రేపటి పౌరులు
- Addanki Lakshmi

- Jan 25
- 4 min read
#అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #RepatiPourulu, #రేపటిపౌరులు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Repati Pourulu - New Telugu Story Written By Addanki Lakshmi Published In manatelugukathalu.com On 25/01/2026
రేపటి పౌరులు - తెలుగు కథ
రచన: అద్దంకి లక్ష్మి
ఉదయమే లేచి పేపర్ చదువుకుంటున్నాడు శంకర్,
సెల్ ఫోన్ మోగింది.
"ఎవరూ? రవీ, నువ్వా! గుడ్ మార్నింగ్ రా!" అన్నాడు.
"నీకో శుభవార్త రా. ఈరోజు పేపర్లో ఫ్రంట్ పేజీలో మీ అబ్బాయి గురించి న్యూస్ వచ్చింది."
"మా అబ్బాయి గురించా? ఎందుకురా?" అన్నాడు ఆశ్చర్యపోతూ శంకర్.
"సమాజం పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది. చూసుకో. నీకు కంగ్రాట్యులేషన్స్. మీ కిషోర్‌తో కూడా చెప్పు"
అంటూ ఫోన్ పెట్టేశాడు రవి.
"ఎవరండీ ఫోను?" అంటూ వచ్చింది పద్మ వంటగదిలోంచి.
"మా ఫ్రెండ్ రవి ఫోన్ చేశాడు,
పేపర్లో మన అబ్బాయి ఫోటో వచ్చిందట,"
"మన అబ్బాయి ఫోటో ఎందుకు వచ్చింది? వీడేమైనా గొడవలు చేశాడా స్కూల్లోనూ?" అంటూ కంగారు పడిపోయింది పద్మ.
"కంగారు పడకు. పేపర్లో చూద్దాం.
ఏడీ వీడు? ఇంకా పడుకున్నాడా?"
"అవునండి, ఇంకా లేవలేదు.
ఈరోజు ఆదివారం కదా, మెల్లిగా లేస్తాడు.
ముందర ఆ పేపర్లో న్యూస్ ఏమిటో తొందరగా చూడండి. నాకు కంగారుగా ఉంది" పద్మ..
ఇంగ్లీషు పేపర్ అక్కడ పెట్టి, పక్కనే ఉన్న 'సమాజం' తెలుగు పేపర్ తీసుకున్నాడు శంకర్.
ఫ్రంట్ పేజీలో కింద
పెద్ద పిక్చర్ ఉంది.
అందులో చిన్న పిల్లలందరూ ఉన్నారు. సరి అయిన బట్టలు కూడా లేవు. నిక్కర్లు తొడుక్కున్నారు. చింపిరి జుట్టు. వాళ్ళందరి చేత జెండా ఎగరవేయిస్తున్న కిషోర్ ఉన్నాడు.
"ఇదిగోనే మన అబ్బాయి. ఈ అనాథ పిల్లలు రోడ్డుమీద చెత్తచెదారం ఏరుకుంటారు కదా, వాళ్ళచేత జెండా వందనం చేయిస్తున్నాడు చూడు" అంటూ పద్మకు చూపాడు, సంతోషంగా శంకర్.
"అదేమిటండీ, వీడికి ఇంత దేశభక్తి ఎప్పుడొచ్చింది?" అంటూ మురిసిపోయింది పద్మ.
"కింద రాసింది చదవండి!"
'రోడ్డు మీద ఉండే అనాథ పిల్లలతో జెండా వందనం చేయించి, వారికి జెండాలను పంచిపెట్టి, చాక్లెట్లను ఇస్తూ,
దేశభక్తి గురించి చక్కటి మాటలు చెప్పాడు చిరంజీవి కిషోర్. మన దేశానికి ఇటువంటి బాలురే రేపటి యువత. ఇలాంటి పిల్లలే కావాలి దేశానికి. చిన్నతనం నుంచే దేశభక్తిని అలవాటు చేస్తున్న వీరి తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు.
వీధి పిల్లలకు, వీధి బాలురకు సైతం దేశభక్తిని నూరిపోస్తున్న చిరంజీవి కిషోర్, ముందు ముందు భవిష్యత్తులో దేశానికి ఎంతో సేవ చేస్తారని ఆశిస్తున్నాము' అంటూ రాశారు.
శంకర్‌కు ఎంతో ఆనందమేసింది.
"వాడిని లేపు, చూపిద్దాము." అంటూ,
" ఒరేయ్ కిషోర్! లేవరా! నీ ఫోటో పేపర్లో వేశారు." అంటూ పద్మ పిలిచింది.
"ఏంటమ్మా! నా ఫోటో ఎందుకు పేపర్లో వేస్తారు?" అంటూ ఆశ్చర్యపోతూ వచ్చాడు.
పేపర్లో ఆ బొమ్మ చూసేసరికి వాడికి అర్థమైంది.
"ఇదా అమ్మా! మొన్న రిపబ్లిక్ డే జరిగింది కదా, ఆ రోజు రిపబ్లిక్ డే దినోత్సవం అయింది కదా, స్కూల్ నుంచి వస్తున్నాము. నేను, నా ఫ్రెండ్,
రోడ్డు మీద ఈ పిల్లలందరూ ఆడుకుంటూ కనిపించారు.
వీళ్ళ చేత కూడా మా బడిలో మా చేత చేయించారు కదా, అలాగే రిపబ్లిక్ డే దినోత్సవం చేద్దాం అని,
పాపం వీళ్ళకేం తెలియదు కదా నాన్న. వీళ్ళు బడికి వెళ్లరు కదా. అందుచేత వాళ్ళందర్నీ పిలిచి, అక్కడొక స్తంభం ఉంది దానికి మా చేతిలో ఉన్న జెండాను కట్టి,
పిల్లలందరి చేత దేశభక్తి గీతాన్ని పాడించి,
వాళ్ళకి మన నెహ్రూ గారి గురించి, జాతిపిత గాంధీ గారి గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, రాణీ లక్ష్మీబాయి గురించి వాళ్ళు కష్టపడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినది అన్నీ వివరించి చెప్పాము నేను, నా ఫ్రెండ్ అనిల్.
బ్రిటిష్ వారు మనలను ఎన్ని బాధలు పెట్టారో, దాని గురించి ఎంతమంది ప్రాణం త్యాగం చేశారు ఆ అమరవీరులు అన్నీ వాళ్లకు తెలియ చెప్పాము.
ఇంతలో అలా ఎవరో స్కూటర్ మీద ఒక అంకుల్ వెళ్తున్నారు.
ఆయన మమ్మల్ని చూసి ఎంతో ముచ్చట పడ్డారు.
వెంటనే మేము చేస్తున్నది అంతా సెల్ ఫోన్లో రికార్డు చేశారు.
మా అందరి ఫోటోలు తీశారు.
ఆ పక్కనే షాపుకెళ్లి జెండాలు, స్వీట్లు తెచ్చి,
నాకు ఇచ్చి మా అందరికీ పంచి పెట్టమన్నారు.
మమ్మల్ని ఎంతో మెచ్చుకున్నారు.
మీలాంటి వారే దేశానికి కావాలి నాయనా అంటూ ఆనందపడ్డారు. బహుశా ఆయనే పేపర్‌కు పంపించి ఉంటారు డాడీ," అంటూ చెప్పాడు కిషోర్.
"నాన్నా! నేను పెద్దయ్యాక మిలట్రీలో చేరుతాను. దేశం గురించి పోరాడతాను." అన్నాడు ఆవేశంగా కిషోర్.
"మంచిదే రా! చిన్నప్పటి నుంచే ఇటువంటి ఆశయాలు కలిగి ఉండాలి.
దేశం గురించి పోరాడాలి.
మన చుట్టూ ఉన్న శత్రువులను నుంచి దేశాన్ని కాపాడాలి.
నువ్వు తప్పకుండా పెద్దయ్యాక మిలట్రీలో చేరు!"
అన్నాడు ఆవేశంగా శంకర్.
పిల్లవాడిని చూసి ఎంతో ఆనందమేసింది.
పద్మకు తన పిల్లవాడు చిన్నతనంలోనే ఇంత దేశభక్తిని చూపించడం, ఆమెకు ఎంతో ఆనందమైంది. దగ్గరికి తీసుకుని పిల్లవాడిని
ముద్దు పెట్టుకుంది.
'దేశభక్తి అనేది ఎవరికి వాళ్ళకి రక్తంలో జీర్ణించుకుపోయి ఉంటుంది.
అవసరమైతే ఇటువంటి వాళ్లే దేశం గురించి పోరాడతారు' అనుకున్నాడు శంకర్.
పిల్లవాడిని చూసి ఎంతో గర్వపడ్డాడు.
వీరే రేపటి భావి పౌరులు.
తల్లిదండ్రులకు, మాతృదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేవారు.
భారత్ మాతా కీ జై.
***
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,




Comments