'Rendu Vandalu Mathrame' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 05/07/2024
'రెండు వందలు మాత్రమే' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"ఏమండీ! ఆ టీవీ లో వచ్చే కాఫీ యాడ్స్ లో చూపించినట్టుగా.. ఉదయాన్నే మీరు కాఫీ కప్పుతో.. నన్ను ప్రేమతో నిద్ర లేపొచ్చుగా.. ?"
"అంత అవసరం అంటావా స్వాతి.. ? మరి సినిమాలో చూపించినట్టుగా.. మొగుడునే నిద్రలేపి మరీ, పెళ్ళాం కాఫీ ఇస్తుందిగా స్వాతి.. ఎంతో రొమాంటిక్ గా.. "
"అవును అనుకోండి.. "
"ఏదేమైనా.. పెళ్ళాం చేతితో ఇచ్చే కాఫీయే అద్భుతం కదా స్వాతి.. "
"ఈ మాటే చెప్పి.. పెళ్లి అయి ఇన్నాళ్ళు అయినా, మీరు ఇంతవరకూ బయట కాఫీ షాప్ కు తీసుకుని వెళ్ళలేదుగా.. ?" అంటూ బుంగ మూతి పెట్టింది స్వాతి
"బయట బోలెడు డబ్బులు తీసుకుని ఇచ్చే కాఫీకి నీ చేతి రుచి వస్తుందా చెప్పు డియర్.. ? అయితే సరే.. ! ఈ సారి నీ పుట్టినరోజునాడు బయట కాఫీ తాగుదాం.. కానీ, నువ్వూ నాకు ఒక మాట ఇవ్వాలి.."
"ఏమిటో అది.. ఏదో ప్లాన్ వేసేసారు శ్రీవారు.. "
"ఆ రోజే చెబుతాను.. " అన్నాడు భర్త
పుట్టినరోజు ఉదయం..
"హ్యాపీ బర్త్ డే స్వాతి.. "
"థాంక్స్ అండి.. " అని భర్త కాళ్ళకి నమస్కరించింది స్వాతి
"సాయంత్రం కాఫీ షాప్ కి వెళ్దాము స్వాతి.. రెడీ అయి ఉండు.. "
"మొత్తానికి నన్ను కాఫీ షాప్ కి తీసుకుని వచ్చారు.. పెళ్ళైన ఇన్నాళ్ళకి.. " అని సంతోషంగా అంది స్వాతి
"చెప్పు డియర్.. ఇప్పుడు ఏం కాఫీ తాగుతావు.. ?
ఫిల్టర్ కాఫీ నా..
నార్మల్ కాఫీ నా..
కోల్డ్ కాఫీ నా..
బ్లాక్ కాఫీ నా..
ఐస్ కాఫీ నా..
ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ చూడు..
ఇంట్లో అయితే.. పెళ్ళాం ప్రేమతో ఇచ్చే చక్కని కాఫీ దొరుకుతుంది.. బయట మాత్రం ఎక్కువ డబ్బులకి చాలానే దొరుకుతాయి..
ఇప్పుడు మనం వచ్చింది ఒక కాఫీ షాప్ కి మాత్రమే.. ఇంకా సిటీ లో ఇలా చాలానే ఉన్నాయి.. ఇక్కడ నచ్చకపొతే చెప్పు.. మరో చోటుకు వెళ్దాము.. అక్కడ ఇంకా చాలా వెరైటీ కాఫీలు ఉంటాయి.. డబ్బులు కుడా ఎక్కువే అవుతాయి మరి.. " అన్నాడు భర్త
"ఇంతకీ.. ఎంతండి కప్పు కాఫీ.. ?"
"రెండు వందలు మాత్రమే.. అదే తక్కువ.. "
"అమ్మో.. ! రెండు వందలే.. అమృతం పోసి ఇస్తాడా ఏమిటి కప్పులో.. ?" అడిగింది స్వాతి
"ఏమో నువ్వే తాగి చెప్పు.. ?"
"వద్దులెండి.. వెళ్ళిపోదాం"
"పుట్టినరోజు కదా.. పర్వాలేదు.. రుచి చూడు.. "
"మీ కోసం తాగుతున్నాను.. సరేనా.. "
"సరే.. " అని చిన్న కప్పులో ఇచ్చిన ఖరీదైన కాఫీ సిప్ చేసింది స్వాతి
"దీనికన్నా.. నేను చేసిన కాఫీయే చాలా బాగుంటుంది కదా.. ఏమంటారు.. ?"
"అదే విషయం నేను ముందే చెప్పాను స్వాతి.. "
"ఆ రెండు వందలు పెడితే.. నేను చేసే కాఫీ.. రెండు నెలలు ఇద్దరమూ తాగొచ్చు.. " అంది స్వాతి
"నా శ్రీమతి తెలివైనదే.. "
"ఏమనుకున్నారు నా గురించి మరి.. ! ఇప్పుడు చెప్పండి శ్రీవారు.. మీ మాట ఏమిటో.. ?"
"అదా.. ! ప్రతిరోజూ ఉదయం.. నువ్వే నన్ను నిద్ర లేపి.. ప్రేమతో నీ చేతి కాఫీ ఇవ్వాలి.. ఎంతో రొమాంటిక్ గా" అని నవ్వుతూ అన్నాడు భర్త
"మొత్తానికి మీ మాటే నెగ్గించుకున్నారు కదా.. !" అని నవ్వుతూ అంది స్వాతి
************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments