఇప్పుడు విలన్ కంటే హీరోనే భయంకరంగా ఉంటే ఈలలు వేస్తున్నాం! హింసను చూసి భయపడాల్సిన వయసులో, దాన్నే హీరోయిజంగా పూజించే స్థాయికి మన అభిరుచులు ఎదిగాయో, దిగజారాయో అర్థం కావడం లేదు!


ఒకప్పుడు సినిమా మనకు మంచి చెడుల మధ్య తేడా చెప్పేది, ఇప్పుడు చెడును ఎంత స్టైలిష్‌గా చూపించవచ్చో నేర్పిస్తోంది!


హీరో తప్పు చేసినా వందమందిని కొట్టాడంటే చాలు, అతని తప్పులన్నీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో కొట్టుకుపోతున్నాయి!


కుటుంబం కోసం త్యాగం చేసే హీరోల నుంచి, కుటుంబంతో కలిసి కూర్చుని చూడాలంటేనే ఆలోచించాల్సిన హీరోల దాకా వచ్చేశాం! కథలో కొత్తదనం లేకపోయినా విజువల్స్ భారీగా ఉంటే చాలు, ఆలోచించాల్సిన అవసరం ప్రేక్షకుడికి ఎందుకులే!


కాలం మారింది, సినిమాలు మారాయి, ప్రేక్షకుల ఆలోచనలూ మారాయి… కానీ ప్రతి మార్పునీ అభివృద్ధి అనుకోవడమే అసలు కామెడీ! ఒకప్పుడు సినిమా చివర్లో శుభం పడితే కథ పూర్తయిన సంతృప్తి ఉండేది… ఇప్పుడు శుభం పడితే కథ అయిపోయిందని కాదు, నిర్మాతకు ఇంకో పార్ట్ తీసే అవకాశం పోయిందేమోనని జాలి వస్తోంది!


***

కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక








మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Excellent 👌 👌 👌

Like
bottom of page